ఫస్ట్ యానివర్సరీకి ముందు జగన్‌కి పెద్ద షాక్..మరి ఏబీ వెంకీ ఎస్ బాస్ అంటాడా ఇప్పుడు


ఏబీ వెంకటేశ్వర్రావ్ గారు ఇప్పుడు మళ్లీ డిజిపి పదవిని తీసుకుంటారా..సస్పెన్షన్ ఎత్తేసిన తర్వాత హైకోర్టు ఆయన్ని
సెలవులో పంపడాన్ని కూడా రద్దు చేస్తుందా..జస్ట్ ఆయన  పదవిలో కొనసాగుతున్నట్లు మాత్రమే పరిగణిస్తుందా..అన్నిటికీ మించి వద్దు పో అన్న జగన్ దగ్గరే ఆయన ఎస్ బాస్ అంటూ పని చేయగలరా..? ఇవన్నీ ఇప్పుడు  ఎంతో కుతూహలం రంధి కలిగిస్తోన్న వార్తలే..

వెంకటేశ్వర్రావ్ టిడిపికి అనుకూలంగా పని చేస్తున్నట్లు 2017 నుంచి విజయసాయిరెడ్డి గారు ప్రచారం చేస్తూనే ఉన్నారు..ఆయన మనుషులు తనని ఢిల్లీలో వెంటాడుతున్నట్లు ప్రెస్ మీట్ లైవ్‌లలోనే చాలాసార్లు చెప్పారు..అందుకే పవర్‌లోకి వచ్చిన తర్వాత తనని కొనసాగించరని ఏబీ వెంకటేశ్వర్రావ్ గారికి బాగానే తెలుసు..ఐనా  సరే విధి విదే...డ్యూటీ డ్యూటీనే..అనుకున్నట్లుగానే ఆయనకి ఉద్వాసన పలికారు..కానీ దానిపై 
కోర్టుకి వెళ్లి సాధించుకున్న తర్వాత..ఇప్పుడేంటి..ఏపీ గవర్నమెంట్ ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు వెళ్తుంది..అందులో డౌట్ లేదు..అక్కడా ఇదే రకమైన తీర్పు వస్తే...ఓకే..లేదంటే మాత్రం మళ్లీ రగడ మామూలే..ఐతే ఎలా వద్దు పో అంటున్న వ్యక్తి తిరిగి ఉద్యోగంలో జాయినైతే..( ఆ ఛాన్స్ ఎంతవరకో రెండురోజుల్లో తేలిపోతుంది) ఇద్దరికీ మొహమాటమే..
ఐతే సిఎం కాబట్టి..ఎస్ బాస్ అనాల్సిందే...రాజకీయ విమర్శలు చేసిన నోటితో..ఆయన ముందు శాల్యూట్ లు చేస్తూ తిరగడం కుదురుతుందా..( అది కూడా రాజకీయమే అయిపోయిందని బాబుగారి హయాంలో చాలాసార్లు ప్రూవ్ అయింది కదా..) ఐతే ఘనంగా ఫస్ట్ ఇయర్ కంప్లీషన్ పండగ చేసుకుంటోన్న వైఎస్సార్సీపీకి ఇలా కోర్టు షాక్ ఇవ్వడం..మింగుడుపడని అంశమే...

Comments