ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌తో సినిమానటుల భేటీ వెనుక అసలు కీ రోల్ ఈయనదే

పైన చూడండి..అక్కినేని నాగార్జున ఎంత దిలాసాగా కూర్చుని చిరునవ్వులు చిందిస్తున్నాడో...ఆయనకంటే తక్కువ ఎత్తులో ఆంధ్రప్రదేశ్ సిఎం జగన్ మోహన్ రెడ్డి...జగన్ గురించి ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రచారం చేస్తారో..వాటిలోనిజమెంతో ఈ ఫోటోలు చూస్తే తెలిసిపోవాలి..ఆయన్ని అందరూ సార్ అనే పిలవాలని..ఆయన ముందు సాగిలబడాలని..రకరకాలుగా ఆడిపోసుకునేవారికి ఈ సీటింగ్ అరెేంజ్‌మెంట్ జగన్ సింప్లిసిటీ గురించి చెప్తుంది..ఓ  పార్టీ అధ్యక్షుడిగా..అధినేతగా సార్ అని పిలవమని చెప్పడంలో తప్పేంలేదు...అలా పిలిపించుుకని..బొత్స సత్యనారాయణా...పిల్లి బోసూ...మైసూరా రెడ్డీ అని పిలిస్తే తప్పు...కానీ జగన్ ఏ రోజూ అలా పిలవడు..కేవలం అన్నా అనే సంబోధిస్తాడు..సరే ఈ భజన కార్యక్రమం పక్కనబెడితే...

ఇండస్ట్రీ అంతా జగన్ని కలవాలని ఏడాదిగా అనుకుంటుందని చిరంజీవి చెప్పడం పేద్ద అబద్దం..అంత సీన్ లేదు..వాళ్లకి అవసరం పడలేదు కాబట్టే కలవలేదు..ఇప్పుడు ఈ ఫోటోలో కన్పిస్తున్నవాళ్లలో ఒక్క నాగ్ తప్ప అంతా..జగన్ గెలవకూడదని అనుకున్నవాళ్లే..అందులో సందేహమే లేదు...ఈ విషయం జగన్‌కి తెలియకనా...
ఐనా సరే తన గెలుపుపైనే దృష్టి పెట్టినవాడికి ఇవన్నీ పట్టవు కదా..పడితే అది రాజకీయాల్లో పతనానికే దారి తీస్తుంది..

అందుకే అవసరార్దమో..నిజంగా ఇండస్ట్రీ కోసమో సొంతసినిమాల విడుదల కోసమో వచ్చిన వారితో ముచ్చటించాడు..పంపించాడు..నిజానికి ఏపీలో సినిమా షూటింగ్స్ కోసం పర్మిషన్ జగన్ ఇస్తే...ఏ మాత్రం చేస్తారు..అంతా నాటకం..జగన్ అడిగే ఉంటాడు..ఇప్పటిదాకా మార్చి కి ముందు ఎన్ని సినిమాలు చేసి ఉంటారు అని
సమాధానంగా నవ్వేసి ఉంటారు..వీళ్ల తపన అంతా థియేటర్ల  ఓపెనింగ్ గురించే..ఏపీలో తెరిస్తే...ఆర్టీసీలాగా..తెలంగాణలోనూ తెరిపించుకోవచ్చనేది వీళ్ల ఐడియా...
ఐతే ఇంతమంది తరలిరావడం వెనుక నాగార్జునే కీ రోల్..అనో..చిరు గ్యాంగ్  లీడర్లా నడిపించాడనో అనుకోవద్దు..నిజానికి ఈ ఫోటోల్లో కన్పించని ఓ వ్యక్తి ఉన్నాడు..ఆయనే విజయచందర్..ఆయన్ని అడ్డంపెట్టుకునే వీళ్లంతా..జగన్ దాకా రాగలిగారు..వైఎస్ హయాం నుంచే ఆయనతో ఎలా టచ్‌లోకి వచ్చాడో కానీ అప్పట్నుంచి ఆ ఫ్యామిలీతోనే నడిచాడాయన..ఇప్పుడు జగన్‌కి ఇండస్ట్రీకి మధ్య రాపో బిల్డప్ అవడానికి కూడా విజయ్ చందరే కారణం..ఐనా ఎక్కడా ఆయన్ని ఫోకస్ చేయరు..ఏ అరవింద్ నో..జెమినీ కిరణ్‌నో...దిల్ రాజునో..చిరంజీవినో ఫోకస్ చేస్తారంతే



Comments