అంటకాగేందుకు ఎందుకింత ఆత్రం..సొంతంగా నడపలేకనే కదా..! ఇదేగా పాతికేళ్ల రాజకీయం



పదే పదే ఆవేశం..తలెగరేయడం..తర్వాత కన్పించకుండా పోవడం..నెలకోసారి ఢిల్లీ సీక్రెట్ టూర్ అంటూ ఊరంతా తెలిసేట్లు వెళ్లిరావడం..ఇదేనా పవన్ కల్యాణ్ పాతికేళ్లపాటు చేసే రాజకీయం. చాలాకాలంగా రాజకీయాలను గమనించిన తర్వాత జనం ఎటు మొగ్గుతారనే విషయంలో కొంత వరకూ ఓ నిర్ధారణకు రావచ్చు..మంచో చెడో ..ఓ  లైన్ పట్టుకుని ఉన్నవాళ్లకే జనం జై కొడతారని అనుకోవచ్చు..

కానీ ఎప్పుడు ఏది మాట్లాడతామో..ఇప్పుుడు మాట్లాడింది నెక్స్ట్ మీటింగ్ లోనే మర్చిపోవడం..తర్వాత మళ్లీ తన మాటలకి అర్ధం వేరు అని ఎక్స్ ప్లనేషన్ ఇచ్చుకునే లీడర్లకు నగుబాటు తప్ప ఎక్కడా విజయం దక్కదు..ఇదే అంశం పవన్ కల్యాణ్ విషయంలో జరిగిందంటే ఆయన ఫ్యాన్స్ కి నచ్చకపోవచ్చు..కానీ వాస్తవాన్ని ఎవరూ కాదనలేరు కదా..
2014లో జనసేన టిడిపి, బిజెపి కలిసి పోటీ చేశాయంటాడు..ఎక్కడ నీకు నువ్వు తప్ప అప్పట్లో ఎవరూ లేరు..కేవలం నీపై ఉన్న అభిమానం..బాబుగారి అనుభవం..మోదీగారిపై ఆశ..ఈ మూడు కలిసి టిడిపిని విజయతీరాలకు చేర్చాయప్పట్లో..కానీ బాబుగారి అనుభవం మోదీగారి జాణతనం ముందు మోకరిల్లేసరికి..నీ ప్రశ్నల వాడితనం జగన్ వైపే మళ్లించావ్..ఫలితం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కనివినీ ఎరుగని విజయం కట్టబెట్టారు జనం..రెండు దిగ్గజాలు అధికారపక్షంలో ఉండగా నీ దమ్ము ధైర్యం వాళ్లపై ప్రదర్సించకుండా..ప్రతిపక్షనేతపై ఎగిరెగిరి పడ్డావ్..

అప్పుడే ఈ మూడూ లోపాయికారీ ఒప్పందాలని జగన్ విజయవంతంగా జనం ముందు ఒప్పించాడు కాబట్టే ఇప్పుడు నువ్ ఎంత చించుకున్నా పట్టించుకోని సంఖ్యాబలాన్ని జనం కట్టబెట్టారు..ఇక ఇప్పుడు నీ ముందున్నది..పార్టీని నడపడం ఎలా గన్నదే..ఎందుకంటే 2019లో పాపం కాండిడేట్లని దింపి అభాసుపాలయ్యావ్ కాబట్టి..అందుకే ఎక్కడలేని ఫ్రస్ట్రేషన్..నిజానికి జనానికి ఇప్పుడు నీ అవసరం ఉంది..కానీ దాన్ని కాదని మళ్లీ బాబుగారి చెంతో...కమలం చెంతనో చేరేందుకు నానాతంటాలు పడుతున్నావ్..ఎవరు ఎవరి పంచనైనా చేరొచ్చు కానీ..ఫలితం ఏమిటి
పాతికేళ్లపాటు రాజకీయం నడపడానికి వచ్చానంటూ చెప్పిన పవన్ ఏడాది కూడా గడవకముందే ఇలా చాప చుట్టేస్తాను అనడం..పాపం ఆయన ఫ్యాన్స్‌కి ఎలా ఉందో...

Comments