రూల్స్ మాస్క్‌లు..అన్నీ జనాలకేనా..సెలబ్రెటీలకు..వాళ్ల పెళ్లాలకు ఉండవా


అతను ఓ పెద్ద (ఒకప్పటి) మ్యూజిక్ డైరక్టర్ తమ్ముడు..ఆయనా మంచి మ్యూజిక్కే ఇచ్చాడు....అంతకి మించి ఆయన తమ్ముడో పెద్ద డైరక్టర్..తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాడని ఈ మద్య అంతా తెగ మోసేసిన దర్శకుడు..వెరసి ఇదంతా ఓ ఫ్యామిలీ ..ఈ ఫ్యామిలీ అప్పుడప్పుడూ కొన్ని అవగాహనా కార్యక్రమాలు..( వాళ్లకి అక్కర్లేనిది..మనకి మాత్రమే తెలియనది) చేస్తుంటుంది..తెలంగాణ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా..సెలబ్రెటీల లిస్టులో వీళ్లలో ఒక్కళ్లైనా ఉండి తీరుతారు..

ఐతే మరి పైన చెప్తోన్న సంగీతదర్శకుడి భార్య ఇవాళ కూరగాయలు కొనే పనికి బైటికి వచ్చిన సమయంలో ముఖానికి మాస్క్ లేదు..ఆమె ధరించలేదు..సరే..ఆమె వెంట సహాయకురాలిగా వచ్చిన బాలికకూ లేదు..ఇద్దరూ కనీసం ఓ గంటపాటు..మార్కెట్టంతా తిరిగేసారు..పైగా ఇక్కడే నాలుగైదు కేసులు వచ్చాయ్..మణికొండ ఏరియాలోని ఈ కూరగాయల సంతకి కనీసం వందమంది వస్తూ పోతూ ఉంటారు..నేను చెప్పిన సంగీతదర్శకుడు కుటుంబం నివసించే ఆపార్ట్ మెంట్లో అందరూ ప్రస్తుతానికి సేఫ్..ఇప్పుడు ఏదైనా జరిగితే ఎవరిది బాధ్యత..

అంతే చెప్పే నీతులు..అవగాహనా కార్యక్రమాలు మొత్తం జనాలకేనా..పొట్ట కోస్తే అక్షరం ముక్కరాని వాళ్లు కూడా ముఖానికి మాస్కులేసుకుని నాన తంటాలు పడుతుంటే..వీళ్లు మాత్రం ఇలా యదేచ్చగా ఫ్రీగా తిరగవచ్చా..ఆ ఏరియాలోని కనీసం నాలుగైదు కూడళ్లలోని సిసి ఫుటేజ్ కూడా ఇందుకు సాక్ష్యం..కొంతమంది ఈ దృశ్యాలను షూట్ కూడా చేసారు..ఐతే ఆ షూట్..ఎవరినో బ్లేమ్ చేయడానికి కాదు..సంత జరుగుతున్న తీరుని చిత్రీకరించారు..అందులో ఈ సెలబ్రెటీ కుటుంబసభ్యుల విహారం కూడా రికార్డైంది..

Comments