తెలుగుదేశానికి ఝలక్ ఇచ్చిన టిడిపి ఎమ్మెల్యేలు..చెల్లని ఓట్లన్నీ వర్ల రామయ్యకే


గెలిచే ఛాన్స్ లేదని కూడా చంద్రబాబునాయుడు గారు గొప్ప వ్యూహాత్మకంగా వ్యవహరించి వర్ల రామయ్యని రాజ్యసభకి ఎన్నికల్లో నిలబెట్టారు అంటే పార్టీ ఎమ్మెల్యేలుగా సాంకేతికంగా కొనసాగుతున్నా...వైఎస్సార్సీపీకి మద్దతుగా నిలిచినవారికి షాక్ ఇద్దామనేది ఆయన ప్లాన్ అంటే పార్టీకి వ్యతిరేకంగా ఓటేస్తే విప్ కత్తి విసురుదామని..ఐనా సరే..వాళ్లు ఓటేసారు..కానీ టిడిపికి చెల్లని ఓటు వేసి..ఝలక్ ఇచ్చారు
ఇది చాలనుకుంటా..రాజకీయం ఎవరి సొత్తూ కాదని..

పాపం వర్ల రామయ్య ఇప్పుడు బైటికి వచ్చి నైతిక విజయం నాదే అని చెప్పడం తప్ప ఇంకేం చేయలేరు..చెల్లని ఓట్లు వేయడమే కాదు బైటికి వచ్చి యధేచ్చగా చంద్రబాబుని..టిడిపిని ఎగతాళి చేయడానికి ఆ ఆఛాన్స్‌ని వల్లభనేని వంశీ బ్రహ్మాండంగా వాడుకున్నాడు..టిడిపి పనైపోయిందంటూ తాను పదే పదే పాడే పాటని మరోసారి పాడాడు..ఇలా చంద్రబాబుగారు అభాసు పాలవగా.


.ఇంకో ఇన్సల్ట్ ఢిల్లీసాక్షిగా జరిగింది..ఆల్ పార్టీ మీటింగ్‌కి మోదీగారు పిలుస్తారనుకుని ముందుగానే హాజరు అవుతామంటూ పేరిచ్చేశారు బాబుగారు..కానీ తీరా కనీసం 5గురు ఎంపీలున్నవారినే పిలిచారు.దీంతో ఇక్కడా గైర్హాజరుకు కారణాలను..ఏబీఎన్ వెతికి పెట్టాల్సిందే ఎందుకంటే..
వైఎస్సార్సీపీలో చేరినా..ఆ పార్టీకి ఓటేయకుండా టిడిపి అడ్డుకుందంటూ భజన మొదలుపెట్టడం ఆ ఛానల్‌కే సాధ్యమైంది మరి..ఇంతవరకూ ఒక్క ఎమ్మెల్యే కూడా వైఎస్సార్సీపీలో జాయిన్ అవలేదు..ఈ నిజాన్ని గ్రహించకుండా..అన్నీ వారనుకున్నట్లు జరిగితే ఎలా

Comments