లోక్‌సభలో రఘురామకృష్ణరాజు పార్టీ ఏమని సంబోదిస్తారో తెలీదా..?

నాలుగు రోజులు టీవీల్లో కనపడగానే..అది తమ హీరోయిజం అనుకుంటే పొరబాటు..ఆ  సంగతి సదరు కథకి మూల పాత్రధారులకు కూడా తెలుసు..ఓ మర్డర్ చేసినవాడు..ఓ  రేప్ చేసినవాడిని కూడా న్యూస్ లో చూపిస్తారు..అంత మాత్రాన ఇదిగో మా పాపులారిటీ అనుకుంటే..వాళ్లంత వాజమ్మలు ఉండరు..

ఇప్పుడు త్రిపుల్ ఆర్ రాజు..పరిస్థితి కూడా ఇంతే ఉంది..తానేదో గొప్ప లాజిక్ లాగినవాడిలాగా..నా పార్టీ యువజనశ్రామిక రైతు అని..వైెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కాదు అంటూ ఈయనగారు వెలగబెడుతున్న నిర్వాకం చూస్తే..నన్ను పంపండి బైటికి దమ్ముంటే అన్నట్లుగా..వ్యవహరించడం..చూస్తుంటే..అసలు ఇంక నాలుగైదు రోజుల్లో
పార్టీ నుంచి పంపేయడమో..లేదంటే దిష్టిబొమ్మలాగా వదిలేయడమో చేయకతప్పదన్నట్లుగా ఉంది..

జగన్ ని నేనేమీ అనలేదు..జగన్ ఎంత..మోదీగారు తలుచుకుంటేనే నాకు పదవి వచ్చింది..నాకెంత ఇమేజ్ ఉందో తెలుసా..దమ్ముంటే నేనొక్కడ్నే కాదు..వాళ్లూ రాజీనామా చేయాలంటూ..పిలుపు ఇవ్వడం తర్వాత..కేంద్రబలగాలు నాకు రక్షణ కల్పించాలని మొర పెట్టుకోవడం..అసలు ఈ డ్రామా అంతా ఎందుకు నిజంగా అంత చేవ ఉంటే..పోయి ఆ పార్టీలోనే కులకవచ్చు కదా..ఇలా కులికిన చకోర పక్షులు ఎస్పీవైరెడ్డి..23మంది ఎమ్మెల్యేలు ఏమయ్యారో చూస్తూనే ఉన్నాం కదా..అక్కడికేదో 22మంది ఎంపీల పెట్టు తానొక్కడినే అయినట్లు డ్రామాలు కాకపోతే..నీకు నువ్ అప్పాయింట్ మెంట్ అడగ్గానే ఇచ్చేయాలా..నీకు తెలిసింది కొంచెమే..ఎంపి పదవి వచ్చిందే ఇప్పుడు...నీకా సత్తా ఉంటే..ఈపాటికి చత్ ఈ పార్టీ నాకొద్దు అని వదిలేసి తిరిగివాడివి...నువ్ వాజమ్మ నంబర్ వన్‌వి కాబట్టే...రిజైన్ చేయమంటే చేయకుండా..చూరు పట్టుకుని వేలాడుతున్నావ్..కాబట్టి..రఘురామా..ఇక నీకు మూడిందోయ్ కాలం చేతిలో కర్మా..!

Comments