ఇదీ రాజకీయం నేర్చుకోండి..ఛీ..సిగ్గులేని బతుకులు వెంకయ్యనాయుడు ఏం చేస్తాడో మరి


టిడిపి నుంచి యలమంచిలి సత్యనారాయణ, సిఎం రమేష్, గరికపాటి, టిజి వెంకటేష్ బిజెపిలో చేరతారట..చేరిపోయారట..ఇంతకంటే నిస్సిగ్గుతనం ఇంకేమైనా ఉందా..ఈ వరసలో మొదటి ఇద్దరూ ఆ పార్టీలోనే ఉండి..ఆ పార్టీకి కావల్సినంత సరంజామా సరఫరా చేసి దానికి ప్రతిగా ప్రాజెక్టులు..పవర్‌లు పొంది ఓ పార్టీలో రాజ్యం చెలాయించినవాళ్లు..కులపరంగానూ పార్టీకి కావాల్సినంత ఆప్తులు

అలాంటిది పార్టీ వదిలి వేరే పార్టీలోకి జంప్ కొడుతున్నారంటే పాపం ఆయా వర్గాలకు మింగుడుపడని అంశమే
కానీ..అసలు జనం దీనిపై స్పందించేలోగానే..వీరి క్యాడరే ఇంకో రకం స్పందనని జనంలోకి తీసుకెళ్తున్నారు..ఆ ఏం చేస్తాం కేసులుపెడతారు..వేధిస్తారు అందుకనే పార్టీ మారుతున్నారు. ఇందులో తప్పేం ఉందని.. కానీ వాస్తవం ఏమిటంటే..పార్టీ మారగానే కేసులు రద్దు కావడం అనేది జరగదు..మొదటి ఇద్దరిపై ఉన్న కేసులు ఎక్కడకీ పోవు..

ఇంకో వాదన ఏమిటంటే..చంద్రబాబుకి వీళ్ల జంపింగ్ వ్యవహారం తెలుసు కాబట్టే..దేశంలో లేకుండా విదేశాలకు చెక్కేశారని..దీంతో ఎటూ తన స్పందన జనం ముందు ఇవ్వాల్సిన అవసరం లేదు..ఎటూ ఇక ఎన్నికల సమయంలో కానీ వీళ్ల అవసరం లేదు..ఇంకో వాదన ఏమిటంటే.. మిస్టర్ బాబుపై కేసులు విచారణ జరగకుండా ఉండేందుకు బాబుగారే ఇలా పంపిస్తున్నారంటున్నారు.ఐతే ఇన్ని వాదనల మధ్య ఒక్కరూ గుర్తించనిది ఏమిటంటే..ఏ పార్టీలపైనైతే పోరాడారో..వారితోనే కలవడానికి వీరికి సిగ్గులేదా అనేదే..పైగా రాష్ట్రానికి అన్యాయం చేసారంటూ
ఆరోపణలు గుప్పించిన పార్టీలోనే చేరడంపై జనం ఏమని అనుకుంటారో కూడా ఆలోచించరా..

ఇప్పుడు వెంకయ్యనాయుడు ఏం చేస్తారు..అప్పట్లో శరద్ యాదవ్‌ని రాజ్యసభ సభ్యత్వం నుంచి పీకిపారేసిన ఆయన..మరి ఈ నలుగురిపై మాత్రం వే్టు వేయడా వేయకుండా కలిపిస్తాడా చూద్దాం












Comments

  1. పచ్చ పార్టీ జాతకం ప్రకారం సంక్షోభాలు ఆగస్టులోనే జరగాలి. ఇప్పుడింకా సదరు పుణ్యమహూర్తం రాలేదు, పైగా నారాసుర కుటుంబం మొత్తం విదేశీయానం పేరిట alibi ఏర్పరుచుకున్నారు కనుక దీన్ని carefully scripted family entertainment drama అనే అనుకుందాం.

    గతంలో ఓటుకు నోటు కేసు దరిమిలా బాబోరి అనుంగు అనుచరుడు రేవంతుడు పచ్చంగీ ఇప్పిపడేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. మనోడిని ముందు పంపించి ఆనంక బాహాట పొత్తు ట్రై చేసుకోవచ్చన్న పాత ఫార్ములా మళ్ళీ అమలులోకి వచ్చినట్టుంది.

    ఉన్నది మొత్తం ఆరుగురు. అందులో నలుగురు జంపింగులు 2/3 మెజారిటీ అవుతారు కనుక చట్టపరంగా ఇబ్బంది రాదు.

    వెంకయ్య నాయుడు ఎటుతిరిగీ పేరుకే బీజేపీ. అతడూ ఇదే బాపతు ఫార్వార్డ్/సీక్రెట్ (నాట్ సో సీక్రెట్) కోవర్టు, అనగా వడ్డించే వాడు అసమదీయుడే.

    మున్ముందు మోడీకి కాలి తేడా ఏదయినా కొడితే (ఉ. కోవర్ట్ నాయుడి పదవి మురిగిసి/ముణిగి) ఎందుకయినా మంచిదని బాబు తన ఆస్థాన "లయర్" కనకమేడలను మాత్రం అట్టే పెట్టేసుకున్నాడు.

    గరుడ పురాణం సినీ జీరో శవాజీ నెక్స్ట్ జంపో ఏమో? వేచిచూడండి త్వరలో వెండితెరపై విడుదల.

    ReplyDelete
  2. తెలంగాణాకి చెందిన వనం జ్వాలా నరసింహారావు గారు ఒక మాటన్నారు. 5 సం లకు ఒకసారి పార్టీలను మార్చే జనానికి సిగ్గులేనపుడు నాయకులకు మాత్రం సిగ్గుండాలా అని "నిస్సిగ్గు"గా అడిగారు.

    ReplyDelete
    Replies
    1. వనం గారు అన్న ఆ మాట ఆయనకైనా అర్థమైతే సంతోషం.‌ వారి థియరీ ఏమిటో ఇతరులకు అర్థమవడం కష్టం.

      Delete
    2. @🦁,
      వనం గారికి క్లారిటీ ఉందండీ ! ఆయన కేసీఆర్ లాంటి నియంతని కోరుకుంటున్నారు.

      Delete
    3. * సరి లేరు నీకెవ్వరూ .. చంద్రశేఖరా .. సరి లేరు నీకెవ్వరూ
      * ఏరా మనతోటి గెలిచే వీరులెవ్వరురా, భళాభళి ధీరులెవ్వరురా
      --------------
      👆ఇదొకటే ఉన్న "క్లారిటీ" అనిపిస్తుంది.
      నేను వారి బ్లాగ్ వ్రాతలు చదవడం మానేసి చాలా రోజులయింది.

      Delete
  3. పాతాళాన్ని తాకిన రాజకీయ దిగజారుడుతనం. ఇటువంటి వ్యక్తుల గురించి చర్చించడం కూడా దండగ.

    ReplyDelete
  4. మొత్తానికి తెలుగువాళ్ళనిపించుకున్నారు.

    ReplyDelete
  5. 'మీరు ఓడిపోవడం ఏమిటయ్యా!- ఈ దశాబ్దపు పచ్చ కామిడీ.

    ReplyDelete

Post a Comment