అసలే ఆ ఛానల్ కష్టాల్లో ఉంటే సదరు ఆంధ్రా ఆర్నాబ్ బిజెపితో కూడా చెడగొట్టాడా



చేతినిండా అన్నం తినడం ఎంతో అదృష్టం..అలాంటి అరచేతికి గాయమైతే..ఎలాగబ్బా..అబ్బే అదేం పట్టదు కొందరికి..మనం ఏ చేత్తో అన్నం తింటున్నామో ఆ  చేతికే బొక్క పడేలా వ్యవహరిస్తారు..పైగా తన మహిమతోనే సదరు చేతికి మనుగడ అనుకుంటారు..పదిమందినీ అనుకోమంటారు..అంతేకానీ సదరు సంస్థ మనుగడని దెబ్బతీసేలా వ్యవహరిస్తే ఏమైపోతుందనే ఆలోచనే ఉండదు

సరే ఇవన్నీ వ్యక్తిగతాలు...రీసెంట్ గా ఈ మధ్యన కాస్త తగ్గారు కానీ అన్ని న్యూస ్ ఛానల్స్ లో ప్రతి యాంకరుడూ తానేదో ప్రళయకాళ రుద్రుడిలా బిల్డప్ ఇస్తూ..చేతులూ ఊపుతూ..రొప్పుతూ చర్చికులపై ( నా ఉద్దేశం చర్చలో పాల్గొనేవాళ్లని) దండెత్తేవాళ్లు ఈ మధ్య కాస్త తగ్గింది...దాంతో రేటింగులు కూడా తగ్గిపోయాయనుకున్నారేమో కానీ
మళ్లీ అదే ఆర్నాబ్ గాడి దరిద్రపు డ్రెండ్ ప్రారంభమైంది..

అందులో భాగంగానే ఓ గరళకంఠమూర్తి..తానేదో ఆంధ్రదేశపు యుగకర్తలా పోజులు ఇస్తూ...తమ షోలకు ఆహ్వానించడంపై దండెత్తాడు..తానే ఓ సంధానకర్త అనే మాట మరిచిపోయి..పచ్చపిచ్చగా కామెంట్లు చేయడం ప్రారంభించాడు..దీంతో వళ్లు మండిపోయిన సదరు అతిధి..తానూ రివర్సయ్యాడు..ఇంకే్ముందు వీరంగమే...ఎంత తప్పులు చేసినా...ఏ రకంగా వ్యవహరించినా..ఎవరి ధర్మం వారిది..అతిధులు లేకుండా సదరు కార్యక్రమాలు నడవవు..ఇప్పటికే అధికారపార్టీకి వ్యతిరేకంగా బోలెడంత హంగామా చేస్తున్న సదరు చానల్ జనం చేత చీత్కారాలు రేటింగుల రూపంలో పొందుతోంది..అది చాలదన్నట్లు..అతిదులపైనా దండెత్తేసరికి..ఇక కేంద్రాధికార పార్టీనేతలకు కూడా సదరు మాధ్యమంపై మంటెత్తిందట..తొందర్లోనే వైఎస్సార్సీపీ బాటలోనే సదరు మాధ్యమానికి దూరంగా ఉండే ఆలోచన (కనీసం ఓ ఆరు నెలలు) చేస్తున్నారట..దీనిపై రాష్ట్ర కార్యాలయంలో బాగానే చర్చలు నడిచాయి..

అహం బ్రహ్మాస్మి అనేది ఆధ్యాత్మిక కోణంలో అన్నారు కానీ..ఇతర విషయాలలో కాదు..తనకేదో మంత్రదండం ఇచ్చినట్లు ఎవరూ ఫీలవకూడదు..ఫీలైతే..ఆ తర్వాత ఫీలింగులే ఉంటాయి తప్ప..పదవులు ఉండవు..అసలా పదవులే శాశ్వతం కానప్పుడు ఈ ఫీలింగులెందుకు పచ్చని అజెండా వదిలేసి పార్టీల ఎజెండా మోసే ప్రతి యాంకరుడికీ ఇదో గుణపాఠమే అంటున్నారు

Comments

  1. టీవీ 5 లో మూర్తి అసహ్యంగా రోత పుట్టించే లాగా ఆంకర్ చేస్తున్నాడు

    వీళ్ళు జర్నలిస్టులు ఎలా అయ్యారో అర్థం కాదు.

    తానేదో అపర మహాత్ముడైన ట్లు ప్రవర్తిస్తాడు. ప్రతి తెలుగు ఛానెల్ లోనూ దాదాపు ఇదే తంతు. దూ మీ బతుకులు చెడ. ఏమి జర్నలిస్టులు రా మీరు.

    ReplyDelete

Post a Comment