అయ్యయ్యో అమిత్‌షా జగన్‌ని కలిసాడే..ఇప్పుడేం రాయాలి..బైటికి పంపేశాడనా..

ప్రశ్న..ఏపీ సిఎం జగన్‌ని అమిత్‌షా కలిస్తే ఏంటి..కలవకపోతే ఏంటి..జనాలకేంటి..జవాబు..ఏం లేదు..జస్ట్ కాలక్షేపం కబుర్లు..ఇదేకదా ప్రయోజనం లేని బోకున్యూస్ తో చానళ్లకి..ప్లస్ భజన కరపత్రికలకు కావాల్సింది..నికార్సైన వార్తలు రాసే దమ్ము ఎటూ లేదు..ఇలాంటివి రాసుకుంటే..సన్నాయి అప్పన్నలు..సోంబేరి శరభయ్యలు కావాల్సినంత చెత్త పోగేసుకుని అరుగుపై కూర్చుని తిన్నది అరిగిందాకా...వాగేసుకోవచ్చు..చుట్టలు పీకి థుపుక్ మని ఊసేసి కొంపకి పోయి తొంగోవచ్చు

కేంద్రంలోని పెద్దలకు జగన్ అంటే చిరాకు పుట్టింది..అతన్ని కలవడానికి కూడా ఇష్టపడటం లేదు..అసలు జగన్ అంటే వాళ్లకి ఓ గొంగళిపురుగు..ఇదీ ఈ రాతల ద్వారా సదరు ఛానళ్లు..పత్రికలు పంపించాలనుకునే సందేశం..అందుకే అప్పాయింట్ మెంట్లు ఇవ్వడం లేదు..క్యాన్సిల్ చేస్తున్నాడు అని ఊదరగొట్టడం..సరే వాళ్లన్నట్లే జగన్ కి అప్పాయింట్ మెంట్ ఇవ్వడంలేదు...మరి ఆ టైమ్‌లో ఇంకెవరికైనా ఇచ్చాడా...కలిశాడా..లేదు కదా..

నిన్న కలిశాడు...ఛ...కలిశాడన్నా..పైగా 45 నిమిషాలు అందరినీ బైటికి పంపి మరీ..మాట్లాడుకున్నారు..మరి ఏం రాయాలి..రాస్కోవచ్చన్నా..బ్రహ్మాండంగా..ఎవడూ అడగడు కదా మనల్ని..లోపల నువ్ చూశావా అని...జగన్ అమిత్ షాతో మాట్లాడలేదని...ఊరికే కూర్చుని బైటికి పంపేశాడని రాద్దాం..ఏం...ఆ..అలా రాసేద్దాం..భలే ఉంటది..మనోళ్లు కూడా లొట్టలేసుకుంటా...సదూతారు..

నిన్న జగన్ అమిత్ షాని కలవడమే కాదు..రివర్స్  టెండరింగ్‌పై సూపర్ అని అమిత్ షా మెచ్చుకుని..శభాష్ అని భుజం తట్టి పంపాడట..ఇదీ ఇంకో వెర్షన్..కానీ ఇదే జరిగిందని ఇన్ సైడ్ టాక్..ఢిల్లీ రిపోర్టర్లు ఆ భేటిక ిసాక్ష్యంగా ఉన్నవాళ్లు చెప్పిందే ఇది..నిజం ఇలా ఉంటే..ఇంకా మసి పూసి అంధకోతిని చేద్దామనుకుంటే..శునకానందాన్ని ఎవరు కాదనగలరు..కమాన్ గైస్..ఎంజాయ్ యువర్ సెల్ఫ్..

కానీ జగన్ ..ఏంటయ్యా ఇది నువ్ కూడా ఇలా వాళ్లని కలవడానికి వెంపర్లాడటం..కమాన్ ముసుగు తీసేయ్..ఇదివరకటి జగన్‌ని చూపించు..తిక్కలేస్తే..ఎవడినీ లెక్క చేయననే నీ డోన్ట్ కేర్ క్యారెక్టర్‌ని బైటికి తీయవయ్యా...ఇప్పుడే వద్దా...సరే..కానీ చంద్రబాబునాయుడిలా ఐదేళ్లూ కానివ్వకు..మహా అయితే ఇంకో ఆర్నెల్లు..ఓకేనా..(ఇది ఓ ఫ్యాన్ మనసులో మాట)

Comments

  1. గ్రీటీంగ్స్ తప్పితే ఇంకెం మాట్ళాడనివ్వలేదని,, అల్రెడీ బోకుజ్యోతి రాసేసింది. మీరు చూడ్లా?

    ReplyDelete
  2. >>ఇంకా మసి పూసి అంధకోతిని చేద్దామనుకుంటే..శునకానందాన్ని ఎవరు కాదనగలరు..కమాన్ గైస్..ఎంజాయ్ యువర్ సెల్ఫ్..

    "Enjoy your self goals"

    ReplyDelete
  3. ఈ కుళ్ళంతా జగన్ అమీత్ షా లేదా మోడీ గార్లను కలిసినందుకు కాదు.

    చంద్రాలు సారు ఎన్నిసార్లు హస్తినకు పోయివచ్చినా తప్పక మాజీ హౌసింగ్ (హోం కాదు, అంత సీనుందా?) మంత్రి, ఆ తరువాత కాలంలో ఉపరాష్ట్ర"పత్తి" స్థాయికి "ఎదిగిన" వంకాయల నాయుడు దర్బారులో హాజరీ వేసేవాడు. జగన్ అతగాడిని కనీసం పట్టించుకోకుండా నేరుగా ప్రధాన/హోం మంత్రులతో ప్రత్యక్ష "ఛానెల్" ఏర్పరుచుకోవడం, తద్వారా లీకులు ఆగిపోవడం మూలాన బాకాల గుండె గుభేలుమంటోంది.

    ReplyDelete

Post a Comment