బ్రోకరేజ్ కంపెనీల స్టాక్స్ కొనండి..బండగుర్తు ఇదే


దేశంలో కొత్త డీమ్యాట్ అక్కౌంట్ల ఇబ్బడి ముబ్బడిగా ఓపెన్ అవుతూనే ఉన్నాయ్. కొత్తగా మార్చి నెలలో31లక్షల అక్కౌంట్లు ఓపెన్ కాగా..దాంతోనే

ఓ మైల్ స్టోన్ కూడా బ్రేక్ అయింది. దేశంలో మొత్తం డీమ్యాట్ అక్కౌంట్ల సంఖ్య 15 కోట్ల సంఖ్యని దాటేసింది. 


మార్చి 2023 నాటికి దేశంలోని డీమ్యాట్ అక్కౌంట్ల సంఖ్య 11.4 కోట్లు కాగా

ఇప్పుడు ఏడాదికాలంలో 15కోట్ల పదిలక్షలకు చేరింది. అంటే 3కోట్ల30లక్షల కొత్త అక్కౌంట్లు ఈ సంవత్సరకాలంలో ప్రారంభించారన్నమాట..మరి ఈ అక్కౌంట్లు అన్నీ ఎవరి ద్వారా ఓపెన్ కాబడతాయంటే..సిడిఎస్ఎల్, ఎన్ఎస్‌డిఎల్‌కి అధీకృతంగా వ్యవహరించే ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీల ద్వారానే...!


IIFL,జియోజిత్,ఎడెల్వైజ్,ఏంజెల్‌వన్, మోతీలాల్ఓస్వాల్, ఆనంద్ రాఠీ వెల్త్ సహా అనేక కంపెనీలు ఈ సేవల్లో ఉండగా

బ్యాంకులు కూడా ప్రత్యేకంగా ఈ సదుపాయం అందిస్తున్నాయ్. ఐసిఐసిఐ, ఎస్బీఐ, హెచ్‌డిఎఫ్‌సి,యెస్, బ్యాంక్ ఆఫ్ బరోడా

సహా పేరెన్నికగన్న బ్యాంకులద్వారా కూడా డీమ్యాట్అక్కౌంట్లు ఓపెన్ చేస్తారు. ఈ సర్వీస్ ఛార్జీల రూపంలో ప్రతి మూడునెలలకు ఓ

నిర్దిష్టమైన మొత్తాన్ని వసూలు చేస్తాయి. కాబట్టే..బ్రోకరేజ్ కంపెనీల ట్రేడ్ వాల్యూమ్‌ని బట్టి భారీగా లాభాలు ప్రకటించగలుగుతున్నాయ్

Comments