చిరంజీవిపై బాలయ్య ఇన్ డైరక్ట్ కామెంట్స్..బర్త్ డే విషెస్‌తో చిరు

ఇండస్ట్రీలో దాసరి గారు లేని లోటు తీరిందా..ఓ యాంకర్ కమ్ ప్రెజెంటర్ ప్రశ్న...
"లేదూ..అస్సలు..వన్ పర్జంట్ గూడా లేదూ..అసలు ఆయన...జాలా గష్టపడేవారు..దాసరి గారు..వేరు అసలు ఆయన కష్టపడి పని జేసే తత్వం..." ఇది బాలయ్య సమాధానం
అర్ధమైపోలేదూ..కావాలని పనిగట్టుకుని మెగాస్టార్ చిరంజీవిని దాసరి ప్లేస్‌లో ఊహించేవారికి..ఉంచేవారికి బాలయ్య సమాధానం ఎందుకు అలా చెప్పాడో...నిజానికి ఇండస్ట్రీలో హీరోలు నాగార్జున, చిరంజీవేనా...మోహన్ బాబు లేడా..వెంకటేష్ లేడా..మహేష్ బాబు..పవన్ కల్యాణ్, శ్రీకాంత్..నాని..ఇంతమందిని వదిలేసి...వీళ్లకి వీళ్లే మీటింగ్స్ పెట్టుకోవడం తప్పు..లేదంటే ఇది మా పర్సనల్ గా పెట్టుకుంటున్న మీటింగ్ అని క్లియర్ గా చెప్పాలి..పర్సనల్ అంటే వారి పనులు కోసం అని కాదు..ఎవరి ఇంట్రస్ట్ తో వాళ్లు ఇతర సంఘాలతో పని లేకుండా..ఓ ఇష్యూపై వెళ్లడం..
కానీ అది చెప్పడం లేదు..ఇండస్ట్రీ కోసమే మా అంతట మేం వెళ్తున్నాం అంటారు..అదే కాలింది బాలకృష్ణకి..
మరి చిరంజీవి గారేమో ఆయనకి  బర్త్‌డే విషెస్ చెప్తారు..తప్పేం లేదు..ఈ గొడవకి ముందూ..ఆ తర్వాతా వీళ్ల పలకరింపులకు ఢోకా ఉండదు కానీ..
అరమరికలు లేని స్నేహం మాత్రం లేదు..అది కొట్టొచ్చినట్లు కన్పిస్తూనే ఉంది..బాలయ్య మనస్తత్వం ఆయన మాటల్లోనే కన్పిస్తుంది..తాను వెళ్లనీయండి వెళ్లనీయకపోనీయండి పిలవకుండా..అందరూ ఇండస్ట్రీకి ప్రతినిధులే అనడం అతనికి నచ్చి ఉండకపోవచ్చు..అందుకే ఇలా ఇన్ డైరక్ట్..డైరక్ట్ సెటైర్లతో అల్లాడిస్తున్నాడు..లేకపోతే  ఈ 60ఏళ్లలో బాలయ్య ఎప్పుడైనా అన్ని చానళ్లని అడగనివాడిదే తప్పన్నట్లుగా ఇంటర్వ్యూలు ఇవ్వడం చూసారా..(ఛానల్స్ పుట్టి 25ఏళ్లనుకోండి..)



Comments