కేసీఆర్..బాబు ఇద్దరూ ఇద్దరే


అరే..స్ట్రైక్ మామూలు స్ట్రైక్ కాదు..ప్రగతిరధచక్రాల స్ట్రైక్..మరి ప్రగతి భవన్ ఏం చేస్తున్నట్లు..సైలెంట్‌గా వాచ్ చేస్తోంది
అంతే అలసిపోయి..వాళ్లంత వాళ్లే బాబూ మమ్మల్ని స్ట్రైక్ కాలాఫ్ చేయండి అని బతిమాలాడుకుంటుందని..అంతేగా అంతేగా..ఎందుకంటే వీళ్లు బడుగు జీవులు కదా..పొట్ట మాడితే వాళ్లే దారికి వస్తారు..ఇదేగా పెద్దల ఫీలింగ్స్..
కానీ చూస్తుండగానే..చినుకూ చినుకూ లైలా తుఫాన్‌గా మారినట్లు..ఇప్పుడు స్ట్రైక్ మొదలై పదిహేను రోజులైంది..ఇంకా ముందుకే తప్ప వెనక్కి అడుగేసేదే లేదంటున్నారు...

స్ట్రైక్అంటే హైదరాబాద్ మాత్రమే కాదు గురువా...పల్లెల్లో కూడా నడుస్తోంది..నీ సిటీలో మెట్రోలుంటయ్..కేబ్లుంటయ్..ఆటోలుంటయ్..షేర్ కార్లుంటయ్..సొంతకార్లలో షేరింగులుంటయ్..కానీ మా ఊళ్లో ఏం ఉండాలి దొరా..ఏమీ లేవ్..ఏం చేస్తం కాళ్లకే బుద్ది చెప్తం..గొప్ప ప్రభువులను గెలిపించుకున్నందుకు..బుద్దికి బుద్ది చెప్పుకుంటం..
మరి పొరుగున ఉన్న మరో దొర ఏం చేస్తున్నాడు..రెండూ నా కళ్లు..నా రెండు కళ్ల సిద్దాంతం అంటూ రాద్దాంతం చేసి చివరికి ఓ కన్ను గుడ్డిదైపోతే...ఇప్పుడైనా కాస్త తెరవాలిగా..అహ..ఒక్క మాట మాట్లాడితే ఒట్టు..నా తమ్ముళ్లపై కేసులు పెడతున్నారంటూ భజన చానళ్లలో లైవ్ ఇచ్చుకొనుడే తప్ప. ఏదైనా మాట్లాడితేనేగా.మరి..తెలుగు దురంధర నేతలు ఏం చేస్తన్నారు..చప్పుడే లేదు మరి

సరే ఆ జగన్ కి అంటే..ఈడ సిఎం దోస్తు..ఏమంటే ఏమవుద్దో..ఆమాటికి వస్తే..అసలు ఆర్టీసిని కలిపేసుకోవడంతోనే ఇలాగైందని ఎవడన్నా అంటాడు..అందుకే ఆయనా గమ్మునున్నడు..అంతేగా అంతేగా..

Comments

  1. ఆయన వేటి గురించీ మాట్లాడడు. పచ్చ పిచ్చగగాల్లు బ్లాగుల్లో బట్టలు చించుకుంటూ, ఓట్లేసిన జనాల్ని అవామానిస్తున్నంత కాలం.. చంద్రబాబుకి మాట్లాడాల్సిన అవసరం లేదు.

    ReplyDelete

Post a Comment