శవాలపైన రేటింగ్స్ ఏరుకునే ఛానళ్లూ ఇది గమనించండి..ఇది చదవండి..సిగ్గుపడండి


మీ నైచ్యానికి ఇంకో కుటుంబం ఊరొదిలి పోవాలా...
అప్పుడెప్పుడో 70ఏళ్ల వయసులో బామ్మ అయిందని నానా హడావుడీ చేసి..ఆ కుటుంబం అజ్ఞాతంలోకి పోయేలా చేసారు..ఇప్పుడీ ఫ్యామిలీ కూడా పోవాలా..
డాక్టర్ చెల్లెలు ఏమంటుందో చూడండి..చూస్తే..మీ ల..డాలో జ్ఞానం మీరు చెప్తే కానీ జనాలకు తెలియదనుకునే మీ మూర్ఖత్వం..మీకు అర్ధం కాకపోతే..ఎవడికీ అర్ధం కాదనుకునే..సోంబేరితనం అన్నీ మట్టిలో కలిసిపోతాయ్

మీడియా అడగాల్సింది మా ఆత్మీయత గురించి కాదు’
నేను ఎవరినో నిందించాలనుకోవడం లేదు. కానీ ఈరోజంతా నేను ఎలా గడిపానో, నాకు ఏమనిపించిందో అది చెప్తా.
ఒకే ప్రశ్న పదే పదే అడగడంలో అర్థం ఏముంది?( ఎందుకంటే అదే జనం చూస్తారని మా బాసులు తెగ వాగేస్తుంటారు మరి)
మేమిద్దరం మాట్లాడుకున్న ఆడియో బయటకు వచ్చి, అందరూ విన్నాక కూడా.. మీరు ఏం మాట్లాడుకున్నారని అడగడంలో అర్థం లేదు. మీ అక్కతో ఏం మాట్లాడారు? ఏం చెప్పారు? ఇదే ప్రశ్న మళ్లీ మళ్లీ అడగడం ఎందుకు?
నన్ను భావోద్వేగానికి గురి చేసి సీన్ చేయాలనుకున్నారని నాకు అనిపించింది. మీడియా అలా చేయకూడదు.
వాళ్లు సంబంధం ఉన్న ప్రశ్నలు అడగాలి. కుటంబంలో నష్టం నష్టమే. అందరికీ ఆమెతో భావోద్వేగాలు ఉంటుంది.
దాన్ని బాగా భావోద్వేగపూరితం చేయకూడదు. ఘటన గురించి, దారి తీసిన పరిస్థితులు, కారణాలు చెప్పాలి.
దానికి ఏం చేయాలి, దాని నుంచి సమాజం ఏం నేర్చుకోవాలో చెప్పాలి. అంతేకానీ, నాకూ మా అక్కకూ ఉన్న ఆత్మీయత గురించి కాదు మాట్లాడాల్సింది.
అందరికీ కుటుంబం ఉంటుంది. ఆత్మీయత ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. మా వ్యక్తిగత అనుబంధం గురించి చెబితే సమాజానికి ఏం ఉపయోగం?
నా జీవితంలో ఒక దారుణ ప్రమాదం జరిగితే, దాన్నుంచి సమాజం ఏం నేర్చుకోవాలో మీడియా చెప్పాలి.
వాస్తవంగా ఏం జరిగిందో మీడియా చెప్పాలి. భావోద్వేగపూరితం చేయడం కాదు. అది సరికాదని నాకు అనిపించింది. ఇలాంటి ప్రశ్నల్ని కొందరు నన్ను అడిగినప్పుడు నాకు చాలా బాధేసింది.

‘మీడియా వాళ్లు అడుగుతున్న ప్రశ్నలు సమంజసమేనా?’మీడియాను నేను తప్పు పట్టడం లేదు. కానీ మీడియానే ఆలోచించుకోవాలి. వాళ్లు అడుగుతున్న ప్రశ్నలు సమంజసమేనా? కాదా? అని ఆలోచించుకోవాలి.
అవే ప్రశ్నలు. అవే ప్రశ్నలు.. రోజంతా అవే. అదే విషయం. అదే విషయం. కొత్తగా ఏం రాదు. నేను, అక్క మాట్లాడుకున్నది అంతా విన్నారు. అయినా మళ్లీ వచ్చి అదే అడుగుతారు.
నీకేమనిపించింది. నువ్వెందుకు దాన్ని సీరియస్ గా తీసుకోలేదు. ఈ సంఘటనకు దారితీసిన పరిస్థితులు ఏంటి? ఇలాంటివి అడగాల్సింది.
సంఘటనకు సంబంధించిన, సమంజసమైన ప్రశ్నలు అడగమని మీడియాకు సలహా ఇస్తున్నా.
ఏదో చూపించడానికి వచ్చి, ప్రజలను బలవంతం పెట్టి, వాళ్లను ఇబ్బంది పెట్టి.. ఇదంతా సరికాదు. మీడియా ఇలా చేయకూడదు.
వంద చానళ్లు ఒకే ప్రశ్న అడగడం మంచిది కాదు. ఆలోచించాలి. సందర్భోచితంగా ప్రశ్నలు అడగండి.
వాళ్ళు నన్ను భావోద్వేగానికి గురి చేయాలని చూశారు. నాకు మా అక్కతో అనుబంధం ఉంది.
మీకు నేను మీడియా ముందు ఏడవాలి. దాన్ని టీవీలో పెట్టాలనుకుంటున్నారు. దాన్ని ఎమోషనల్ చేయాలనుకుంటున్నారు. అది సరికాదు.( లేదు లేదు మీరు అలా అనొద్దు..మా బతుకులే మీమీద రేటింగ్స్ పెంచుకోవడంలో ఉంది..మీరలా అంటే ఎలా)

ఈ టైంలో మీరైతే ఏం చేసుండేవారు లాంటవి అడిగి మీరు (మీడియా) నన్ను భావోద్వేగ పరంగా రెచ్చగొట్టాలని చూశారు.

‘మీడియా చేయాల్సింది ఇదీ..’

ఇప్పటికే మేం బాధలో ఉన్నాం. నష్టాన్ని భరిస్తున్నాం. ఆ తీపి గుర్తులు గుర్తు చేసి, ఇప్పుడామెలేదని గుర్తు చేసి మీరు (మీడియా) మమ్మల్ని మరింత బాధ పెట్టాలనుకుంటున్నారు. ఇది సరికాదు.
అలాంటిది చేయకూడదని వ్యక్తిగతంగా కోరుతున్నా. సంబంధం ఉన్నవి మాట్లాడండి.(అబ్బే మాకు రానివే అవి కదా)
సమాజంలో అవగాహన పెంచండి. తద్వారా సమాజంలో భద్రత పెరిగేలా చేయండి.( మాకు ఎందుకు అవగాహన రేటింగ్ పెరిగితే చాలు)
ఇప్పుడు ఎమోషనల్ డ్రామా క్రియేట్ చేసి, కొద్దిసేపు ప్లే చేసి.. తరువాత ప్రజలు మర్చిపోతారు. అది కాదు కావాల్సింది.
సమాజంలో భద్రత మరింత పెరగాలి. అవగాహన పెరగాలి. అది మీడియా చేయాలి. కానీ ఆ విషయం మీడియా మర్చిపోతోంది.( తెలియక కాదు..దృతరాష్ట్రులే ఛానళ్లని నడిపిస్తుంటే అంతే)

చాలామంది వచ్చారు. కానీ, ఈ ఘటనను ఒకటి, రెండు నెలల్లో అంతా మర్చిపోతారు. కాబట్టి మా అక్కా చెల్లెళ్ల అనుబంధం.. ఇదంతా సంబంధం లేనివి.
కానీ మీరు మీడియాలో చూపించే దాని ప్రభావం ప్రజలపై ఉండాలి. దీన్ని చూసి వారిలో అవగాహన పెరగాలి. వారిలో తెలివితేటలు పెరగాలి.
(ఎవరికైనా) ఇలాంటి పరిస్థితి వస్తే, మా అక్క ఫోన్ చేయలేదు. కానీ వాళ్లు ఫోన్ చేసేట్టు ఉండాలి. వారు ఇది గుర్తు చేసుకోగలగాలి. ఆ అవగాహనను మీడియా పెంచాలి. అంతేకానీ ఎమోషనల్ చేయడం కాదు.( లేదు మాకు వచ్చింది అదే..కావాలంటే చూడండి..మ ా  ఛానళ్లని ఖచ్చితంగా వారం తర్వాత..ఒక్క ప్రోమో కూడా కన్పించదు)

Comments