ఇంతకీ వాళ్లకేం కావాలి సిలికానాంధ్ర ఆసుపత్రి మూతబడాలా..?


నాలుగు రోజుల నుంచీ ఒకటే పనిగా సిలికానాంధ్ర సంజీవనిపై రెండు మూడు ఛానళ్లు స్టోరీలు మీద స్టోరీలు వెబ్ సిరీస్‌లా వేసేస్తున్నాయ్..ఇంతకీ వాటికేం కావాలి..ఆసుపత్రి మూతబడాలా..లేక విరాళాలు వెనక్కి ఇచ్చేయాలా..?
మార్గదర్శి డిపాజిట్లు వెనక్కి ఇవ్వమని అందరూ మీద పడితే..దివాలా తీయకుండా ఉండదు..కానీ అలా మీదపడకుండా చేయడంలో ఈనాడు మార్గదర్సులు తెలివిగా వ్యవహరించారు..కానీ మరి ఇక్కడ సంజీవిని ఆసుపత్రి విషయంలో ఛార్జీల వసూలు విషయంలో ఎక్కువ తక్కువ అనే బేధం లేదు..ఎందుకంటే..ఈ ఒక్క ఆ సుపత్రి మాత్రమే కాదు..ఏ ఆసుపత్రిలోనైనా ఇదే తీరు కాబట్టి

కాకపోతే ఏదో చెప్పి ఏదో చేసి..సొమ్ములు వెనకేసుకోవడం మాత్రం మహాపాపమే..నేరమే..దానికి ఇప్పుడు శిక్ష ఎవరికి పడాలి..అందులో పనిచేసే డాక్టర్లకా..సొమ్మూలు వసూలు చేసిన వలిచేటి రవిబాబుకా..లేక తెలుగాట అంటూ ఆటాడించిన కూచిభోట్ల ఆనంద్‌కా..ఏం కోరుకుంటున్నారు

మనల్ని ఒకడు వెదవ అని ప్రూవ్ చేసాడంటే..వాడినే తిరిగి అంతకన్నా వెధవ అని ప్రూవ్ చేస్తే చాలు..మనం పునీతులైపోతాం..ఈ స్ట్రాటజీనే ఈ వ్యవహారం వెనుక ఉందా..ఐతే ఒకటి యెదవలను మళ్లీ ఇంకొకడు యెదవ అని రుజువు చేయాల్సిన అవసరం లేదు..అంత తపన.అవసరం లేదు..టైమ్ వేస్టే...జనాలకు అంతా తెలుసు

Comments