పులుపెక్కినదీ గెలుపు...మహారాష్ట్ర


అంతన్నారు..ఇంతన్నారు...చివరికి ఇదిగో చింపి చింపి చివరకి ఇంత మిగిల్చారు..దున్నేద్దామనుకుంటే ఇలా రాళ్లు అడ్డం పడ్డాయేంటి చెప్మా అన్నట్లుగా అయింది మహారాష్ట్రలో బిజెపి సిచ్యుయేషన్..ఇప్పటికే శివసేన నా వాడే కాబోయే సిఎం అంటూ చీకాకు పెట్టింది..ఇప్పుడు సీట్లు తగ్గిపోయాయ్..ఛస్..ఐతేనేం గెలిచాం కదా..ఔనౌను..కానీ సీట్లు తగ్గాయి ప్రభూ...ఇలాంటి వాటికి సమాధానం చెప్పలేరు..ఎందుకంటే సక్సెస్ తో ఎవడూ ఆర్గ్యూ చేయకూడదు

కానీ ఈ సక్సెస్ శల్యుడిలాంటి మిత్రుడితో కలిసి కదా సాధించింది..మరిప్పుడేంటి..చేయడం..ఏముంది ఎన్ని అడిగితే అన్ని మంత్రిపదవులు ఇవ్వాల్సిందే..లేదంటే ఆదిత్యసేనుడికి డిప్యూటీ సిఎం పోస్టేస్తే సరి..కానీ ఉద్దవుడు ఊరుకోడే..ఏదోలా గెలుకుతూనే ఉంటాడు..అందులోనూ మోడీ అంటే లెక్కే లేదాయె...నువ్వెక్కడైనా మోదీనే ..నాకు మాత్రం జస్ట్ మోడీవి...ఏం బాబూ ఉద్యోగాలెందుకు లేవని అడుగుతా..పకోడీ దుకాణాలెందుకు పెట్టుకోమని చెప్పావో అడుగుతా..ఇంకా వళ్లు మండితే గుడి ఎందుకు కట్టవు గురూజీ అని ఇంకా పెట్రేగుతా ...ఇదిగో ఇలా సాగుతుంది ఉద్దవ్ ఠాక్రే ధోరణి..ఇలాంటి సమయంలో మరి డామినేషన్ దొరికితే వదులుతాడా...ఇప్పుడిదే బెంగ పట్టుకుంది అమితాశకి..మరియు నరేంద్రమోదీగారికి..

మరోవైపు శరద్ పవార్ కాచుకుని ఉన్నాడు..ఈ ప ండు వయసులో ఎండనగ వాననక తెగ ప్రచారం చేసి  ఫలాలను అందుకున్నాడు..వీలైతే శివసేనకి మద్దతిచ్చేసి పీఠం పంచుకుందామని తాపత్రయం ఐతే బైటికి మాత్రం చెప్పడం లేదు..ఇందుకే బిజెపికి ఈ గెలుపు పులుపెక్కింది..

Comments

  1. >>అమితాశకి

    Superb

    ReplyDelete
    Replies
    1. అమితాశకి "అమిత షాకు" తగిలిందా?

      Delete

Post a Comment