హుజూర్ నగర్‌లో గెలిచిందట...హమ్మయ్య పరువు దక్కింది


బంపర్ మెజారిటీతో గెలిచింది టిఆర్ఎస్ పార్టీ..కానీ ఆ ఆనందం ఏదీ హీరోగారి మొహంలో..ఎంతసేపూ ఎదుటివాళ్లపై పడి రంకెలేయడానికి తప్ప..ప్రెస్ మీట్లో చక్కగా మాట్లాడిందెక్కడ..అడిగిన వాడికి బుద్ది లేదు..అడగనివాడికి అంతకన్నా బుద్ది లేదు..అయ్యా ఏంది సారూ ఈ పోకడ..ఆర్టీసీ స్ట్రైక్ కి నీ హుజూర్ గెలుపుకీ ఏంది సంబంధం..
అంటే స్ట్రైక్ చేసారు కాబట్టి..జనం మీకు ఓట్లేయరని ఎవరైనా అన్నారా...

స్ట్రైక్ జరుగుతన్నా పట్టించుకోకుండా..అలా వదిలేయడమే కాకుండా..ప్రవేటే బస్సులు వస్తాయ్..ఒక్క సంతకం పెడితే చాలు..జీతాలు ఇవ్వాలంటే నాలుగైదు బస్డాంట్లు అమ్మాలి..కోర్టేమైనా కొడతదా..ఏందయ్యా ఈ కామెంట్లు..ఎఁదుకింత ఫ్రస్ట్రేషన్...అంటే నువ్ చిటికెస్తే..వచ్చి వాలేటొళ్లు నీపై ఎగిరిపడటం సహించలేకనేగా...

ఈలెక్కన ఎవరూ మిమ్మల్ని ఏమీ అనకూడదంటే..అసలు బైటికే రాకండి..పాడు మనుషులు వాళ్లలో వాళ్లే తిట్టుకుని పోతారు..ఎన్నికల సమయంలో వచ్చి ఓటేయమని అడగండి..చాలు...మీ ప్రతి ఇంటికీ నల్లా ...డబుల్ బెడ్ రూమ్ స్కీములేమైనాయని ఎవడైనా అడుగుతడా...ఎవ్వుడూ అడగడు...మీ ఇష్టం మీకు ఓట్లేయడానికే కదా జనం బతుకుతుంది

Comments

  1. 2014 నుంచి ఎన్నికల యావ తప్ప తెలంగాణ లో ఎమైనా అభివృద్ధి ఉందా?

    ReplyDelete
  2. కేసీఆర్ పాలన ఒక mixed bag అనిపిస్తుంది.
    కాళేశ్వరం, యాదాద్రి, భగీరథ ఈ పథకాలు గొప్ప పనులే. వేరే ఎవరైనా ఈ పనులు దశాబ్దాలు పట్టేది.
    Give credit where it's due. ప్రజా ర వాణా విషయం లో మాత్రం ప్రభుత్వాలు ఎంతో చేయాల్సి ఉంది. ఆర్టీసీని బలోపేతం చేయాల్సి ఉంది.
    అయితే భవనాలు కూల్చి కొత్తవి కట్టడం సరికాదు.

    ReplyDelete

Post a Comment