ఆగస్ట్ 15..అలస్కా చర్చల్లో జెలెన్‌స్కీ కూడా ఉంటారా
ఆగస్ట్ 15 దగ్గరపడేకొద్దీ రష్యా, అమెరికా చర్చల మధ్యలో యుక్రెయిన్ ప్రాతినిధ్యంపైనా
జోరుగా అంచనాలు వస్తున్నాయ్. తమ ప్రమేయం లేని చర్చలను..దాని పర్యవసానాలను అంగీకరించేదే లేదని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఇప్పటికే తేల్చేసారు. దానికి యూరోపియన్ యూనియన్, నాటో దేశాలు కూడా
మద్దతు పలికాయ్. ఈ క్రమంలోనే యూఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ కూడా కీలకమైన ప్రకటన చేసారు ట్రంప్..పుతిన్‌తో భేటీలో జెలెన్‌స్కీ కూడా పాల్గొనేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు
ఐతే ఇది పూర్తిగా ట్రంప్ చేతిలోని అంశంగానే తెలుస్తోంది..జెలెన్‌స్కీని కూడా చర్చల వేదికకు పిలవాలా వద్దా అనేది ట్రంప్ మాత్రమే డిసైడ్ చేస్తారని నాటోలో అమెరికా రాయబారి మాథ్యూ విటేకర్ చెప్పారు
ఈ పరిణామాలకు ముందు యూకే ప్రధాని కైర్ స్టార్మర్ కూడా యుద్ధవిరమణ చర్చల్లో
యుక్రెయిన్ ఉండాల్సిందేనన్నారు..ఇతర దేశాలు కూడా ఇదే అభిప్రాయంతో ఉండగా..రష్యా..యుక్రెయిన్ మధ్య దాడులు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయ్. తాజాగా ఏడు యుక్రెయిన్ డ్రోన్లను రష్యా డిఫెన్స్ సిస్టమ్
కూల్చేసినట్లు మాస్కో మేయర్ ప్రకటించారు. అంతేకాదు భూతలయుద్ధంలో పాల్గొంటున్న యుక్రెయిన్ సోల్జర్లు కూడా అసలు యుద్ధానికి ముగింపు ఇప్పట్లో ఉఁడదనే నిస్పృహతోనే ఉన్నట్లు చెప్తున్నారు. అసలు చర్చల పేరుతో..రష్యా తమ సైన్యాన్ని
మరింత బలోపేతం చేసుకుంటుందే తప్ప..సీజ్ ఫైర్ జరిగేది కాదంటున్నారు..ఇలాంటి పరిణామాల మధ్య..ఆగస్ట్ 15న జరిగే అలస్కా మీటింగ్ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది
మరి ట్రంప్ పిలుస్తాడా..పుతిన్ ఓకే అంటాడా..ఏమో
Comments
Post a Comment