ఇదీ జగన్ అంటే..శ్రీధర్ రెడ్డి అరెస్ట్ ఎపిసోడ్‌పై సిఎంపై ప్రశంసలు


ఎమ్మార్వో వనజాక్షి వ్యవహారంలో ఏ స్థాయిలో విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గని నైజం అప్పటి దెందలూరు ఎమ్మెల్యే చింతమనేనిదైతే మావాడేం తప్పు చేశాడు..అసలు నిగ్గు తేల్చేవరకూ ఎలాంటి చర్యలు తీసుకోమంటూ ఐదేళ్లూ గడిపిన ఘనత ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ హీరోగారిది మరి ఇప్పుడు వెంకటాచలం ఎంపిడిఓ వ్యవహారం చూస్తే..అది కాదు..ఎమ్మెల్యే ఆమెని బెదిరించారంటున్నారు..ఆమె పద్దతిగా కేసు పెట్టింది..పోలీసులు కూడా ఎమ్మెల్యేని అరెస్ట్ చేశారు..ఇది కాదా ప్రభుత్వం వ్యవహరించాల్సిన తీరు..దీన్ని కాదా..టిడిపి నేతలు నేర్చుకోవాల్సింది
పైగా సిఎం జగన్ అఫిషియల్స్‌తో అనుచితంగా వ్యవహరిస్తే..ఎవ్వరినీ వదిలిపెట్టొద్దని డైరక్ట్ గా చెప్పడం..దాన్ని ఆచరించి చూపడం చూస్తే..ఖచ్చితంగా గత ఐదేళ్ల పాలనకి ఇప్పటి పాలనకు తేడా తెలిసిపోతుంది..

అనవసరంగా కోడిగుడ్డుని పట్టుకొచ్చి దానికి పచ్చ రంగు పూసి..ఈకలు పీకుదామనే వెధవలకు ఈ తేడా అర్ధం కాదు కానీ..ఈ ఎపిసోడ్‌ని నిశితంగా గమనిస్తే...ఏపీలో అధికారులపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు పట్టు లేదని క్లియర్ గా అర్ధం అవుతుంది..అధికారులు అధికారపార్టీ చెప్పినట్లు ఆడుతున్నారనే రొటీన్ డైలాగ్స్ ఇప్పుడు వేయడానికి లేదు..ఎవరి పని వారు చేస్తారు..తప్పు చేస్తే..వారు కానీ వీరు కానీ..ఎవరిపైనైనా వేటు
పడుతుంది..ఇది లేట్ కావచ్చు..వెంటనే కావచ్చు

ఎంపిడిఓ వ్యవహారశైలి చూస్తే..ఆమెపై దుర్భాషలాడారని..ఆమె కంప్లైంట్..దానికి పోలీసులు స్పందించారు..కేసు ఇక కోర్టుకి వెళ్తుంది..కానీ ఆ తర్వాత ఆమె ఓ టీవి ఛానల్‌తో మాట్లాడటమెందుకు..తన ఇఁట్లో కరెంట్ కట్ చేసారని..ఇంటి ముందు చెత్త బుట్ట పెట్టారని..ఇలా సిల్లీగా ఆరోపణలు చేశారామె సరే ఇవి సిల్లీ కాదు బాగా కష్టాలే అనుకుంటే..ఆ విషయం కూడా కంప్లైంట్ లో పెట్టాలి..ఇక నిజం ఏంటన్నది విచారణలో తేలుతుందని  వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి చెప్తున్నాడు..నాది తప్పుందంటే సరళ తల్లి కాళ్లు పట్టుకుంటానంటున్నాడు.

ఈ మాత్రం దమ్మూ ధైర్యం అప్పట్లో టిడిపి పెద్దలు చూపించి ఉంటే... ఈ23 సీట్ల అగచాట్లు తప్పేవి కదా...పోయిన ఐదేళ్లే కాదు..అంతకు ముందెప్పుడైనా అధికారం వెలగబెట్టిన సమయంలో ఒక్క టిడిపి లీడరైనా ఇలా అరెస్టయ్యాడా..ఎన్ని దురాగతాలు చేసినా...అధికారాన్ని అడ్డంపెట్టుకుని..ఊరేగారు తప్ప..చివరికి ఏమైంది..కలపదొంగలుగా చరిత్రహీనులుగా మిగలాల్సి వచ్చింది..అందుకే ఇదీ చంద్రబాబుకి జగన్‌కి తేడా అని జనం అనుకుంటే ఆశ్చర్యం ఏముంది

Comments