అచ్చెనాయుడిపై స్పీకర్ ఫైర్ భేషబ్బా


కాళేశ్వరం ప్రాజెక్టు పై సభలో రభస జరగతా ఉంటే...చంద్రబాబుని అనుచితంగా కామెంట్ చేశాడంటూ అచ్చెనాయుడు లేవడం..స్పీకర్ అడ్డుపడటం ఒకెత్తు అయితే...సభలో అప్పోజిషన్...పవర్ పార్టీ మధ్య కాకుండా..స్పీకర్ వర్సెస్ అచ్చెనాయుడులా దాదాపు పావుగంట సేపు జరిగిన యవ్వారం బాగా అట్రాక్షన్ అని చెప్పాలి

సభలో తానెందుకు కాళేసశ్వరం వెళ్లింది..జగన్ చెప్తే..ఎందుకు వెళ్లకూడదో..డీల్ తో ఎలాంటి నష్టాలు వస్తాయని తాను అనుకుంటుందీ చంద్రబాబు చెప్పారు..దానిపై ముఖ్యమంత్రి జగన్ రిప్లై ఇవ్వడంతోనే దాన్ని క్లోజ్ చేస్తున్నట్లు
స్పీకర్ తమ్మినేని సీతారం చెప్పడంతో అచ్చెనాయుడి ఎపిసోడ్ ప్రారంభమైంది..అక్కడికి అన్నీ జ గన్కే  ఏదో తెలుసని..మాకేదీ తెలీదని..చేతులతో అటూ ఇటూ శెలగపారతో దోస్తున్నట్లు అభినయించగానే స్పీకర్ కి ఎక్కడో కాలినట్లుంది.వెంటనే డైరక్ట్ గా అచ్చెనాయుడితోనే ఆయన మాట్లాడటం మొదలెట్టేశాడు..ఇలా కాదండీ
ఈ ఫామ్ కాదు..వేరేలా రాండి సామీ అని చెప్తున్నా అచ్చెనాయుడు విన్పించుకోకుండా...ఏదేదో మాట్లాడేశ్తుంటే...స్పీకర్ ఆయనపై మండిపడటం హైలైట్..ఇది బహశా పేపర్లు కవర్ చేయకపోవచ్చేమో కానీ..అచ్చెనాయుడు అచ్చోసిన ఆంబోతులా మాట్లాడుతూనే పోయాడు

ఓ దశలో స్పీకర్ కూడా సైలెంట్ గా వాచ్ చేయాల్సిన పరిస్తితి..చెప్పీ చెప్పీ నోరు నొప్పి పుట్టిన తర్వాతే అచ్చెనాయుడి మాటల ప్రవాహానికి బ్రేక్ పడింది..అప్పుడే స్పీకర్ మళ్లీ రూల్సన్నీ చెప్పి..ఇలా చేస్తేనే సభ నడుస్తంది..లేదంటే లేదు అన్నట్లు చెప్పాడు..బిఎ సీ మీటింగ్ లో సభ ఎలా ఉండాలన్న అంశంపై కూడా అచ్చెనాయుడు జోకులు వేయడంతో దానిపైనా క్లాస్ పీకాడు..కానీ ఈ అరగంట గ్యాప్ లో మాత్రం ఓడిపోయామన్న బాధ..దుగ్ధ..అచ్చెనాయుడి ప్రతి మాటలో..ప్రతి హావభావంలో కన్పించింది..లేకపోతే..ఇరిగేషన్ గురించి మీ దగ్గర చెప్పించుకోవాల్సిన దుస్థితి పట్టింది అనే డైలాగ్ పదే పదే వాడుతున్నాడంటే...ఆయన ప్ఱస్ట్రేషన్ ఏంటి..బహశా స్పీకర్ సస్పెండ్ అంటూ చేస్తే...ఫస్ట్ అచ్చెనాయుడే సస్పండ్ అవుతాడేమో 

Comments