నిమ్మగడ్డే ఏపీ ఈసీ...సుప్రీంకోర్టు జడ్జ్ మెంట్..లైట్ మోడ్‌లో జగన్


వరసగా కోర్టులో ప్రతికూల నిర్ణయాలు వెలువడుతున్న ఏపీ ప్రభుత్వానికి ఇవాళ అత్యున్నత న్యాయస్థానంలో కూడా  సేమ్ సిచ్యుయేషనే ఎదురైంది..ఏపీకి నిమ్మగడ్డ రమేష్ కుమారే ఎలక్షన్ కమిషనర్ అని  హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఎలాంటి మార్పు లేదని ప్రకటించింది..అసలు రాజ్యాంగబద్ద సంస్థలతో ఎందుకు ఆటలాడతారంటూ కూడా
చివాట్లు పెట్టినట్లు కథనాలు వస్తున్నాయ్..వాస్తవానికి కోర్టులో ఏం జరుగుతుందో మనం చూడం..కానీ ఎక్కువ పత్రికలు..వార్తా మాధ్యమాలు ఏ బాష వాడితే అదే వాస్తవంగా చెల్లుబాటు అవుతుంది..

ఇదే సాక్షిలో మాత్రం అసలు రమేష్ కుమార్ నియామకంపై కూడా కోర్టేదో నోటీసులు ఇచ్చినట్లు రాసుకొచ్చింది..ఏదెలా ఉన్నా..సరే ప్రస్తుతానికి ఏపీకి నిమ్మగడ్డ రమేష్ కుమారే ఎలక్షన్ కమిషనర్..ఆయన బాధ్యతలు మళ్లీ తీసుకుని హైదరాబాద్ నుంచే విజయవాడకు బయలుదేరవచ్చు..లేదంటే అక్కడే ఉండి పనులు చక్కబెట్టవచ్చు..కానీ ఎన్నికలు ( లోకల్ బాడీవి) ఎప్పుడు పెడతాడో మాత్రం ఇప్పట్లో చెప్పలేం...ఏప్రిల్ లోనే నిర్వహించి ఉంటే..ఈపాటికి సెట్ అయి ఉండేది..కానీ ఇప్పుడు కేసులు ఎంతగా పెరిగిపోయాయో తెలిసిన తర్వాత కూడా ఎన్నికలు పెట్టడానికి ఇదేం సౌత్ కొరియా కాదు కదా
ఐనా సరే ముఖ్యమంత్రి తలచుకుంటే అన్ని ఏర్పాాట్లు చేయవచ్చు..ఎన్నికలు పెట్టవచ్చు...కానీ...ఇక్కడే మన జనాల అలవాట్లకి..పద్దతులకు కరోనా కావాల్సినంత పాకుతుందేమో అనే డౌట్...పోనీ టచ్ ఫ్రీ ఎన్నికలు నిర్వహించేంత సీన్ లేదు..బ్యాలెట్ పేపర్ వాడాలి..లేదూ ఈవిఎం వాడినా...బటన్ నొక్కాలి..ఇ
ఈ జంఝాటం అంతా కూడా ఎన్నికల వరకూ...మరి జగన్ పర్సనల్‌గా తీసుకుంటే మాత్రం సిఎం వర్సెస్ ఈసీగా మారడం ఖ ాయం..

Comments