మామలను మరిచి సొంతడబ్బాకే ప్రయారిటీ ఇస్తోన్న అల్లు అర్జున్


మా తాత ఎంత చేసాడు..
మా నాన్న మంచోడు
మా నాన్నలా ఎవరూ లేరు
మా ఫ్యామిలీ అంతా సినిమా తల్లికే అంకితం..
అంతా మా మా  
మరి మామ ఎక్కడ....?
అల్లు అర్జున్..ఆ మాటకి వస్తే..అసలు మెగా స్టార్ చిరంజీవి అండతో హీరోలైన ప్రతి ఒక్కరిలోనూ తామేదో దైవాంశ సంభూతులులాగా...సినిమా స్క్రీన్ పై ఉన్నట్లుగానే జీవితంలోనూ ఉన్నట్లు ఫీలవుతుంటారు..కానీ వారిలో ఒక్క చిరంజీవి మాత్రమే కాస్త నేలపై ఉన్నట్లుగా మాట్లాడతారు..ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ గారు కూడా ఇదే ధోరణి ప్రదర్శిస్తున్నారు..

ఇండస్ట్రీకి మేమెంత చేశాం అలాంటిది మా తండ్రికి ఒక్క అవార్డు ఇవ్వొచ్చు కదా అని..ఇంతకంటే దేబిరింపు ఏదైనా ఉంటుందా.వాస్తవానికి అల్లు అరవింద్ గారు గొప్ప గొప్ప హిట్ సినిమాలు తీసారు..దాంతో ఇండస్ట్రీకి ఒరిగినదానికంటే..ఆయనకి ఆయన ఫ్యామిలీకే ప్రయోజనం..ఒక్క స్టూడియో కట్టింది లేదు..ఒక సంస్థని నెలకొల్పింది లేదు..ఎందుకీ అత్మవంచన..కనీసం కృష్ణలాగా వరసగా సినిమాలు నిర్మించి జనాలకు (ఆర్టిస్ట్) కూడూ గుడ్డా అందించింది లేదు. సరే అన్నాళ్లనుంచి ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి..ఖచ్చితగా ఏదోటి ఇవ్వాలంటే ఇస్తారు..అందుకోసమే కదా..డీమ్డ్ వర్సిటీలను దింపేసింది..ఏదో డాక్టరేట్ ఇచ్చేయవచ్చు

కానీ ఇప్పుడు కళామతల్లికి సేవ చేయడానికే పుట్టామనే డైలాగ్ మాత్రం కర్ణకఠోరంగా అన్పిస్తోంది..అల్లు రామలింగయ్య..అల్లు అరవింద్..అల్లు అర్జున్ ఇంతేకదా...మీ సేవల క్రమం..మరి ఎన్టీఆర్..బాలకృష్ణ..హరికృష్ణ,
జూ.ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, తారకరత్న(నవ్వొద్దు) ఈ క్రమం చూస్తే దడ పుట్టదా..మరి కృష్ణ, రమేష్, మహేశ్, మంజుల, గౌతమ్, మంజుల కూతురు, సుదీర్ బాబు, గల్లా అశోక్..వీళ్లేమైనా తక్కువ సేవలు చేసారా...వీళ్లని వదిలేయండి..అక్కినేని ఫ్యామిలీ..నాగార్జున, నాగసుశీల, సుమంత్, సుశాంత్, సుప్రియ, నాగ చైతన్య, అమల, అఖిల్..వీళ్లకంటే ఎక్కువమంది ఉన్నారా ఇండస్ట్రీ ప్యామిలీలో
ఇంతెందుకయా...మీ మామ చిరంజీవి..పవన్ కల్యాణ్, నాగేంద్రబాబు, వరుణ్ తేజ్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, నీహారిక, వీళ్లంతా మాత్రం నటకుటుంబంలోని వారు కాదా..వాళ్లందరికంటే నువ్వూ..నీ ఫ్యామిలీ సేవ చేసిందంటే నిజంగానే ఇవ్వాల్సిందే అవార్డ్..

Comments