రాజకీయంగా అరెస్ట్ చేసారు సరే అంతమాత్రాన అచ్చెనాయుడు అమాయకుడా..అవినీతేం చేయనట్టా


అచ్చెన్నగారి అరెస్ట్ రాజకీయ కారణాలతోనే జరిగింది..నో డౌట్..ఐతే ఏంటి..దానికి బిసీ నేత అరెస్ట్ అనో..కక్ష పూరిత అరెస్ట్ అనో వేరే సిగ్నల్స్ పంపినంత మాత్రాన అసలేం జరగుకుండా పోతుందా...ఏ ఆధారాలు లేకుండానే అరెస్ట్ లు అవుతాయా...మరిదే లాజిక్.వైఎస్ జగన్ విషయంలో ఎందుకు ఒప్పుకోరు..పైగా ఇప్పుడు ఆయనమేనా ఉగ్రవాదా అలా అరెస్ట్ చేశారని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు..ఆయనకేం సంకెళ్లు వేయలేదు..ముఖానికి ముసుగు వేయలేదు..సరే ఎవరిని అరెస్ట్ చేసినా ఇలానే వాపోతుంటారు వదిలేద్దాం

అరెస్ట్ అయిన వెంటనే పట్టాభి అని ఓ టీడిపి అదికార ప్రతినిధి ఉన్నాడు..ఆయనంటాడు..అసలు ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ నడిచేదే కేంద్రం కనుసన్నలలో..రాష్ట్రం జస్ట్ పర్యవేక్షిస్తుంది అంటాడు..కాబట్టి ఇక ఇందులో గోల్ మాల్ ఏదైనా జరిగితే..ఆ మందుల కొనుగోళ్లు..వాటిలో మతలబులంతా..మోడీకే తెలుసు..మోడీని అడగండనా..ఆయన ఒపీనియన్...సరే అదే వాస్తవమైతే..జస్ట్ టెరాసాఫ్ట్ అనే కంపెనీకి నామినేషన్ పద్దతిలో మెడిసిన్స్..వగైరా వగైరా నిర్వహించుకోవడానికి ఎందుకు అచ్చెన్న రికమండ్ చేయాలి..ఇది కూడా మంచి కోణంలోనే చూసి వదిలేద్దాం..

అచ్చెనాయుడు పేదలకు గొప్ప వైద్యం అందాలనే సదుద్ధేశంతో తెలుగుదేశంలోని ఓ మంత్రిగా ఎంప్లాయీ స్టేట్  ఇన్సూరెన్స్ మెడికల్ కొనుగోళ్లకి ఓ  కంపెనీని రికమండ్ చేసారనేది టిడిపి వాదన కదా...అదే రుజువు అవుతుంది కదా..కోర్టులలో ...ఎటూ ఏపీలో ప్రస్తుతం మంచి జరుగుతుందంటే అది కేవలం కోర్టులవల్లనే అని రెండువారాలుగా టిడిపి ఊదరగొడుతుంది కదా..ఆ కోర్టే అచ్చెన్నగారిని కాపాడుతుంది..ఏమంటారు..?

Comments

  1. "అచ్చెన్నాయుడు అమాయకుడా, జగన్ బంగారమా" లాంటి విషయాలు న్యాయ వ్యవస్థలు తేల్చాలిగాని బ్లాగుల్లోను మీడియాలోనూ సొంత జడ్జిమెంట్ వాడటం పుష్పవిలాపమే అవుతుంది!

    ReplyDelete

Post a Comment