భారతీయ జనతా పార్టీ దమ్ము ఇంతేనా...శివసేన కూడా ఆడిస్తుందే


సిఎం సీటు ఇస్తారా ఇవ్వరా అంటూ శివసేన శివాలెత్తడంతో మహారాష్ట్రలో కొత్త  ప్రభుత్వం ఏర్పాటుపై సస్పెన్స్  అలానే ఉంది..అసలు ఆర్ధికరంగం పతనం కావడానికి బిజెపినే కారణమంటూ విమర్శలకు కూడా శివసేన దిగడంతో..బిజెపి మరింత డిఫెన్స్‌లో పడింది. రెండుపార్టీల నేతలూ గవర్నర్‌ని కలవడంతో ఇక తర్వాతేం జరుగుతుందనేదే చూడాలి...ప్రస్తుతానికైతే..మహారాష్ట్రలో పొత్తులు విడిపోవడం ఖాయమనే సంకేతాలు బలంగా వెలువడుతున్నాయ్. డైరక్ట్‌గా చెప్పడం లేదు కానీ శివసేనతో బిజెపి దాదాపు రాంరాం అనేసూచనలు కన్పిస్తున్నాయ్. అందులో భాగంగానే సోమవారం దేవేంద్రఫడ్నవీస్ గవర్నర్‌ని కలిస్తే..శివసేన కూడా నేనూ కలుస్తానంటూ రాజ్‌భవన్ తలుపుతట్టడం పొలిటికల్ హీట్‌ని పెంచుతోంది..

వాస్తవానికి శివసేన కోరుతున్నట్లుగా సిఎం సీటుని ఇచ్చే ఆలోచన బిజెపికి లేదు..కనీసం ఓ ఏడాది కూడా ఇవ్వదు..చూస్కో నా తడాఖా అంటూ  15 మంది ఇండిపెండెంట్లతో 122 మంది సభ్యుల బలం తమకి ఉందంటూ బిజెపి ప్రకటనలు గుప్పిస్తోంది..రాందాస్ అథవాలే లాంటి మంత్రులు మాత్రం ఆదిత్య థాక్రేకి డిప్యూటీ సిఎం పోస్టుతో సరిపెట్టుకోవాలంటూ చెప్తున్నాడు..ఎలాగైనా..కనీసం ఆదైనా దక్కించుకోవాలనుకుంటుందో..లేక నిజంగానే సిఎం పోస్టుపై గురి పెట్టిందేమో కానీ..శివసేన ఇంకాస్ట ప్రెజర్ బిల్డప్ చేసేందుకు సామ్నా  డైలీలో వరసగా బిజెపిని టార్గెట్ చేయడం ప్రారంభించింది.  పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టి అమలు తర్వాతే దేశ ఆర్థిక వ్యవస్థ మందగించిందని, దీనికి బీజేపీదే బాధ్యతంటూ రాతలతో చీకాకు పెట్టింది..ఐతే ఇంత జరిగిన మోదీ..షా మాట్లాడటం లేదు..
రిమోట్ తన చేతిలోనే ఉఁదంటూ శివసేనప్రకటించడం అమిత్‌షా-మోదీకి మంటెక్కిస్తున్నా.. ప్రస్తుతానికి మాత్రం సైలెంట్‌గానే డెవలప్‌మెంట్స్‌ని వాచ్ చేస్తున్నారు. అటు కాంగ్రెస్ మాత్రం శివసేనకి
సిగ్నల్స్ ఇస్తుండగా... ఎన్‌సిపి మాత్రం అప్పోజిషన్‌లోనే ఉంటామని ప్రకటించింది. ఓవైపు మెజారిటీ రాని హర్యానాలో సునాయాసంగా గద్దెనెక్కిన బిజెపి..ఇక్కడ..సంకీర్ణ కూటమికి సంపూర్ణ మెజారిటీ ఉన్నా..
మహారాష్ట్రలో పీట ముడిపడటం.. బిజెపి అగ్రనాయకత్వానికి మింగుడుపడటంలేదు. ఎటు తిరిగి ఎటు వస్తుందో అన్నట్లుగా పెద్ద లీడర్లు కూడా ఎవరూ కామెంట్ చేయడం లేదు..చూద్దాం ఏమవుద్దో



Comments