సి.కల్యాణ్ నిర్మాత కాబట్టే ఆర్డీఎక్స్ లవ్ కి సెన్సార్ పర్మిషన్ దొరికిందా..


ఇప్పటిదాకా చెత్త సినిమాలే తీసాడో..గట్టి సినిమాలే తీసాడో కానీ చిల్లర కల్యాణ్‌ని నిర్మాతగానే చూసారు జనం..కానీ ఇప్పుడీ సినిమాతో మాత్రం బూతు సినిమా నిర్మాతగా కూడా చూస్తున్నారు..మామూలుగానే ఇప్పుడు జనానికి స్మార్ట్ ఫోన్లలోకి బూతు డైరక్ట్ గా వచ్చి పడుతోంది..ఇక ఆన్లైన్ వ్యభిచారం సంగతి సరేసరి..ఇలాంటి స్థితిలో ఇలా హీరోయిన్ అందాల చుట్టూ సినిమాని రన్ చేద్దామని అనుకున్న డైరక్టర్ కి..అతగాడి లైన్ ని నమ్మిన చిల్లరకీ  చివరికి చేతికి చిప్పే మిగులుతుందనుకోవాలి..

ఇంతోటి సినిమాకి పాయల్ రాజ్ పుత్ ఓ విజయశాంతి..ఓ రాధ..ఓ అదీ..ఇదీ అని పబ్లిసిటీ ఇచ్చుకోవాల్సిన అగత్యం ఏంటో..ఆర్ఎక్స్ సినిమా హిట్టైందని..పెతీదీ ఆడేయదు కదా..సరిగా..ఇంకా ఈ సినిమా దెబ్బకి ఇక రాజ్ పుత్ పెట్టేబేడా సర్దుకోవాల్సి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు..ఇలాంటి చీప్ క్యారెక్టర్ చేసిన అమ్మాయిని ఏ తెలుగు హీరో ఆదరిస్తాడు..


చేజేతులారా కెరీర్ని నాశనం చేసుకోవడం అంటే..ఇదేనేమో..ఇక రాజ్ పుత్‌ ని ఐటెమ్ గాళ్ గా మార్చేయడం ఖాయం..ఇండస్ట్రీ అంటేనే అంతే..ఎక్కడికో తీసుకెళ్దామనుకుంటుంది..ఎక్కడెక్కడికో తీసుకెళ్తుంది..ఇఁత చెత్త సిినిమాకి సెన్సార్ ఎలా ఒప్పుకుందంటే..చిల్లరకి ఉన్న రిలేషన్సే..

ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా అన్ని పార్టీల్లోనూ తెగ తిరిగేసిన ఓ సినిమా జంట ఉంది..అందులో భార్యామణిగారు ఇప్పడు సెన్సార్ భోర్డులో సభ్యులు..ఈ దంపతులకు చిల్లర కల్యాణ్ బాగా దగ్గర అందుకే సినిమాకి ఎెంటనే ఏ కట్టూ లేకుండా బైటికి వచ్చేసిందంటున్నారు..ఐతే అసలు కట్ మాత్రం జనం చెప్పేశారు..

Comments