TCS కంటేఎక్కువ జీతం ఇస్తోన్న మోమో షాప్


ఓ మోమో ఈటరీ షాప్‌లో హెల్పర్లకు పాతికవేలజీతం ఇస్తామంటూ

సైన్ బోర్డ్ పెట్టడం కలకలం రేపుతోంది. ఇదే విషయాన్నిట్విట్టర్లో

పోస్ట్ చేయగా..ఆ పోస్ట్ బాగా వైరల్ అయింది



ఓ నెటిజన్ ఓవర్‌గా రియాక్టవుతూ..

ఇది ప్రెషర్లకి టిసిఎస్ ఇచ్చే ఆఫర్ కంటే ఎక్కువ అంటూ కామెంట్ చేయగా

ఇంకొకరు..సాఫ్ట్‌వేర్‌లో హైకులు ఉంటాయ్ బాసూ..ఇక్కడేం ఉంటాయంటూ ఈసడించాడు

ఇలా ఎవరి ప్రతిభని బట్టి వారు కామెంట్ చేస్తుండగా..మోమో షాప్ కానీ..మరే షాప్ కానీ

ఫుడ్ బిజినెస్ అంటే అంత ఈజీ కాదు..అఁదులో హెల్పర్లంటే అంత తమాషా కాదు..వచ్చి పోయే

కస్టమర్లకి వడ్డించడమే కాదు..వారు వడ్డించే చిరాకు..అసహనాన్నికూడా భరించగలిగి ఉండాలి

ఏ ఉద్యోగానికి ఉండే కష్టం..లాభం దానికి ఉంటాయి..అంతేకానీ..జీతం నంబర్ చూసి భలే ఉందనుకోవడం భ్రమే..!

Comments