సేఫ్ డ్రైవింగ్‌కి మంచి కారుండాలి..అందులో పార్ట్స్ బావుండాలి. అలానే బాగా లాభాలు రావాలంటే మంచిస్టాక్స్‌లో పెట్టుబడి పెట్టాలి. ఇదే సూత్రంతో ఓ స్టాక్‌లో పదిహేనేళ్లక్రితం పెట్టుబడి ఓ లక్షరూపాయలు పెడితే, ఇప్పుడది 6కోట్ల రూపాయలకి పెరిగింది. నవంబర్ 17న ఈ స్టాక్ రూ.2083 ఉఁది..మరదే స్టాక్ 15ఏళ్ల క్రితం ఏ రేటులో ఉందా తెలుసా..జస్ట్ రూ.3.47పైసలు..మరి ఇంతకీ ఆ స్టాక్ ఏంటో తెలుసా
బాల్‌కృష్ణ ఇండస్ట్రీస్
30శాతం ఎబిడా మార్జిన్‌తో బాల్‌కృష్ణ ఇండస్ట్రీస్ అత్యంత లాభదాయక కంపెనీల్లో ఒకటిగా ఎదిగింది. రానున్న ఏడాదిలో ఖచ్చితంగా రెండంకెల వృధ్ది సాధిస్తుందని నిర్మల్ బంగ్ సెక్యూరిటీస్ అంచనా వేసింది. ఆపరేటింగ్ సామర్ధ్యం అండతో బీభత్సమైన మార్జిన్లు మిగులుతాయని..స్ట్రాంగ్ రియలైజేషన్స్ తో రానున్న మూడేళ్లూ 17శాతం సిఏజిఆర్ ఎర్నింగ్స్ గ్రోత్ నమోదు చేస్తుందని నిర్మల్ బంగ్ సంస్థ అంచనా వేస్తోంది. అలానే ఇతర కేపిటల్ సంస్థలు కూడా బాల్‌కృష్ణ ఇండస్ట్రీస్‌లో పెట్టుబడులు ఉంచడం కంపెనీపై వాటికున్న నమ్మకాన్ని తెలుపుతుంది. టైర్ల
తయారీరంగంలో తిరుగులేని లీడర్ కావడంతో ఈ సంస్థలో తమ పెట్టుబడులు దీర్ఘకాలంగా కొనసాగిస్తున్నట్లు కేపిటల్ మైండ్ ఫౌండర్ దీపక్ షినోయ్ చెప్తారు. ఆఫ్‌వే టైర్ సెగ్మెంట్‌లో ఆటోమేటివ్ టైర్ల తయారు చేస్తోన్న బాల్‌కృష్ణ ఇండస్ట్రీస్ తన అమ్మకాలను అగ్రికల్చరల్, ఇండస్ట్రియల్, కన్‌స్ట్రక్షన్ , ఆల్ టెరైన్ వెహికల్ సెగ్మెంట్లలో చేస్తోంది. ఫామ్, మైనింగ్, ఎర్త్ మూవింగ్ స్పేస్‌లో ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మేకింగ్ కూడా చేస్తోంది. ఇది తన మొత్తం వ్యాపార పరిమాణంలో 26శాతానికి సమానం. రీప్లేస్‌మెంట్ రంగంలో మిగిలిన 72శాతం అమ్మకాలు చేస్తుంది. సంస్థాగతంగా అమ్మకాలు సాగించే పెద్ద పెద్ద కంపెనీలకు కూడా టైర్లని తయారు చేసి అమ్ముతుంది బాల్‌కృష్ణ ఇండస్ట్రీస్. సంస్థ మొత్తం రెవెన్యూలో 82శాతం ఎగుమతుల ద్వారానే వస్తోంది.
బాల్‌కృష్ణ ఇండస్ట్రీస్‌కి 130దేశాల్లో క్లయింట్స్ ఉండటం విశేషం. సంవత్సరానికి 3లక్షల ఎంటిపిఏ తయారీ సామర్ధ్యం కలిగిన బాల్‌కృష్ణ ఇండస్ట్రీస్‌కి దేశవ్యాప్తంగా 4 ప్లాంట్లు ఉన్నాయ్. యూరోప్, యూఎస్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆఫ్రికా దేశాలకు బాల్‌కృష్ణ ఇండస్ట్రీస్ ఎగుమతి వ్యాపారం జరుగుతుంటుంది,రానున్న రోజుల్లో కూడా ఆఫ్-హైవే టైర్ ఇండస్ట్రీ మరింత వృధ్ది చెందనున్నదని అంచనా. అందుకే ఈ రంగంలో తిరుగులేని లీడర్‌గా ఉన్న బాల్‌కృష్ణ
ఇండస్ట్రీస్ ఈ అవకాశాన్ని బాగా అందిపుచ్చుకుంటుంది. రానున్న మూడేళ్లలో 14శాతం సిఏజిఆర్ గ్రోత్ రిజిస్టర్ చేస్తుందని నిర్మల్ బంగ్ సెక్యూరిటీస్ చెప్తోంది.
ఇక ఇదే రంగంలోని ఎంఆర్ఎఫ్ మాత్రం ఎక్స్‌పెన్సివ్ స్టాక్( షేరు ధర ప్రకారం). ఐతే ఈ స్టాక్ కూడా గత 15ఏళ్లలో తక్కువేం పెరగలేదు. నవంబర్ 15, 2002న రూ.844 ఉన్న ఎంఆర్ఎఫ్ , 2017 నవంబర్ 17కి రూ.69,477కి చేరింది. అంటే 8132శాతం పెరిగినట్లు లెక్క. ఆనంద్ రాఠీ సర్వీసెస్ ఎంఆర్ఎఫ్ స్టాక్ మరో 20శాతం పెరిగే ఛాన్సున్నట్లు చెప్తోంది. రబ్బర్ ధరలు తగ్గడం..రెవెన్యూగ్రోత్ ప్రకారం రానున్న రెండు మూడేళ్లలో ఖచ్చితంగా రూ.85,523కి ఎంఆర్ఎఫ్ స్టాక్ ప్రైస్ పెరుగుతుందని ఆనంద్ రాఠీ తన రీసెర్చ్ రిపోర్ట్‌లో తెలియజేసింది. బిజినెస్ వాల్యూమ్ బలంగా ఉండటంతో రానున్న రెండు ఆర్ధిక సంవత్సరాలూ సిఏజిఆర్‌లో 11శాతం వృధ్ది చోటు చేసుకుంటుందని అది రూ.19వేలకోట్లకి చేరుతుందని ఆనంద్ రాఠీ చెప్తోంది.టైర్ల తయారీ ఇండస్ట్రీ రెండు కేటగరీలుగా విభజించవచ్చు..ఒకటి ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మేన్యుఫేక్చరింగ్, రీప్లేస్‌మెంట్ మార్కెట్. ఇందులో రీప్లేస్‌మెంట్ మార్కెట్ అసలు మార్కెట్‌ని డామినేట్ చేస్తుంది. మొత్తం టైర్ల డిమాండ్‌లో 55శాతం రీప్లేస్‌మెంట్ మార్కెట్‌దే వాటా.మన దేశ మార్కెట్‌లో 2,3వీలర్ టైర్లు 53శాతం, పాసింజర్ కార్ల టైర్లు 28శాతం, కమర్షియల్ వెహికల్స్ సెగ్మెంట్ టైర్లు 16శాతం వాటాతో వ్యాపారం
సాగుతుంటుంది. ట్రాక్టర్ టైర్ల వాటా మాత్రం కేవలం 3శాతం మాత్రమే కావడం విశేషం. పైన చెప్పిన రెండు కంపెనీలు కాకుండా గత 15ఏళ్లుగా టైర్ల తయారీ రంగంలో ఉన్న టివిఎస్ చక్ర(7675శాతం) సియట్(6159శాతం), గుడ్ఇయర్ ఇండియా(2996శాతం) జెకెటైర్స్( 2658శాతం) అపోలోటైర్స్(1701శాతం) ఇన్వెస్టర్లకి సూపర్ ప్రాఫిట్సే తెచ్చిపెట్టాయ్. రీసెంట్‌గా కేంద్రం యాంటీ డంపింగ్ డ్యూటీ విధించడంతో చైనానుంచి దిగుమతయ్యే చైనీస్ ట్రక్, బస్ రేడియల్ టైర్ల రేట్లు పెరిగాయ్. ఈ యాంటీ డంపింగ్ డ్యూటీ 2023వరకూ కొనసాగనుంది. ఈ పరిణామం దేశీయంగా తయారయ్యే టైర్లకు లాభించనుంది.
Comments
Post a Comment