ముంబై హర్రర్ స్టోరీ...వణికిపోతున్నారు జనం


ముంబైకి రానున్న ఐదారు రోజులే నగరవాసుల భవిష్యత్తుని నిర్ణయించే సంకేతాలు వస్తున్నాయ్..వేగంగా పెరిగిపోతున్న కేసుల సంఖ్య చూస్తుంటే రోజుకి 200, 300 కూడా నమోదు కావచ్చనిపిస్తుంది....ఐతే ఇది ఇక్కడితో ఆగుతుందో లేక ఇటలీ, న్యూయార్క్ లాగా భయానక పరిస్థితికి దారి తీస్తుందో అనే భయాందోళన నెలకొంది..రోజుకి వంద..తర్వాత రోజు రెండు వందలు..మూడో రోజుకి నాలుగు వందలు...నాలుగో రోజుకి ఎనిమిదివందలు..ఇలా
కనుక వైరస్ వ్యాప్తి ఉంటే ఇక ముంబైని దేవుడే కాపాడాలని..గ్లోబల్ వైజ్ వైరస్ స్ప్రెడ్‌ని అంచనా వేస్తున్నవాళ్లు బెంబేలెత్తుతున్నారు..ఐతే వచ్చేవారానికల్లా ఖచ్చితంగా ఇక్కడ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుందనే అంచనాలు కూడా ఉన్నాయ్..మరోవైపు బిఎంసి కూడా రోజుకి 1500 టెస్టులు చేస్తోంది.. ప్రతి మున్సిపల్ వార్డ్ ని వదిలిపెట్టకుండా..లక్షణాలున్న ప్రతివారినీ టెస్ట్ చేస్తోంది ...నిజాముద్దీన్ ఎపిసోడ్ ఒకటి పరిస్థితిని ఈస్థాయికి తీసుకువచ్చిందని బిఎంసి అభిప్రాయపడుతోంది.

ఇలాంటి సిచ్యుయేషన్‌లో బాంబే మున్సిపల్ కార్పొరేషన్ దాని చరిత్రలోనే అతి పెద్ద యుద్ధానికి సిద్ధమైంది..రోజు రోజుకీ పెరిగిపోయి అత్యంత ప్రమాదకరంగా మారిన కరోనా వైరస్‌ని కట్టడి చేసేందుకు భారీ ప్రణాళికతో ముందుకు సాగుతోంది..ఇఁదులో బాగంగా స్టేడియంలను..క్లబ్బులను..స్కూళ్లని ఏదీ విడిచిపెట్టకుండా ప్రతి పెద్ద భవంతినీ క్వారంటైన్‌లుగా మార్చేందుకు అధీనంలోకి తీసుకుంది..వీటిలో అతి తక్కువ అంటే మైల్డ్ కరోనా సింప్టమ్స్ ఉన్న వారిని ఉంచబోతోంది వర్లీలోని నేషనల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఆఫ్ ఇండియాలో 8వేలమందిని క్వారంటైన్ చేయవచ్చు.
.
ముంబైలో  హాస్పటల్స్ కూడా కరోనా హాట్ స్పాట్స్‌గా మారడంతోనే ఇతర భవనాలను ప్రాంగణాలను క్వారంటైన్లుగా మార్చుతున్నట్లు బాంబే మున్సిపల్ కార్పోరేషన్ ప్రకటించింది...ముంబైలోని వోకార్డ్ హాస్పటల్స్‌లో వందమంది వైద్యసిబ్బందికి కరోనా సోకింది..అలానే జస్లోక్ అనే మరో ఆస్పత్రిలోనూ ఓ నర్సుకు కరోనా పాజిటివ్ వచ్చింది..దీంతో ఇక్కడున్న 1005మందికి టెస్టులు చేయగా...21మందికి కరోనా సోకినట్లు తేలింది..వీరిలో 19మందికి ఎలాంటి లక్షణాలు లేవు. బుధవారం సౌత్ ముంబైలోని భాటియా హాస్పటల్.. ఖార్‌లోని హిందుజా హాస్పటల్‌లోనూ ఇదే సిచ్యుయేషన్

మరోవైపు కేసులు పెరుగుతున్న నేపధ్యంలో వైద్యయంత్రాంగాన్ని సమాయత్తం చేయాల్సిన అవసరం ఉంది..అందుకే స్కూళ్లు..స్టేడియంలైతే తక్కువపాటి శ్రధ్ద చూపాల్సిన వారికి సరిపోతాయని..మిగిలిన ఐసోలేషన్ అవసరమైన వారికి మాత్రం కోవిడ్ 19 హాస్పటల్స్‌లో చేర్చాలని డిసైడైంది అసలు ఎవరికి కరోనా ఉందో లేదో తెలుసుకోవడమే ఇప్పుడు పెద్ద సమస్య  టెస్ట్ చేసిన తర్వాత 72 గంటలకు కానీ రిజల్ట్ రావడం లేదు..... ఓ వేళ టెస్ట్ చేసిన వ్యక్తి నెగటివ్ అయితే ఫర్వాలేదని..కానీ పాజిటివ్ అని తేలితే వారికి సర్వీస్ చేస్తోన్న సిబ్బందికి కూడా సోకుతుంది.....ఇన్ని ప్రమాదాలు, గంట గంటకీ పెరిగిపోతోన్న కేసుల మధ్య కంటికి కన్పించని శత్రువుతో ముంబై పోరాటం చేస్తోంది

Comments