జగన్‌కి జేసి కొడుకు వార్నింగ్ అట..వాటే కామెడీ


మనస్థాయి ఏంటో..తెలుసుకోకుండా ఎగిరెగిరి పడితే ఏం జరుగుతుందో చూస్తూనే ఉన్నాం..కడప జిల్లానే కాదు..రాష్ట్రానికే లీడర్ వైఎస్..ఆయన వారసుడిగా జగన్ ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు..తనంతట తానే సొంతంగా పార్టీ పెట్టడమే కాదు..అధికారంలోకి వచ్చి మరీ తన సత్తా చూపించాడు..తన వర్గం వాళ్లతోనే గెలిచాడు..అబ్బే అదలా గెలవలేదు..ఇలా చేయలేదు..ఇలాంటి సోంబేరి కబుర్లు చెప్పే ఇతర లీడర్లు సొంతంగా ఓ సీటు కూడా గెలవలేదనే సంగతి గుర్తెరగాలి..
అతను ఓ మతానికే చెందినవాడని..ఓ కులానికే చెందినోడని..చెందనివాడని రకరకాలుగా ఎన్నికలకు ముందు వ్యాసాలు అచ్చొత్తినవారు కూడా ఇప్పుడు నడుస్తున్నది జగన్ శకమని గుర్తెరిగారు..కేసులను సాకుగా చూపించేవాళ్లు అవి కూడా తొలగితే..అప్పుడేమని వాదిస్తారో మరి..సరే ఈ సంగతి వదిలేస్తే..కనీసం ఓ జిల్లా లీడర్ గా కూడా ఇప్పుడు గుర్తింపు లేని జేసీ దివాకర్ రెడ్డి..ప్రభాకర్ రెడ్డిలు..బాబూ జగన్ నీకు దాసోహం అనడం తప్ప అన్నీ చేసారు..ఐనా అవన్నీ కుదరలేదు కాబట్టే..ఇప్పుడిక శాపనార్ధాలు ప్రారంభించారు..

వారసులకోసం జగన్‌ని ఆశ్రయించిన ఎందరో పెద్ద లీడర్లు ఉన్నారు..వీరంతా పెద్ద లీడర్లైంది సొంతంగా కాదు..పార్టీల  అండతోనే..ఎదిగారు..మంత్రులయ్యారు..ఇప్పుడా పార్టీలు పరాజయంతో శూన్యంగా మారడంతో జగన్ ని ఆశ్రయిస్తున్నారు..ఈ సంగతి వాళ్లకి బాగా తెలుసు..జగన్ కి అంతకంటే ఎక్కువే తెలుసు..అలాంటిది ఇప్పుడు మాకూ టైమ్ వస్తుంది..ప్రతిీకారం మేమూ తీర్చుకుంటామంటూ..జేసీ పవన్ అట..జగన్ కి వార్నింగ్ ఇవ్వడం చూస్తుంటే నవ్వు రాక ఏమవుతుంది..ఇలా చేయబట్టే కదా.ఒక్కడ్ని చేసి కేసులు పెట్టి వేధించి..పదవి దక్కకుండా ఓ సారి అడ్డుపడగలిగారు..కానీ కాలం ఎప్పుడూ ఒకలా ఉండదు కదా..రివర్సైంది..మళ్లీ అది రివర్వుతుందనుకోవడం పిచ్చి తనం...ప్రతిపక్షంలో ఉన్నప్పుడే లెక్కచేయని జగన్..ఇప్పుడు ఈ ఉడతఊపులకు భయపడతాడా...

ఓసారి జైలుకి వెళ్లొచ్చారు కాబట్టి అందరినీ పంపాలనుకుంటున్నాడంటూ చంద్రబాబుగారు వీరాలాపాలు..శాపనార్ధాలు పెట్టడం కాదు..మరి అంత ధైర్యస్థులైతే..ఎందుకు భయం..వెళ్లండి సార్...జైలు తలుపులు ఎంతమందికోసమో ఎదురు చూస్తున్నాయ్...ఎచ్చచ్చ గచ్చచ్చ అన్నారు..

Comments