ఏంటి మరి గన్నవరంలో బై ఎలక్షన్ ఖాయమేనా..టిడిపి రెడీనా


వల్లభనేని వంశీ వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరిపోతాడట..ఈ న్యూస్ ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతోంది..ఏ ఎమ్మెల్యే సిఎఁని కలిసినా...అంటే విపక్ష ఎమ్మెల్యే అదో న్యూస్..ఈ లెక్కన ఏ అప్పోజిషన్ ఎమ్మెల్యే సిఎఁలు..మంత్రుల దగ్గరకి వెళ్లకుండానే పనులు అవ్వాలంటే అవుతాయా..కావు కదా..కానీ 2014 నుంచి 2019 మార్చి వరకూ కూడా అప్పోజిషన్ ఎమ్మెల్యేలు ఎవరైనా చంద్రబాబుని కలిశారంటే అది ఖచ్చితంగా పార్టీ మారడానికే.. ఇది చరిత్ర 

కానీ ఇప్పుడు ఇక్కడున్ది జగన్..అందరికీ పనులు చేస్తానంటున్నాడు..పార్టీ మారాల్సిన అవసరం లేదన్నాడు..ఐనా ఇలాంటి ప్రచారం జరుగుతుందంటే..ఆలోచించాల్సిందే మరి అందులోనూ అప్పుడెప్పుడో పాదయాత్రలో విజయవాడలో వంశీ రాధాకృష్ణ సమేతంగా కలిశాడు. అప్పుడే పెద్ద పుకారు లేచింది వల్లభనేని వైఎస్సార్సీపీలో చేరతాడని..కానీ అప్పుడు జరగలేదు

మరిప్పుడు జరిగితే..జరిగితే ఏమవుతుంది..వల్లభనేని వంశీ రాజీనామా చేయాలి...బై ఎలక్షన్ రావాలి..ఇదే కదా టిడిపికి కూడా హాయి..ఎటూ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్సార్సీపీకి డిపాజిట్లు కూడా దక్కువనే స్టాక్ డైలాగ్ వేస్తుంటారుగా..అందులోని సరుకెంతో కూడా తేలిపోతుంది..మరింకెందుకు ఆలస్యం కమాన్ వంశీ దూకెయ్..రాజీనామా చేసేయ్...

Comments

  1. వల్లభనేని వంశీ రాజీనామా చేసి మళ్లీ పోటీ చేస్తే ఆ ఉపఎన్నికల ఖర్చు అతనితో కట్టించాలి.

    ReplyDelete
  2. అదేంటో ప్రతిఒక్కరూ నియోజకవర్గ అభివృధ్ధికోసమే పార్టీలు మారుతుంటారు. కానీ నియోజకవర్గాలు మాత్రం అభివృద్ధి చెందవు!

    ReplyDelete

Post a Comment