చచ్చేవరకూ జగన్‌తోనే..! ఇది కదా ఎమోషన్ అంటే..! ఇంత పిచ్చి..ఇంత ద్వేషం కొడాలి నానికే సాధ్యం

 



కొడాలి నాని రాత్రి 7 గంటలకు దర్శనమివ్వడంతో పాటే, చాలా ప్రశ్నలకు సూటిగా సుత్తి లేకుండా సమాధానాలు ఇవ్వడంతో చాలామందికి ఓ క్లారిటీ వచ్చేసింది. కొడాలి నాని అనే వ్యక్తి..మంత్రి కాదు ఎమ్మెల్యే కాదు..జస్ట్ జగన్ 

ఫాలోయర్..ఆయనపై ఈగవాలినా సహించడు..అందులో ఘాటుగా విరుచుకుపడటంలో ఎలాంటి భేషజాలు

శషబిషలూ పెట్టుకోడు


అలానే ఇక గుడివాడలోని కొడాలి నాని కన్వెన్షన్ సెంటర్‌లో కేసినో అంటూ ఏబిఎన్ చేసిన హడావుడికి 

బ్రేక్ వేశాడు. ముందు కొడాలి కన్వెన్షన్ సెంటర్ కాదు..ఆ సమీపంలో అంటూ బ్రేకింగులు మార్చేసారంటూ ఎద్దేవా

చేశారు. అంతేకాదు..ఇప్పటికీ పెట్రోల్ ప్రతిజ్ఞకి కట్టుబడి ఉన్నట్లు చెప్తూ..క్లియర్ గా తన కల్యాణ మండపంలో

జరిగినట్లు నిరూపించాలని సవాల్ విసిరాడు


ఇక వైఎస్ఆర్ అంటే ఎందుకు ఇష్టమో..జగన్ అంటే ఎందుకంత పిచ్చ అభిమానమో కూడా క్లియర్ గా చెప్పేశాడు

వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికి ఉన్న రోజుల్లో ఓ ప్రతిపక్ష ఎమ్మెల్యేకి ఎంత గౌరవం, ఆదరణ చూపించి భోజనం పెట్టించి

పంపారో..దాదాపు కన్నీటి పర్యంతమైనంత పని చేస్తూ, చెప్పేశాడు నాని..ఇదే సందర్భంలో జగన్ అంటే కూడా తన 

అభిమానం..కుటుంబసభ్యులకు కూడా వర్తిస్తుందని తేల్చేశాడాయన


ఇక చంద్రబాబుపై ఎంత ద్వేషం ఉందో..లీడర్ల మధ్య ఎలాంటి పుల్లలు పెడతాడో కూడా ఈ గంట ఇంటర్వ్యూలో చెప్పాడు కొడాలి

నాని..ఈ ఇంటర్వ్యూలో యాంకర్ల పాత్ర నామమాత్రమే తప్ప..కొడాలి ధాటికి ఎవరూ ఆగలేరనేది మరోసారి ప్రూవ్ అయింది


ఊరికే బురద జల్లి ఎహ్హేహ్హే అని ఎగతాళి చేస్తూ..కామెంట్లు పెట్టడం డిస్కషన్లు పెట్టడం కాదు ఇవాళ కొడాలి నాని విసిరిన సవాల్కి ఎవడు ముందుకొస్తాడో రండి మరి





Comments