ఇంటర్ బోర్డ్ తప్పిదం..పోటీతోనేనా..క్షమించరాని నేరం ఇది


ఇంటర్ రిజల్ట్స్ వచ్చిన రోజే తెలంగాణలో  ఓ మౌనిక ఒక్క సబ్జెక్ట్ తప్పడంతో సూసైడ్ చేసుకుందనే స్క్రోలింగ్ చదివాం..ఒక్క సబ్జెక్ట్ తప్పితే చచ్చిపోవాలా ..ఇదీ నా ఫస్ట్ రియాక్షన్..ఎందుకంటే..రీ వెరిఫికేషన్ ఉంది..రీ కౌంటింగ్ ఉంది..పర్సనల్ వెరిఫికేషన్ ఉంది..ఇన్ని ప్రక్రియలు అకడమిక్‌గా చేసుకోవచ్చనేది అందులో భావం..ఆ తర్వాత అసలు ఓసారి తప్పితే తిరిగి రాసుకోవచ్చు కదా అనేది జనరల్ ఒపీనియన్..ఎందుకంటే చదువులు మార్కులు ఇవేనా జీవితం..
కానీ ఆ తర్వాత ఓ ఛానల్ ఏపీ ఇంటర్ బోర్డ్ రిజల్ట్స్ ఇచ్చింది కాబట్టి మనం కూడా తొందరగా ఇవ్వాలనే పోటీతో తెలంగాణ ఇంటర్ బోర్డ్ హడావుడిగా రిజల్ట్స్ ఇచ్చేసింది దాంతో..పరీక్ష రాసినోడికి కూడా ఆబ్సెంట్ అని మార్క్స్ లిస్ట్ లో వచ్చింది అంటూ ఆ రాత్రే మరో బ్రేకింగ్ పెట్టింది..ఆ రోజు నుంచి నిన్నటిదాకా సదరు ఛానల్ ఇంటర్ బోర్డ్ నిర్వాకాన్ని ఎండగట్టింది..దాని బాటలోనే మిగిలిన ఛానళ్లు నడిచాయ్..మీడియాని తిట్టిపోసేవాళ్లకి అందులోని మంచికోణం ఏంటో కూడా దీంతో తెలుసుకోవచ్చు..

ఒక్క సారీనో..మెమోలూ తీసుకొస్తే సరిచేస్తామనో సమాధానమే అన్ని సమస్యలకి పరిష్కారం అయితే..ఎక్కడో అదిలాబాద్‌లో వాళ్లు..తిరిగి హైదరాబాద్ బోర్డ్ వరకూ వచ్చి సరిచేయించుకని వెళ్లాలా...అసలు పరీక్షకి హాజరైనవాడికి ఆబ్సెంట్ రానివాడికి పాస్ అని ఎలా ఎంట్రీ వేయగలుగుతారు..? ఇది పిల్లల భవిష్యత్తుతో చెలగాటం కాదా..ఎందుకంటే అరశాతం తేడాతో ఫస్ట్ క్లాస్ పోతేనే జీవితాంతం దాన్ని మోస్తూ భరించాలి..అలాంటిది పాస్ కావాల్సినోడికి తప్పినట్లు వేస్తే అదెంత శిక్ష..టిడిపి లీడర్ సిఎం రమేష్ మేనల్లుడు సూసైడ్ కూడా  ఇంటర్ బోర్డ్ నిర్వాకంతోనే అని తేలిందనుకోండి( ఎగ్జామినర్లు..వేల్యేయేషన్ సిబ్బందికి ఎవడి పేపరేదో తెలీదనుకోండి) అతగాడు వేసే అపనిందలు కూడా మోయాల్సిందేగా ..రోజుకి 60 పేపర్లు..దిద్దడం ఎవరికైనా సాధ్యమేనా..పైగా ఈ రోజుల్లో కూడా ఇఁటర్మీడియేట్ పాస్ పర్సెంటేజ్ 58శాతం అంటే..ఎంత ిసిగ్గుచేటు..ఎందుకంటే 600/599లో అప్పనంగా కట్టబెడుతుంటే..42శాతం మంది తప్పడం సర్కారీ చదువుల అధ్వాన్నస్థితికి నిదర్శనం కాదా..


Comments