ఆనంద్ రాఠీకి తెగ సంబరం,క్యు4లో భారీలాభం


ఆనంద్ రాఠీ సెక్యూరిటీస్ అండ్ వెల్త్ సర్వీసెస్ కంపెనీ క్యు4లో అదరగొట్టే ఫలితాలను

ప్రకటించింది. జనవరి-మార్చ్ మధ్యలో 57 కోట్ల లాభం  గడించినట్లు చెప్పింది. ఇది 

నిరుడు మార్చ్ క్వార్టర్ లాభంతో పోల్చితే 33శాతం ఎక్కువ


అలానే గత క్యు4తో పోల్చితే 34శాతం ఎక్కువగా రూ.197కోట్ల ఆదాయం గడించింది


ఫుల్ ఫైనాన్షియల్ ఇయర్ చూస్తే..కంపెనీ నికరలాభం రూ.226 కోట్లుగా తేలింది. ఇది 2023 ఆర్థికసంవత్సరంతో పోల్చితే 34శాతం ఎక్కువ. మొత్తం ఆర్థికసంవత్సరాదాయం రూ.752 కోట్లకి చేరింది. దీంతో కంపెనీ బోర్డ్ షేర్ హోల్డర్లకు ఒక్కోషేరుపై

రూ.9 డివిడెండ్ ప్రకటించింది. మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరంలో డివిడెండ్ రూపంలో ఈ కంపెనీ 14 రూపాయలు ఇస్తున్నట్లైంది.


శుక్రవారం నాటి ట్రేడ్‌లో ఆనంద్ రాఠీ వెల్త్ షేర్లు

రూ.4000.05 దగ్గర క్లోజ్ అయ్యాయ్


2021లో ఐపిఓకి వచ్చిన ఆనంద్ రాఠీ వెల్త్ షేర్లు అలాట్‌మెంట్ రేటు రూ.570 కాగా..ఖచ్చితంగా మూడేళ్లలో 400శాతం లాభం పంచింది


Comments