సినిమా స్టోరీకి పనికి వచ్చే ప్లాట్..లవర్ సంతకం ఫోర్జరీ చేసిన శ్యామ్ కే ..మళ్లీ బొక్కలోకి పంపిన కోర్టు

సినిమా ప్రపంచంలో అంతా వేరు అంటారు..వాళ్లదంతా అదోలోకం ఎవరూ ఎవరితో సరిగా ఉండరు..కానీ అంతా చాలా దగ్గరగానే ఉంటారంటూ రకరకాలుగా మాటలు అంటుంటారు..మొత్తంమీద మంచి కంటే చెడునే ఎక్కువగా నమ్ముతారు..దానికి ఉదాహరణలుగా చాలావాటిని చూపిస్తారు..గట్టిగా అడిగితే..మేం మనుషులం కాదా..ఏం తప్పులు ఏ  ఇండస్ట్రీలో లేవూ అంటారు..కానీ అందరికీ పది కాలాలపాటు తెరపై ఎప్పుడు కావాలంటే అప్పుడు నీతులు పంచేది చలనచిత్ర రంగమే కాబట్టి ఆ  రంగం కొద్దిగా సంయమనంతో ఉండాలని కోరుకుంటారు

కానీ స్యామ్ కే నాయుడు..అనబడు చోటా కే నాయుడు బ్రదర్ చేసిన పని ఇప్పుడు బైటపడటంతో..వావ్ సినిమాలోకం నిజంగానే వేరబ్బా అన్పిస్తోంది.. ముందు ఐదేళ్లో..నాలుగేళ్లో ఓ యువతితో అఫైర్ నడపడం ఏంటి..అప్పటికీ ఆయనకి పెళ్లై పిల్లలు కూడా ఉన్నారంటున్నారు..పెళ్లాంతో గొడవలు ఉన్నాయి కాబట్టి..ఇలా చేశాడంటారా..కానీ ఆ అమ్మాయి ఇప్పుడు మహిళగా మారింది..తనతో కటీఫ్ చెప్పేస్తానంటే..అదెలా కుదురుతుంది నువ్ నాతో రిలేషన్ పెట్టుకోకముందు చెప్పిందేంటీ ఇప్పుడేంటీ చేసేదీ అంటూ సదరు మహిళ ఈ కెమెరేమేన్ పై కేసుపెట్టింది..ఇది వ్యక్తిగత వ్యవహారమే కదాని ఎవరూ పెద్దగా రాయలేదు..ఏ ఛానల్ కూడా వేయలేదు..కానీ..ఇప్పుడు చోటా గారి బ్రదర్ చాలా బడా మోసగాడు..గుండెలు తీయగల బంటు అని నిరూపించుకున్నాక కూడా ఎవరూ రాయకుండా ఎలా ఉంటారు..ఏకంగా కోర్టుకే తన లవర్ తో తాను సెట్ చేసుకున్నట్లు ఓ డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేశాట్ట..

జడ్జిగారు ఇది నమ్మేసి బెయిల్ ఇచ్చేశారట..అంటే రెండు రోజులు కూడా జైల్లో ఉండలేనప్పుడు నిజంగానే సదరు మహిళతో అడ్జస్ట్ అవ్వొచ్చు కదా..లేదు..మరి మండదా సదరు మహిళామణికి అందుకే మళ్లీ కోర్టుకెళ్లింది అసలు బండారం బైటపడింది..ఇంకేముందు మనోడు మళ్లీ బొక్కలోకి పోయాడు..అంతా చూ స్తుంటే సిినిమా స్టోరీలకు పనికి వచ్చేలానే ఉంది కదా..మరి క్లైమాక్స్ ఎలా ఉఁటుందో 

Comments