మనుషుల్లో పార్టీల డిఎన్ఏలు కూడా ఉంటాయా..ఏం భాష. ఏం మెంటాలిటీరా బాబూ..!


లిసి  పని చేసిన పార్టీ నుంచి సహచరులు జంపవుతుంటే..ఏదో గొటం ముందు పెట్టినప్పుడు  అబ్బే మావోడు..మావోడే..ఎక్కడకీ పోడు..పోనీయం అనడం సహజం..కానీ ఇలాగ..మావోడి బ్లడ్డులోనే టిడిపి ఉంది..మావోడి డిఎన్ఏనే టిడిపి అంటూ విభిన్న భాషా ప్రయోగాలు..చూస్తే..బోయపాటి సీను సినిమా డైలాగులకు పనికి వస్తేదేమో కానీ..బైట అంత అతకదు గురువా..హిట్టైన సినిమాలో కూడా ఆ తర్వాత అతగాడి డైలాగులు..సీన్లపై జోకులు పేలుతుంటాయ్..పరమార్ధం సిద్దించిన తర్వాత ఎవడేమనుకుంటే మనకేందనుకోవచ్చు..కానీ ఇక్కడ ఇది జీవితం..బ్లడ్డులోనే అది ఉంది..మా బ్లడ్డే వేరు..ఇలాంటి డవిలాగులు..మానసిక జాడ్యానికి ప్రతీకలు..

ఎవడూ పుట్టగానే ఓ పార్టీలో పుట్టడు...చచ్చేంతవరకూ అదే పార్టీలో ఉండడు..ఐతే గెలుపోటములను బట్టి పార్టీలు మారితేనే..జనంలో చులకన అయ్యేది. తాత్కాలికంగా పదవులు వస్తాయేమో కానీ శాశ్వతంగా విలువ తగ్గుతుంది..ఇది గుర్తెరిగినవాళ్లు పాలిటిక్స్ లో జాగ్రత్తగా మెసులుతుంటారు..లేనోళ్లు వర్తమానంలోని దర్జాని మాత్రమే ఎంజాయ్ చేస్తుంటారు..
వల్లభనేని వంశీమోహన్ టిడిపి డిఎన్ఏ అనడం ఖచ్చితంగా కులాన్ని గుర్తు చేయడానికే అంటూ ఈపాటికే బోలెడన్ని కామెంట్లు సర్క్యులేట్ అవుతున్నాయ్..ఎవడి కులం వాడికి గొప్ప ..అందులో తప్పేం లేదు..కానీ ఇలా బ్లడ్డు..డిఎన్ఏ ఏంట్రా సామీ..అఁదుకే కదా..రాంగోపాల్ వర్మ లాంటోళ్లు కమ్మరాజ్యంలో కడపరెడ్లనే టైటిల్‌ని పిచ్చ పిచ్చగా పాపులర్ చేస్తోంది..

Comments

  1. @ ..ఐతే గెలుపోటములను బట్టి పార్టీలు మారితేనే..జనంలో చులకన అయ్యేది. 

    ఇంతకీ వంశీ గెలిచిన పార్టీలోకి ఎందుకు మారుతున్నట్లో!!

    ReplyDelete

Post a Comment