పవన్ గారూ..మీరే గట్టునుంటారో తేల్చుకోండి..కన్ఫ్యూజన్ ఎందుకు


మీరు ఉంటే ఆ గట్టునుండండి..లేకపోతే ీీఈ గట్టునుండండి..లేదంటే గోదాట్లో అయినా ఈదండి..కానీ మీరేదీ చేయకుండా..ఊరికే కోడికత్తులు...బాబాయ్ హత్యలు అంటూ రొడ్డకొట్టుడు డైలాగులెందుకు..పైగా..గెలుపే ముఖ్యమనుకుంటే..వంద వ్యూహాలు రచించేవాడినంటూ బిల్డప్పేంటి మహానుభావా...అసలు మీ పార్టీ కేడర్ ఇంకా
సినిమా ఫ్యాన్సేనా...లేకపోతే మీ మాటలకు ఎప్పుడో జంప్ అయ్యేవాళ్లు..వాళ్లకింకా మీ మేధావితనం అర్ధం కాలేదులా ఉంది..లేకపోతే..గెలుపు ముఖ్యం అనుకోకపోతే..ఎందుకు పోటీ చేసారు బాసూ...

మీరు ఓడిపోయారు కాబట్టి..నిజాయితీపరులు..గెలిచారు కాబట్టి అవినీతిపరులనే సోంబేరి వాదనని పక్కనబెట్టండి..నిజంగా మీకు అన్ని వ్యూహాలు తయారుచేయగల సత్తానే ఉటే..పార్టీ తరపున పదిమందిని ఎందుకు గెలిపించుకోలేకపోయారు.

మీ ప్రసంగాలలో స్వోత్కర్షలు..సొంతడబ్బాలు తప్ప..ఏ రోజైనా సూటిగా నిర్మాణాాత్మకంగా మాట్లాడగలిగారా..ఎంతసేపూ పదవి గురించి మాట్లాడేదే మీరు..అక్కడికేదో పదవులపై ఆశ లేనట్లు బిల్డప్ ఇవ్వకండి..అలాంటప్పుడు మీరు పోటీ చేయకుండా..మీ కాండిడేట్లను మాత్రమే పోటీకి దింపాల్సింది..ఐనా ఇదంతా ఐపోయిన సోది..మీరు గతం వదిలేసి ఫ్యూచర్లోకి నడవండి..కొత్తగా ఏమైనా ట్రై చేయండి
(ఇంకా ఉంది)

Comments

  1. పవనయ్య ఎందుకు ఇలా అయ్యాడో. ఏమి మాట్లా డుతాడో అర్థం కాదు. ఎందుకిలా ప్రజలను చికాకు పెడుతున్నాడు. గబ్బర్ సింగ్ కాటమరాయుడు గోపాలం సినిమాల్లో చాలా బాగా నటించాడు. పవనయ్యా. రాజకీయం వద్దు. సినిమాలలోకి వెళ్ళిపో.

    ReplyDelete
  2. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు... ప్రభుత్వ వైఫల్యాల గురించి తన అభిప్రాయం విలేఖరులు అడిగితే "ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని నేను విమర్శించను..." అని, తనకే సాధ్యమైన డవిలాగ్ కొట్టాడు. షాక్ తినడం విలేఖరుల వంతైంది.

    ReplyDelete

Post a Comment