కేంద్రం తెలంగాణ ఆర్టీసీని గుర్తించకపోతే ఏమవుతుంది..?

కేసీఆర్ గారేమో కేంద్ర చట్టంలోని సెక్షన్ 67 ప్రకారమే ఆర్టీసీని ప్రవేటోళ్ల చేతిలో పెడుతున్నా అంటారు..జేఏసీవాళ్లేమో అసలు ఆ కొత్త మోటార్ వెహికల్ చట్టం తెలంగాణలో అమలు కావడం లేదు..అసలు అడాప్ట్ చే సుకోవడం లేదు..చేసుకుంటే మరి ఫైన్లెందుకు ఆ రేంజ్ లో భారీగా వడ్డించడం లేదు ట్రాఫికోళ్లు అని లా పాయింట్ లాగారు..
ఇదిగో ఈలోపే ఉన్నదంతా ఏపీఎస్ ఆర్టీసీ...తెలంగాణ ఆర్టీసీ లేనేలేదు..మేం అంగీకరించం అంటూ కేంద్రం పెద్ద బాంబు పేల్చింది..మరిప్పుడు ఏం కావాలి

సెక్షన్ 67లో ఏం ఉన్నదయ్యా అంటే ప్రజల సౌకర్యం కోసం..భద్రత కోసం..రద్ద ీనివారణ కోసం..పోటీ పెరిగేందుకు...ఓ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా లైసెన్సులు జారీ చేయవచ్చు..పర్మిఠ్లు ఇవ్వొచ్చు..మార్పులు చేయవచ్చు అని ఉంది..


కానీ ఉన్న ఆర్టీసీని రద్దు చేయవచ్చా...సర్వీసులు పూర్తిగా తీసేయవచ్చా..ఇదే ఇప్పుడు పెద్ద ప్రశ్న..దీనికి కోర్టు ఏం చెప్తుంది..పైగా ఉందే హీరోగారు హెచ్చరించారాయె..ఏం కోర్టేమైనా కొడతదా అంటూ...అంటే వినే ప్రసక్తి ఉండదా..కోర్టు ధిక్కారం కాదా మరి..ఇది ఇంకొంతమంది డౌట్ 

Comments

  1. ప్రస్తుత వివాదం ఎంవీ చట్టం సెక్షన్ 67 & చట్టంలో 2019 కేంద్ర సవరణ గురించి కాదు. ముందు ఆర్టీసీ చట్టం వివాదం తేలితేనే దీని సంగతి చూడాలి.

    కేంద్ర ప్రభుత్వ ఆఫీడవిట్టు ఆర్టీసీ చట్టం సెక్షన్ 47A చుట్టూ కేంద్రీకృతం అయుంది. Section 47-A relates to central approval if RTC is "reconstituted or reorganised in any manner whatsoever or that it should be dissolved". ఆర్టీసీని యథాతథంగా కొనసాగిస్తే కేంద్ర అనుమతి అక్కరలేదు.

    దీనికి కేంద్రానికి ఉన్న 33% వాటాకు సంబంధం లేదు. Center is acting in its role as the prescribed approval authority for reconstitution/reorganization/dissolution, not as a mere minority shareholder.

    రాష్ట్ర ప్రభుత్వ వాదన ఆర్టీసీ చట్టం సెక్షన్ 3 ఆధారితం. Section 3 relates to "Establishment". కొత్తగా స్థాపించిన సంస్థకు పాత సంస్థ ఉద్యోగులు & ఆస్తులు ఎలా సంక్రమిస్తాయని కోర్టు అడిగిన obiter dictum ప్రశ్న.

    ReplyDelete

Post a comment