పదవి కోసం ఇంతగా జారాలా...ఇదీ బిజెపి మార్క్ విలువలు


హర్యానాలో రాజకీయపరిణామాలు వేగంగా మారిపోయాయ్. కింగ్ మేకర్ కి ఓ పదవి పడేసి .పీఠం  ఎక్కేందుకు  బిజెపి చకచకా మెట్లెక్కుతూ పోతోంది..అది పైకో..కిందకో తర్వాత తేలుతుంది..కానీ మరీ ఇంతగా నేరగాళ్ల సపోర్ట్ తో గద్దెనెక్కడం ఏంటంటూ . సొంత పార్టీ నుంచే ఎకసెక్కాలు మొదలయ్యాయ్
దుష్యంత్ చౌతాలా అనబడు ఓం ప్రకాష్ చౌతాల మనవడు ఓ పదిమంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నాడు..దీంతో అతగాడికి ఓ పదవి పడేసి..సిఎఁ పోస్ట్ మాత్రం తమ దగ్గరే అట్టిపెట్టుకునే ప్లానేసింది..బిజెపి..ఇదే పని కాంగ్రెస్ కూడా చేయాలనకుంది..కానీ చేయలేకపోయింది..90 సీట్లలో బిజెపికి 40 వచ్చాయ్..కావాల్సిందింకా ఆరుగురు..ఇదిగో మేం ఉన్నాం మా ఫుల్ సపోర్ట్ మీకేనంటూ..బిజెపికి రణ్‌ధీర్ గోలెన్, బాలరాజ్ కుండు,, రాకేశ్ దౌలతాబాద్, సోమ్‌వీర్ సంఘ్వాన్, నయన్‌పాల్ రావత్,ధరమ్‌పాల్, గోపాల్ కందాతో పాటు రణ్‌జీత్ సింగ్ చౌతాలా, అభయ్ చౌతాలా మద్దతు ప్రకటించారు..వీరిలో రణ్‌జీత్ సింగ్ చౌతాలా దుష్యంత్ సింగ్ చౌతాలా తాత వరసకాగా.. అభయ్ చౌతాలా పెదనాన్న అవుతారు.
ఔను కాంగ్రెస్ కూడా తక్కువేం తినలేదు.. కాంగ్రెస్ కూడా ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల మద్దతు కోసం చివరిదాకా ప్రయత్నించింది.. అసలు ప్రజల తీర్పు బిజెపికి వ్యతిరేకంగా ఇస్తే.. ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు ఆ పార్టీకి ఎలా మద్దతిస్తారని ప్రశ్నించింది. ఇది వారి గొయ్యి వారు తవ్వుకున్నట్లే దీపేందర్ సింగ్ హుడా శాపనార్దాలు పెట్టాడు కూడా ఇది నిజమే అయి ఉండొచ్చు..కానీ మాకు అలాంటి సిగ్గూ శరాలు లేవ్...ప్రస్తుతంలోనే బతుకుతాం నువ్వెవడివిరా బాబూ చేతనైతే నువ్వూ రా..నీకో తాయిలం  ఇస్తామనగల ఘనులు వీళ్లంతా..

ఇక్కడే  గోపాల్ కందా అనే ఇండిపెండెంట్ ఎమ్మెల్యే మద్దతు తీసుకోవడంపై బిజెపిలోనే అగ్రనేతలు విమర్శలు ప్రారంభించారు. ఎందుకూ..ఎందుకంటే..సదరు గోపాల్ గారు..2012లో ఓ ఎయిర్ హోస్టెస్ ని రేప్ చేశాడు..ఆ తర్వాత ఆమె సూసైడ్ చేసుకుంది..ఆమె తల్లి కూడా అదేలా సూసైడ్ చేసుకుంది..కేసు నడుస్తుండగానే...దేనికీ అంటే సదరు గోపాల్ కందాగాడి నిర్వాకమే అంటారు..అంటే డబ్బు బలంతో కేసుని మూసేయడానికి అవసరమైన పనులన్నీ చేసేసాడు..కోర్టు ఏం చేస్తుంది బెయిల్ ఇస్తుంది. పైగా ఇతగాడు చిత్తకార్తె కుక్కలాగా కాస్త అందంగా కన్పించిన ఏ ఆడదాన్నైనా వెంటపడే చరిత్ర ఉందిట. ఈడికి వ్యతిరేకంగానే 2012లో బిజెపి బోలెడంత యాగీ చేస్తే కాంగ్రెస్ యాక్షన్ తీసుకుంది..ఇప్పుడు ..మరిలాంటివాడిని నెత్తిన బెట్టుకుని అయ్యా మోదీ..నువ్ చెప్పే నీతులేందయ్యా అని ఉమాభారతి కడిగేసింది..ఐనా..సరే ఎవడు పట్టించుకుంటాడు..కానీ సదరు ఎయిర్ హోస్టెస్ బ్రదర్ మాత్రం ఓ మాట అన్నాడు..గోపాల్ కందా లాంటి యెదవకి పదవులు కూడా కట్టబెడితే..ఇక ఎవడు ఈ దేశాన్ని కాపాడేది అని...నిజమే కదా మరి

Comments

  1. ఆ గోపాల్ కందాను ఎన్నుకున్న ఓటర్లను ఏమనాలి.

    ReplyDelete
  2. పులిరాజాకి ఎయిడ్స్ వస్తే తప్ప ఈ దేశాన్ని ఎవడూ బాగుచేయలేడు!

    ReplyDelete

Post a Comment