ఉదయం 7 గంటలంటే అర్థరాత్రా చంద్రబాబు గారు..అచ్చెన్న అరెస్ట్ లో మారిపోతున్న కాలం

బహుశా ప్రపంచంలోని అన్ని వార్తలు...అన్ని విషయాలు తెలుసుకుంటూ రాత్రిళ్లు నిద్ర లేకుండా గడిపేవారికి ఉదయం ఏడు గంటలంటే..అది అర్ధరాత్రనే అనుకుంటారనుకుంటా...విజయవాడ ఏసీబీ అధికారులు శ్రీమాన్ అచ్చెన్నాయుడుగారిని అరెస్ట్ చేసారనగానే..చంద్రబాబుగారి స్పందన చూస్తే అలానే ఉంది మరి...

అచ్చెనాయుడిని అరెస్ట్ కాదు..కిడ్నాప్ చేశారు..అర్ధరాత్రి జరిగిన ఈ వ్యవహారానికి సిఎం జగన్ బాధ్యత వహించాలి..ఆయనకేదైనా అయితే జగన్ దే బాధ్యత.అంటూ రొటీన్ స్టేట్ మెంట్ విడుదల ేచేసారు..అసలు నిజంగా అంత సీన్ జరిగి ఉంటే..స్పీకర్ కి ఓ సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇవ్వండి..తర్వాత కోర్టుకెళ్లండి..ఎటూ మీకు అలవాటైన పని కదా..అంతేకానీ ఇలా తాబేదార్లను మాత్రం టివీ ఛానళ్లపైకి ఉసిగొలిపి ఇలా అవాకులు చెవాకులు పేలితే ఎలాగండీ...లెక్కల ప్రకారం అర్ధరాత్రి అంటే...8 నుంచి 9 లోపు అనుకోవాలి...కానీ మీకు మాత్రం ఉదయం ఏడు గంటలు అర్ధరాత్రిలాగా కన్పిస్తుందంటే ...అది మా తప్పే మీలాగా తెలివిగా ఆలోచించలేకపోవడం..

పైగా అచ్చెన్నగారి అరెస్ట్ తో ఆయనకేదైనా అవుతుందని ఎందుకనుకుంటున్నారు..ఇప్పటిదాకా ఏపీలో ఎంతమంది టిడిపి లీడర్లు అరెస్ట్ కాలేదు..ఎవరికైా ఏమైనా అయిందా..భేషుగ్గా చేతులు ఊపుతూ హ్యాపీగా తిరిగేస్తున్నారు కదా...
ఖచ్చితంగా ఏపీ సిఎం జగన్ బాధ్యత తీసుకుంటారు..అచ్చెన్న సంగతి చూసుకుంటారు కానీ యూ డోన్డ్ వర్రీ ప్లీజ్ 

Comments

  1. జగన్ లక్షకోట్ల అవినీతి కాస్తా 40 వేల కోట్లకి తగ్గిందేమీ? ఇంకొకల్లని అరెస్ట్ చేస్తే వెయ్యికోట్లకి తగ్గిద్దేమో!

    ReplyDelete

Post a Comment