చంద్రబాబుగారూ ఇవి హైదరాబాద్ ఎన్నికలే..మీరున్నది సిటీలోనే..బైటికి రారేం తెలుగువాడిలో వాడీ వేడీ రగిల్చిన పార్టీ..ఆత్మగౌరవాన్ని నిద్రలేపిన పార్టీ..బడుగు బలహీన వర్గాలకు ఊతమిచ్చిన పార్టీ..రాజ్యాధికారం ఇచ్చిన పార్టీ అంటూ..గొప్పగా చెప్పుకునే తెలుగుదేశం పార్టీకి..అది పుట్టిన నేలపైనే..ఇంత ఘోరమైన స్థితి ఉంటుందని ఎవరూ ఊహించి ఉండరు..పుట్టిన నాలుగు దశాబ్దాల్లోనే ఇలా మనుగడే ప్రశ్నార్ధకమవుతుందని కలలో అయినా ఊహించారా..దీనికంతటికీ విజన్ లోపించడమే కారణమా..అంటే అవుననే అనుకోవాలి...

అనువుగాని కాలంలో అధికులం అనుకోకూడదు..ఈ విషయం చంద్రబాబుగారికి తెలీక కాదు..కానీ రవ్వంత రెడ్డిగారికి  సూట్ కేసుల నిండా డబ్బులు ఇచ్చి..పంపి..బ్రీఫ్ చేయడమే తెలంగాణలో పార్టీ బతుకు ఇలా తయారు కావడానికీ నాందీవాక్యం పలికింది..ఇప్పుడు చూస్తే..పార్టీ అధినేత ఉన్నది హైదరాబాద్ లో..పార్టీ పోటీ లో ఉంది..సిటీలో ఎన్నికలంటే అసలు టిడిపి దగ్గర ఎంత హడావుడి ఉండాలి..కానీ ఇప్పుడో శ్మశాన నిశ్సబ్దం..జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర..

ఏపీలో జరిగే విషయాలపై జూమ్ మీటింగ్స్ లో అరుపులు మంటలు పుట్టించే బాబుగారు..మహానాడుని కూడా రికార్డు స్థాయిలో జూమ్ చేసిన బాబుగారు..కనీసం హైదరాబాద్ వాసులకు ఒక్క  పిలుపు ఇవ్వలేరా..పైగా పార్టీ ని స్థాపించిన ఎన్టీార్ ఘాట్ని కూలగొడతాం అంటే..ఒక్క స్పందన లేదు..పైగా సదరు బండి సంజయ్ మాట్లాడినప్పుడు కానీ ఆ స్పృహ రాలేదంటే ఏమనాలి..తెలుగుదేశానికి పట్టిన దుస్థితే అనుకోవాలి..

Comments

  1. Best eCOGRA Sportsbook Review & Welcome Bonus 2021 - CA
    Looking for an eCOGRA Sportsbook หารายได้เสริม Bonus? At this eCOGRA Sportsbook 메리트 카지노 review, we're talking 메리트 카지노 about a variety of ECCOGRA 제왕카지노 환전 sportsbook promotions. 출장마사지

    ReplyDelete

Post a Comment