కట్టు పన్ను కట్టు బంగారంపై...మోదీ మార్క్ పిడుగు


మధ్యతరగతి, సంపన్నవర్గాలపై పిడుగులాంటి ఓ స్కీమ్‌ని కేంద్రం రెడీ చేస్తోందట.వ్యక్తులు, కుటుంబాల, ట్రస్టుల దగ్గరున్న బంగారానికి లెక్కలు చెప్పాలంటూ ఓ స్కీమ్ మోదీ సర్కారు తీసుకురానుందనే సమాచారం ఇప్పుడు సంచలనం కలిగిస్తోంది..దీనికి సంబంధించిన అన్ని హంగులూ పూర్తయ్యాయని..ఇక స్కీమ్‌కి ఫినిషింగ్ ఇచ్చి..అమలు చేయడం ఒక్కటే తరువాయనే అంటున్నారు. ఐతే కేంద్రంలోని పెద్దలు మాత్రం ఇదింకా పరిశీలన దశలోనే ఉందంటున్నారు

వాస్తవానికి 2014లో అనూహ్య మెజార్టీతో అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ..అనూహ్యంగానే పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారు..ఈ చర్యతో ఎవరికెంత ప్రయోజనం కలిగిందనే సంగతి పక్కనబెడితే సామాన్యుడు నరకం అనుభవించాడు..ఇప్పుడు ప్రతిపాదిస్తోన్న గోల్డ్ ఆమ్నెస్టీ స్కీమ్ కూడా మధ్యతరగతి జనానికి షాక్ లాంటిదే. ఆమ్నెస్టీ గోల్డ్ స్కీమ్ ప్రకారం ప్రభుత్వం ముందుగా ఓ నిర్ణీత మొత్తంలో మాత్రమే బంగారం జనం దగ్గర ఉండేలా ఆదేశిస్తుంది..అఁతకు మించి బంగారం ఉంటే కేంద్రానికి లెక్కలు చెప్పాల్సిందే..

లెక్కకి మించి ఉన్న బంగారంపై ప్రభుత్వం ఓ రేటు నిర్ణయిస్తుంది..ఆ రేటు ప్రకారం రసీదులు లేని బంగారంపై పన్ను విధిస్తారు..ప్రస్తుతం ఈ స్కీమ్‌కి తుదిమెరుగులు దిద్దుతున్నారట..కేంద్రపెద్దల ఆమోదం లభించిన తర్వాత ఈ గోల్డ్ స్కీమ్ ఏ క్షణాన్నైనా ప్రజల్లోకి రావచ్చు..బంగారం రేటు విపరీతంగా
పెరిగిపోతున్న నేపధ్యంలో...నల్లధనాన్ని గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారని..అందుకే కేంద్రం గోల్డ్ ఆమ్నెస్టీ స్కీమ్‌వైపు చూస్తుందని అంటున్నారు..ఏదేమైనా బంగారంపై పన్ను విధించడం
జరిగితే అది పెద్ద సంచలనానికి దారి తీస్తుందనే అంచనాలు ఉన్నాయ్..ఎందుకంటే బడ్జెట్‌లో గోల్డ్‌పై సర్‌ఛార్జ్ 2.5శాతం విధించిన నేపధ్యం ఉంది..ఇప్పుడు మళ్లీ పన్ను విధించడం అంటే..దీర్ఘకాలిక ప్రయోజనాల సంగతేమో కానీ..తక్షణం మాత్రం వ్యతిరేకత రావడం ఖాయం

Comments