సిగ్గులేనమ్మ దేన్నో పట్టుకుని వేలాడిందట..ఇంత అడ్డగోలు అబద్దాలా..రాజుల్లో మంత్రులే లేరట

 




శత్రుచర్ల విజయరామరాజు 2004-కేబినెట్ మినిస్టర్( వైెఎస్ హయాం)

కనుమూరు బాపిరాజు -2007-కేబినెట్ మినిస్టర్( వైఎస్ హయాం)

కనుమూరు బాపిరాజు-2011 టిటిడి ఛైర్మన్ ( కిరణ్ కుమార్ రెడ్డి హయాం)

చెరుకువాడ శ్రీరంగనాథరాజు-2019 మంత్రి( వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాం)

పెన్మత్స సాంబశివరాజు-వైఎస్సార్సీపీ లీడర్(  చనిపోయే ముందు 8 ఏళ్లు ఉన్నది ఈ పార్టీతోనే)

పి.సురేష్ s/o పెన్మత్స సాంబశివరాజు ఎంఎల్సీ-వైఎస్సార్సీపీ 2020-స్టిల్

ఇవన్నీ కొన్ని మాత్రమే..ఏంటీ పేర్లు హోదాలు అంటారా..

క్షత్రియ కులస్థులపై జగన్ మోహన్ రెడ్డి కక్ష కట్టారని..ఆ మాటకి వస్తే అసలు వైఎస్సార్ హయాంనుంచే ఈ కసి ఉందంటూ మనందరికీ తెలిసిన ఓ ఛానల్ ఓ పనికిమాలిన చర్చ పెట్టింది. దీన్ని పనికిమాలిన అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే, సదరు కులస్థులు ఓ పేపర్ ప్రకటన ఇస్తే..సాక్షి తీసుకోలేదని..దమ్మున్నోళ్లం కాబట్టే తాము తీసుకున్నామంటూ తెగ వాపోయింది..ఇందులో చర్చలంకంటూ కూర్చున్న ఓ మారాజు అంటాడు..అసలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంనుంచే రాజులపై దాడులు జరుగుతున్నాయట..బోలెడంత తొక్కేశేరట..దానికి ఉదాహరణగా ఒక్క రాజు మంత్రికీ పదవి దక్కలేదంటాడు..జస్ట్ అదెంత అబద్దమో..పైన లిస్టులో ఫస్ట్ద ్ ది..లాస్ట్ ది చూడండి


వెంటనే శత్రుచర్లపై కులాల లెక్కలు తీయకండి..అతగాడిపై దొంగ సర్టిఫికెట్ తో ఎమ్మెల్యేగా గెలిచాడని..ఆయన కొండదొర కాదని..క్షత్రియ కులస్థుడనీ కోర్టు కూడా తేల్చింది..ఇవన్నీ తెలీకుండానే మంత్రి పదవి ఇచ్చేంత అమాయకులు లేరు ఎవరూ..సరే దాని తర్వాత కనుమూరి బాపిరాజు..వైఎస్ కి ఎంత మిత్రుడో ఎవరికి తెలీదు..తాను అపురూపంగా పెంచుకునే మీసాలను కూడా తిరుమలలో అర్పించిన సాన్నిహిత్యం బాపిరాజుది..వైఎస్ సిఎం అయితే తానీ మీసాలను గొరిగించుకుని మొక్కు తీర్చుకుంటానని ముందు చెప్పి మరీ ఆ పని చేశాడాయన..అందుకే 2007లో మంత్రి పదవి దక్కింది. ఆ తర్వాత కూడా జగన్ వెంట నడవకుండా ఉఁడేందుకు కిరణ్ కుమార్ రెడ్డి ఆయనకు టిటిడి చైర్మన్ పదవి ఇచ్చారు..సో రాజులపై వైఎస్ కి కసి ఉంటే ఇచ్చేవాడా పదవి....బురద జల్లడం కడుక్కోమనడం

తర్వాత చెరుకువాడ రంగనాధరాజు..క్షత్రియుడు కాదా..మరి ఆయనకి ఎలా దక్కింది పదవి..ఓహో..మీకు నచ్చినవారికి పదవి ఇస్తేనే క్షత్రియులవుతారా..సరే ఓకే...అసలు ఎక్కడైనా నాలుగు ఓట్లు వస్తాయంటేనే రాజకీయనాయకుడు తన ఆలోచనలకు పదును పెడతాడు..అందులో భాగంగానే కొందరికి దక్కుతాయి, కొందరికి పదవులు దక్కవు..ఈ మాట తెలిసి కూడా ఫలానా కులానికి జగన్ మోహన్ రెడ్డి వ్యతిరేకం అని ప్రచారం చేయడం చూస్తే నవ్వు రాదా..

సరే ఇదే చర్చలో పాల్గొన్న మహానుభావుడు అంటాడు..అసలు పెన్మత్స సాంబశివరాజు ఎంత పెద్దమనిషి ఆయనకి కూడా వైెస్సార్ మోసం చేశాడంటారు..ఈ బాధ నీదా..లేక పెన్మత్స ఫ్యామిలీదా అనే ప్రశ్నకి అతగాడి దగ్గర జవాబు ఉండదు ఎందుకంటే...పెన్మత్స కి విజయనగరం ఎంపి సీటు ఇస్తామని వైఎస్ హామీ ఇవ్వలేదు..ఆయన కుమారుడికి ఇస్తామని చెప్పారు..నెల్లిమర్ల ఎమ్మెల్యే సీటు కూడా ఇస్తామన్నారు ఇవ్వలేదు..కానీ ఇదేం మోసం కాదు..ఎందుకంటారా..

2009లో రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత పెన్మత్స సాంబశివరాజు గారి కుమారుడు పి.సురేష్( ఏదీ ఈ మహానుభావుడు ఎవరికైతే అన్యాయం జరిగిందని సదరు ఛానల్లో వాపోయాడో..ఆ సురేషే) స్వయంగా జగన్ మోహన్ రెడ్డి వెంట నడిచారు ఓదార్పు యాత్ర అంతా కోఆర్డినేట్ చేశాడు. సాంబశివరాజుగారి పెద్దరికానికి గౌరవం ఇచ్చారు కాబట్టే ఆయన చనిపోయిన తర్వాత సురేష్నే ఎమ్మెల్సీ చేశాడు జగన్..సో ఇక్కడ కసి, తొక్కేసే సిద్ధాంతం వర్కౌట్ అవలేదే..! 

ఇప్పుడు చెప్పండి..కులాల మధ్య చిచ్చులు పెట్టగలమనే నమ్మకంతో రెచ్చిపోయి చర్చలు  పెడుతుందెవరు..? ఇక్కడ మనమేం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫలానా కులానికి భారీ కుర్చీ వేశాడని చెప్పడం లేదు..ఈ అడ్డగోలు చర్చలతో నవ్వులపాలవుతుంది ఎవరో చెప్పడం కోసమే ఈ కలం శోష..రాజకీయ అవసరాల కోసం రకరకాల ఈక్వేషన్లలో భాగంగా కొందరికి సీట్లు దక్కుతాయి కొందరికి ఎక్కువగా దక్కుతాయి అంతే..

Comments