రఘురామకృష్ణరాజు వైఎస్సార్సీపీలో అసమ్మతి ఎంపి డౌటేముంది

జిల్లాలో జిల్లా లెవల్ లీడర్ కావాలనుకుంటే అది వేరు..పార్టీ అధినేతనే నువ్వూ...నువ్వూ అంటూ సంబోధించడం వేరు..పార్టీ కోసమే నా తపన అంటూ కావాలనే నన్ను బైటికి పంపండి అన్నట్లు వ్యవహరించడం వేరు..బహుశా రఘురామకృష్ణ రాజు తీరు చూస్తే..రెండో వైఖరే తీసుకున్నట్లు స్పష్టంగా కన్పిస్తుంది..

ఐనా కూడా ఇంకా వెటకారంగానో..వ్యంగ్యంగానో..నా బొమ్మ పెట్టుకునే గెలిచారు..ఏం పీకారు..అప్పుడు ఇప్పుడూ దమ్ముంటే రాజీనామా చేయండి అంటూ సవాళ్లు విసురుతున్నారంటే..ఖచ్చితంగా పార్టీ నుంచి బైటికి పోయే ఆలోచనే..దానికి ముందు ఎంత రచ్చ చేయాలో అంత చేద్దామనేది ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ..అటు టిడిపిలో వల్లభనేని వంశీ..గిరి..అండ్ కో చేస్తోన్న పని ఇదే..దీన్నే రఘురామకృష్ణరాజు కూాడ ఫాలో ఆవుతున్నాడు..ఇందులో సందేహం లేదు..ఐతే ఈ  ఎమ్మెల్యేలకంటే..ఏదో ఒకటి వస్తుంది..మరి ఈ ఎంపికి ఏమొస్తుంది..?

బిజెపిలో జాయినైతే..మంత్రిపదవా..లేదు..పోనీ నామినేటెడ్ పోస్టా...చెప్పలేం..పోనీ ఏకంగా బిజెపికే అధ్యక్షుడవుతాడా..చెప్పలేం..కానీ ఆల్రెడీ జంపైపోయిన రాజ్యసభ సభ్యులకు ఈయన కూడా లోక్ సభలో తోడుగా కూర్చోవడం తప్ప ప్రత్యేకంగా ఒరగదు..కానీ ప్రత్యేకహోదా విషయం మాత్రం ఆ పార్టీలోకి పోగానే..ప్రత్యర్ధులకు అస్త్రం ఇచ్చినట్లే...నువ్ పోయావ్ కదా..ఆ పార్టీలోకి..మరి ఆ పార్టీనే కదా ఇవ్వాల్సింది..ఇప్పించు అనే నినాదం రాకతప్పదు..

Comments