రామ్ గోపాల్‌వర్మ కేక పుట్టించాడు..లక్ష్మీస్ ఎన్టీఆర్ మరో సాహసమే నా ఊపిరి అవుతుందా.?




ఎన్టీఆర్ పేరు తెలుగు వారున్నంత కాలం కాకపోయినా, మరో 20ఏళ్లపాటు ఖచ్చితంగా మార్మోగుతూనే ఉంటుంది..ఎందుకంటే..ఆ తర్వాత మహానటుడిగా..మాజీ ముఖ్యమంత్రిగానే గుర్తుండిపోతారు..భావోద్వేగాల సాంద్రత ఏళ్లకి ఏళ్లు కొనసాగడం అరుదు..దీనికి నిదర్శనమే తమిళనాడు రాజకీయాలు. పదేళ్ల క్రితం వరకూ కూడా ఎంజీఆర్ పేరు విన్పించేది.జయలలిత ఉన్నా కూడా..ఇప్పుడామె పేరిటే వారసత్వం కోసం తన్నులాట ప్రారంభమైంది..ఎంజిఆర్ పేరుని వాడటం తగ్గించేసారు..ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అధినేతగా చంద్రబాబు పేరే చెప్పుకుంటున్నారు..ఎన్టీఆర్ నామస్మరణ అవకాశం కోసం మాత్రమే వాడుకుంటున్నారు..అప్పటి ఎన్టీఆర్ అభిమానులు..ఇంకో ఇరవైఏళ్లకి ఏ బాలయ్యబాబునో...చంద్రబాబునో తమ నేతగా చెప్పుకోవడానికి కన్వీనెంట్ గా అలవాటు పడిపోతారు..ఇక్కడ ఎన్టీఆర్ గొప్పదనాన్ని తగ్గించడం కాదు..ఆయన పేరిట కార్యక్రమాలు జరగవు అని చెప్పడమే ఉద్దేశం..


ఐతే అసలు భౌతికంగా ఎన్టీఆర్ మాయమవడానికి కారణం మాత్రం..టిడిపినే..అంటే ఇప్పుడున్న టిడిపిలీడర్లే..ఇందులో సందేహం లేదు..దానికి పార్టీని కాపాడుకోవడానికి చంద్రబాబు ప్రయత్నించాడు తప్ప..వెన్నుపోటు కాదు అని ఆ వర్గం.. చెప్పుకుంటే చెప్పుకోవచ్చు..ఎందుకంటే తమ వర్గ ప్రయోజనాలు రక్షించేవాడినే నాయకుడని చెప్పుకోవడానికి అలవాటుపడినవాళ్లకి అంతకంటే ఏమీ తోచదు..కానీ అప్పుడు విషయాలకు సాక్షిగా ఉన్నవాళ్లని అడగాలిగా..అసలు 1994కి ముందే ఎన్టీఆర్ కి ఏ 140 సీట్లో వస్తే..సిఎం సీటు కోసం ప్రత్యర్ధి( మాతృ) పార్టీతో టై అప్ అవడానికి ప్లాన్ వేయడం కూడా పార్టీని రక్షించుకోవడం కోసమేనేమో అనుకోవాలి..ఇప్పుడదే సీన్ మళ్లీ జరుగుతోంది..దేశం కోసం కాంగ్రెస్ తో పొత్తు అంటూ నినాదం ఇవ్వడం అందులో భాగమే..ఇలాంటి సమయంలో రామ్ గోపాల్ వర్మ తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సూపర్ హిట్టవుతుందని సంకేతాలు వస్తున్నాయ్.

అసలు ఈ సినిమా హిట్ అవ్వాల్సిన అవసరం ఆర్జీవికి ఎంత మాత్రం లేదు..ఎందుకంటే అదో ప్యాక్టరీ ..కానీ ట్రైలర్ చూస్తే..మన మహానటుడి కుటుంబసభ్యులు..పార్టీ నేతలు..ఎలా బిహేవ్ చేసేవారో..ఇంకా చేస్తుంటారో తేటతెల్లమైపోతుంది. ఈ  సినిమా చూస్తుంటే ఒకప్పుడు సూపర్ స్టార్ కృష్ణ తీసిన నా పిలుపే ప్రభంజనం, సాహసమే నా ఊపిరి సిినిమాలు గుర్తొస్తున్నాయ్. అవి కూడా అప్పటి ప్రేక్షకులను బాగా అలరించాయ్. అలాంటి సినిమాలకు ఇది ఓ రకంగా సీక్వెల్ అనుకోవచ్చేమో..అది ఎన్టీఆర్ రాజకీయజీవితంపై సినిమాలు అయితే..ఇది ఆయన పర్సనల్ లైఫ్  సినిమా..అని..ఓ రకంగా ఇవన్నీ కలిపి చూస్తే..ఎన్టీఆర్  అంటే ..తెలియని మరో కోణం తెలిసిపోతుంది..

పచ్చిగా చెప్తే..సదరు హీరో కులస్థులకు ఇది నచ్చదు. ఎందుకంటే వాస్తవాలు చేదుగా ఉంటాయి..పైగా ప్రపంచమంతా తాము ఏమని చెప్పి నమ్మించాలనుకున్నారో..ఏది నిజమని చెప్పుకుంటూ ఉన్నారో...అది నిజం కాదని వారికి తెలుసు..ఇప్పుడా నిజాలే పాత్రల రూపంలో కన్పిస్తుంటే చూసి ఎలా తట్టుకుంటారు..సినిమాని బ్యాన్ చేస్తారు..కానీ తెలంగాణలో చేయలేరు..మిగిలిన చోట్ల చేయలేరు..ఓ వేళ బ్యాన్ చేసినా వర్మ తక్కువ వాడు కాదు..ఏకంగా నెట్‌లో పెట్టి రిలీజ్ చేస్తాడు..ఏదైనా రానున్న రోజుల్లో పాపం చంద్రబాబు అనకతప్పదు..ఎందుకంటే నిజాలను భూమిలో పాతి పెట్టారు..ఇప్పుడవి నేల చీల్చుకుని బైటికి రాబోతున్నాయ్





Comments

  1. ఈ రెండు డైలాగులు అప్పట్లో (1994) లేవు, ఉండుంటే ఏ సమస్య వచ్చేది కాదు.

    ఎంప్టీ డ్రామారావు: మన ఇంటికి వచ్చిన ఆడపిల్లతో రాజకీయాలు ఏందిరా?
    నిప్పు బాబు: నీకూ నాకూ రెండు ఇష్టాలు ఉంటాయా మామా?

    Just for fun please!

    ReplyDelete
  2. ఆ సినిమా రిలీజైతే భూమి బద్దలయిపోతుందా ? ఎవరికి తెలియని విషయాలవి ? ఆంధ్రాలో ఆ సినిమా ప్రభావం ఎన్నికల్లో ఉండదు. తెలంగాణాలో రెండవ భార్యకు గౌరవ మర్యాదలు దక్కుతాయేమో గానీ ఆంధ్రాలో రెండవ భార్య ఉంపుడుగత్తెతో సమానం. స్త్రీ పురుష సంబంధం అంటూ వర్మ చెప్పినా అక్కడ ఆస్థుల గొడవలు, పార్టీ గొడవలు ఉన్నాయి. ఆస్థి,పార్టీ విషయానికి
    వస్తే ఎవరైనా చంద్రబాబుగారిలానే ప్రవర్తిస్తారు. రెండవ వివాహం చేసుకునేటపుడే ఇవన్నీ ఆలోచించుకోవాలి. నా పార్టీ, నా ప్రియురాలు అంటే కుదరదు. ఎదో ఒకటే కోరుకోవాలి. చేసుకున్నోళ్ళకు చేసుకున్నంత !

    ReplyDelete
  3. నీహారిక..ఆ సినిమా హిట్టవుద్దన్నాం కానీ..రాజకీయాలపై ప్రభావం ఉంటుందని చెప్పలేదు..ఎవరికి తెలియని విషయాలు అని అనకనండి..ఓ వేళ మీకేదైనా తెలిస్తే..ఇక్కడే పంచుకోండి..ఇంకొక జనాంతికమైన పదం అలవోకగా అనేశారు..ఆంధ్రాలో రెండవభార్య ఉంపుడుగత్తె అని..చాలా డ్యామేజింగ్ వర్డ్..అది భార్య చనిపోయిన తర్వాత రెండో పెళ్లి చేసుకున్నవాళ్లలో అందరూ అలానే భావించబడుతున్నారా..మీ మాటని జస్టిఫై చేసుకోవడానికి ప్రయత్నించవద్దు..ఓ రాష్ట్రం మొత్తానికి అన్వయించారు ఆ పదాన్ని..మీకెవరు చెప్పారు అలాగ చూస్తారని..పైగా ఎవరైనా చంద్రబాబులానే అనకండి.. అంటే ఎన్టీఆర్ తర్వాత ఆయనే లీడర్ అని ముందే ఎవరైనా రాసిచ్చేశారా..నా పార్టీ నా ప్రియురాలు అనుకోవడం తప్పైతే..నా పార్టీ నా కొడుకు అని ఎందుకు అనుకుంటున్నాడో కూడా జస్టిఫై చేయండి..దయచేసి ఎన్టీఆర్ లక్ష్మీపార్వతి స్టోరీలో ఇంకా ఏమేం జరిగాయో..మీకు తెలిసినవి ఇక్కడే పంచుకోండి..ఎందుకంటే మాకు చాలా తక్కువ తెలుసు కాబట్టి.

    ReplyDelete
  4. @నీహారిక:

    మీరు చెప్పిందే నిజమయితే షాలిని గారి కొడుకును నందమూరి నటవారసుడిగా ఎవరూ అంగీకరించేవారు కాదు.

    చంద్రబాబు రామారావును దింపేయడం ఆయన ఇష్టం. అది తిరుగుబాటు అని ఆయన వర్గం చెప్తుంది, కాదు వెన్నుపోటు అనే కోణంలో ఎన్టీఆర్ వర్గీయులు వాదించారు. ఇరు పక్షాలు తమ వాదనను సినిమా రూపంలో తీసుకువస్తున్నారు. జనం ఎటువైపు "మొగ్గు చూపుతారో" వేచి చూద్దాం.

    లక్ష్మీ పార్వతి మీద ఇంకో సినిమా కూడా వస్తోందట. అందులో ఆవిడ మొదటి భర్త దృక్పధం ఉంటుందని అంటున్నారు. ఆ ట్రైలర్ ఇంకెంత కామెడీయో ఏమో?

    ReplyDelete
  5. "ఈ సినిమా చూస్తుంటే ఒకప్పుడు సూపర్ స్టార్ కృష్ణ తీసిన నా పిలుపే ప్రభంజనం, సాహసమే నా ఊపిరి సిినిమాలు గుర్తొస్తున్నాయ్. అవి కూడా అప్పటి ప్రేక్షకులను బాగా అలరించాయ్."

    మండలాధీశుడు అని ఇంకో సినిమా కూడా వచ్చింది. అందులో తన నటనను ఎన్టీఆర్ కూడా మెచ్చుకున్నారని కోట శ్రీనివాసరావు ఎదో ఇంటర్వ్యూలో చెప్పారు.

    ReplyDelete
  6. మీరు చెప్పిందే నిజమయితే షాలిని గారి కొడుకును నందమూరి నటవారసుడిగా ఎవరూ అంగీకరించేవారు కాదు.

    మీరు చెప్పినట్లు షాలిని గారి కొడుకుని ఆంధ్ర ప్రదేశ్ కి ముఖ్యమంత్రిని చేసిన రోజు నా అభిప్రాయాన్ని మార్చుకుంటాను.

    ReplyDelete
  7. Replies
    1. నీహారిక గారూ మీ కామెంట్ లో ఇటీవల రెండు మూడు అరెస్టులకు సంబంధించిన వ్యక్తుల పేర్లు ఉదహరించారు. అందుకే పబ్లిష్ చేయలేదు..మీ భావం మాకు అర్ధమైంది..అనవసరంగా కేసుల బెడద ఎందుకు మనకి

      Delete
  8. >>>భార్య చనిపోయిన తర్వాత రెండో పెళ్లి చేసుకున్నవాళ్లలో అందరూ అలానే భావించబడుతున్నారా..మీ మాటని జస్టిఫై చేసుకోవడానికి ప్రయత్నించవద్దు>>>>

    దేవుళ్ళందరికీ ఇద్దరు భార్యలున్నారు కదా అని మీరో గొప్ప లాజిక్ చెప్పినా నా అభిప్రాయం మారదు.

    >>ఓ రాష్ట్రం మొత్తానికి అన్వయించారు ఆ పదాన్ని..మీకెవరు చెప్పారు అలాగ చూస్తారని>>>>

    అంతకంటే గొప్ప గౌరవం ఇచ్చినవారిని నేను చూడలేదు.అందుకే ఆంధ్రాకి మాత్రమే పరిమితం చేసాను.


    >>ఎవరైనా చంద్రబాబులానే అనకండి.. అంటే ఎన్టీఆర్ తర్వాత ఆయనే లీడర్ అని ముందే ఎవరైనా రాసిచ్చేశారా >>>

    అవును ఆంధ్రా ప్రజలు ఒకసారి కాదు మూడుసార్లు ముఖ్యమంత్రిని చేసారు.

    >>>నా పార్టీ నా కొడుకు అని ఎందుకు అనుకుంటున్నాడో కూడా జస్టిఫై చేయండి.>>>>

    రాజశేఖర్ రెడ్డిగారి దగ్గరనుండి కేసీఆర్ గారి వరకూ ఎవరి కొడుకులను ఎవరు వదిలిపెట్టారు. తెలుగుదేశంలోనే అల్లుడికి పగ్గాలు ఇచ్చారు. ఒక స్త్రీగా ఇది నాకు సమ్మతమే !కాస్త కుదురుగా ఉండి ఉంటే చిన్నమ్మకీ అందలం దక్కేది.

    >>>లక్ష్మీపార్వతి స్టోరీలో ఇంకా ఏమేం జరిగాయో..మీకు తెలిసినవి ఇక్కడే పంచుకోండి..ఎందుకంటే మాకు చాలా తక్కువ తెలుసు కాబట్టి.>>>

    షర్మిలకీ ప్రభాస్ కీ సంబంధం ఉంది అని వ్రాస్తే చూసి నమ్మేయడానికి నేను సిద్ధంగా లేను. నేనే గనుక ఆవిడ ప్లేస్ లో ఉంటే నా భర్తకంటే వాడిలో గొప్పేముంది అని అడిగేదాన్ని. ఎవరినీ ఊరికే బ్లేం చేయను.

    లక్ష్మీ పార్వతి అని టైప్ చేసి యూట్యూబ్ లో వెతుక్కోండి. బోలెడు ఇన్‌ఫర్మేషన్ దొరుకుతుంది.అవి చూసే వర్మ ఆ సినిమా తీసారు.

    ReplyDelete

  9. >>>లక్ష్మీపార్వతి స్టోరీలో ఇంకా ఏమేం జరిగాయో..మీకు తెలిసినవి ఇక్కడే పంచుకోండి..ఎందుకంటే మాకు చాలా తక్కువ తెలుసు కాబట్టి.>>>

    లక్ష్మీ పార్వతి అని టైప్ చేస్తే యూట్యూబ్ లో బోలెడు ఇన్‌ఫర్మేషన్ దొరుకుతుంది.అవి చూసే వర్మ ఆ సినిమా తీసారు.

    ReplyDelete

  10. >>>నా పార్టీ నా కొడుకు అని ఎందుకు అనుకుంటున్నాడో కూడా జస్టిఫై చేయండి.>>>>

    రాజశేఖర్ రెడ్డిగారి దగ్గరనుండి కేసీఆర్ గారి వరకూ ఎవరి కొడుకులను ఎవరు వదిలిపెట్టారు. తెలుగుదేశంలోనే అల్లుడికి పగ్గాలు ఇచ్చారు. ఒక స్త్రీగా ఇది నాకు సమ్మతమే !కాస్త కుదురుగా ఉండి ఉంటే చిన్నమ్మకీ అందలం దక్కేది.

    ReplyDelete

  11. >>ఎవరైనా చంద్రబాబులానే అనకండి.. అంటే ఎన్టీఆర్ తర్వాత ఆయనే లీడర్ అని ముందే ఎవరైనా రాసిచ్చేశారా >>>

    అవును ఆంధ్రా ప్రజలు ఒకసారి కాదు మూడుసార్లు ముఖ్యమంత్రిని చేసారు.

    ReplyDelete

  12. >>ఓ రాష్ట్రం మొత్తానికి అన్వయించారు ఆ పదాన్ని..మీకెవరు చెప్పారు అలాగ చూస్తారని>>>>

    అంతకంటే గొప్ప గౌరవం ఇచ్చినవారిని నేను చూడలేదు.అందుకే ఆంధ్రాకి మాత్రమే పరిమితం చేసాను.

    ReplyDelete
  13. >>భార్య చనిపోయిన తర్వాత రెండో పెళ్లి చేసుకున్నవాళ్లలో అందరూ అలానే భావించబడుతున్నారా..మీ మాటని జస్టిఫై చేసుకోవడానికి ప్రయత్నించవద్దు>>>>

    దేవుళ్ళందరికీ ఇద్దరు భార్యలున్నారు కదా అని మీరో గొప్ప లాజిక్ చెప్పినా నా అభిప్రాయం మారదు.

    ReplyDelete
  14. సానుభూతి ఎప్పుడూ ఆడవాళ్ళ మీదనే ఎందుకు కురిపిస్తారో కొందరు మగవారు!బహుశా నైతిక సాపేక్షతా సిద్ధాంతంతో కూడిన లైంగిక ప్రచోదనల వల్లనా?

    తన పాటికి అత్ను బతికేస్తున్న వీరగంధం సుబ్బారావుని తనని పెళ్ళి చేసుకోకపోతే చచ్చిపోతాననే రకం చీప్ లెవెల్ బిహేవియర్ ఉన్న నెరజాణకి ఇంత గౌరవం ఇవ్వడం అవసరమా?అంత దేబిరించి పెళ్ళి చేసుకుని అన్నేళ్ళు సంసారం చేసి శృంగారం వెలగబెట్టి ముది వయసులో మరొకణ్ణి తగులుకున్న వృద్ధవేశ్యని సమర్ధించడం సంస్కారవంతులకి తగునా?

    వ్యాసం రాసిన పద్ధతిలో రాజకీయపరమైన inclination కనపడుతూనే ఉంది.అయినా ఈ సినిమా లోని పాత్రలూ ఆ సినిమా వల్ల ప్రభావితం అయ్యే వ్యక్తులూ అందరూ రాజకీయ నాయకులే కదా!వర్మ కాపు కుల గజ్జి కొద్దీ చంద్రబాబుని ఇరుకున పెట్టడానికి తీసిన సినిమా అని నేను అనుకుంటున్నాను.

    ఇప్పుడు నేను వీరగంధం చెప్తున్న సంగతుల్ని స్వయంగా వినేవరకు తనే చొరవ చూపించి లక్ష్మీ పార్వతిని పెళ్ళి చేసుకుని తర్వాత తనకన్న గొప్ప స్థాయిలో ఉన్న వాణ్ణి చేసుకుంటే అసంతృప్తి పడిన మామూలు మనిషి అనుకున్నాను.కానీ వీడియో చూశాక ఆయన సంస్కారం నన్ను ముగ్ధుణ్ణి చేసింది - మిగిలిన ఇద్దరూ ఆయన కాలిగోటికి కూడా సరిపోరు!

    N.T.R కూడా అవసరం కొద్దీ చేసుకోవటం తప్ప ఆ పెళ్ళిలో విధవా పునర్వివాహ సంస్కరణ లాంటి గొప్ప ఆదర్శం గానీ జన్మాంతర సౌహృదాలు పలకరించిన అద్భుతం గానీ ఏముంది?

    తనకి రాజకీయ లక్ష్యాలు లేని వినయమే ఉంటే ఆడపెత్తనం లాంటి వార్తలు వస్తున్నప్పుడు పాదపూజలకే పరిమితమై ఒదిగి పోయి ఉండేది.29 మంది ఎమ్మెల్యేల్ని తనూ కూడగట్టి ఎత్తులు వెయ్యడానికి తగులుకుని చంద్రబాబు ముందు నిలబడలేక వెనక్కి తగ్గడం కూడా అమాయకత్వమేనా?

    పాతికేళ్ళ నాడు జరిగిన కధలు ఇవ్వాళ చూట్టానికి బాగుంటాయి గానీ తలకి ఎక్కించుకుంటే కష్టం!ముందుకి చూడాల్సిన కాలంలో వెనక్కి చూడటం దేనికి?

    ReplyDelete

Post a Comment