నీహారిక పెళ్లి లవ్ మ్యారేజ్ కాదు..గమనించండి


హెడ్డింగ్ ఇలాగున ఎందుకు పెట్టానంటే..సినిమా వాళ్ల మ్యారేజ్ లు అనగానే చాలామంది లవ్ మ్యారేజ్ అనుకోవచ్చు..అలానే నీహారికగారు..వరసగా ఒక్కో ఫోటో రివీల్ చేస్తున్న తీరుని బట్టి లవ్ మ్యారేజ్ అయి ఉండొచ్చని ఊహాగానాలు వచ్చాయ్.. పై ఫోటో కానీ..కింది రైటప్ కానీ..టైమ్స్ ఆప్ ఇండియాది...
ఈ యువకుడు..గుంటూరు ఐజి ప్రభాకర్ రావ్ కుమారుడని చెప్తున్నారు..ఆయన వెంటనే ఇది లవ్ మ్యారేజ్ కానే కాదు..అసలు ఇద్దరికీ ఇంతకు ముందు పరిచయం కూడా లేదని ఘంటాపథంగా చెప్పడం వెనుక ఉద్దేశం ఒకటే..బాబూ మేం పద్దతిగా ( ఎక్కువమంది లవ్ అంటే పద్దతి లేనోళ్లు చేసేదన్నట్లుగా మాట్లాడుతుంటారు బహుశా అందుకే ఇలా అడిగిన వెంటనే క్లారిటీ ఇచ్చేసినట్లున్నారాయన) సంబంధం కుదుర్చుకోబోతున్నాం..ఇంకా ఏదనా డీటైల్స్ ఉంటే అది నాగేంద్రబాబు కుటుంబసభ్యులే అధికారికంగా ప్రకటిస్తారని సమయోచితంగా స్పందించారు

మంచి ముహూర్తం కుదిరితే ఈ ఏడాదే పెళ్లి కూడా చేసే ఆలోచనలో ఉన్నట్లు పైన రైటప్ చూస్తే అర్ధమవుతుంది..అదీ సంగతి ఇంతకన్నా ఎక్కువ అనవసరం..ఎందుకంటే..మీడియా అంటే ఏదో వ్యూస్ కోసం వాళ్లపై రాతలు రాస్తారని సదరు కథానాయిక గారు అంతకుముందు ఓ యూట్యూబ్ గొట్టాల్లో వాక్రుచ్చారు కనుక..అదీ సంగతి

Comments