బాబర్ చారిత్రక తప్పిదాన్ని సరి చేయాలి..ఇదీ సుప్రీంకోర్టులో పరాశరన్ వాదన


రాముడి జన్మభూమి..అది దానిపై బాబర్ మసీదు కట్టి పెద్ద తప్పే చేసాడు..ఇప్పుడు దాన్ని సరిదిద్దాల్సిన అవసరం ఉంది..అసలు మొఘలాయీలూ దేశంపైకి  దండెత్తి వచ్చారన్న వాస్తవం అందరికీ తెలిసిందే ..ఇదీ హిందూవర్గ ప్రతినిధుల వాదన..వారి తరపున లాయర్ పరాశరన్ కోర్టులో వాదించిన తీరు ఇదే..సుప్రీంకోర్టులో ఫైనల్ హియరింగ్ రోజుల్లో ఇక అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు తీర్పుకి కౌంట్ డౌన్ మొదలైంది..

అసలు ఇది రాముడు నడయాడాడా లేదా అనేది పక్కనబెడితే..బాబర్ రాకముందు కూడా అయోద్య ఉందన్నది వాస్తవం..అలాంటిది అక్కడ గుడి లేదనడానికి ఆధారాలు లేవు...రాముడికి ఆధారాలు లేకపోవచ్చు కానీ..గుడి ఎందుకు ఉండదు..కానీ ఆ తర్వాత బాబర్ మసీదు కట్టించాడు..వాళ్లూ ప్రార్ధనలు చేసుకుంటున్నారు..ఓ ముస్లింలకు నమాజు ముఖ్యమే కానీ...మసీదు కాదు..ఇదే విషయాన్ని హిందూమహాసభ ప్రతినిధులు..కోర్టులో వాదిస్తున్నారు..

వాస్తవానికి ఈ రోజున అక్కడ గుడి..మసీదు ఏది ఉన్నా..కొత్తగా ఎవరికీ ప్రయోజనం లేదు..ఈ మాట అంటే తంతారు అవసరమైతే(పిచ్చెక్కితే) మనల్ని పాతేస్తారు కూడా..కానీ వాస్తవం అదే కదా...ఏ దేవుడైనా..మనుషులను నరుక్కోవాలని ఆదేశించడు..ఇది తెలిసింది కాబట్టే..పాతికేళ్లనాటి మూర్ఖత్యం ఇప్పుడు లేదు..

ానీ తీర్పు వచ్చిన తర్వాత పరిస్తితి ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పడం కష్టం..అందుకే 144 సెక్షన్లు అమలు చేస్తున్నారు..ఏదైనా తీర్పు ఎవరికి అనుకూలంగా వస్తే..ఆ వర్గం సంబరాలు చేసుకోవడం సహజాతిసహజం..కానీ బ్యాలెన్సెడ్ గా ఉంటేనే మనది సమాజం..అన్పించుకుంటుంది..లేకపోతే..ఏముంది ఓట్ బ్యాంక్ రాజకీయాలు మళ్లీ మొదలు

Comments