టిడిపి టోటల్లీ ఔటాఫ్ కంట్రోల్..జగన్ అంటే ఎందుకంత ఇది


తెలుగుదేశం నేతలకు జగన్ ఫీవర్ పట్టుకున్నట్లైంది..ఇదేదో జగన్‌పై అభిమానంతోనో..టిడిపిపై వ్యతిరేకతతోనో చెప్తోంది కాదు.  నవంబర్ నుంచి అసెంబ్లీ సెషన్స్ ఉన్నాయంటూ టిడిపి నేతలు వైఎస్ జగన్‌పై ఎవరికి తోచిన రీతిలో వారు కామెంట్లు చేస్తూ ఉన్నారు. నిజానికి జగన్ పాదయాత్ర చేస్తాడనే అంశం ఇప్పటిది కాదు..గత నెల రోజులకి ముందే ప్రారంభం కావాల్సి ఉండగా..నవంబర్‌కి వాయిదా వేసుకున్నాడు..అలాంటిది అసెంబ్లీనుంచి పారిపోవడానికి జగన్ ఇలా చేస్తున్నాడని ఒకరు..ఇలాంటి ప్రతిపక్షనేత లేడని చంద్రబాబు ఎద్దేవా చేయడం తగదు..ఎందుకంటే..గతంలోనూ అసెంబ్లీ మొహమే చూడని నేతలున్నారు..అంత మాత్రం చేత వాళ్లు పనికిరాని లీడర్లు కాలేదు కదా..ఇంకా ఎన్టీఆర్ ఆయితే తానొక్కడే అసెంబ్లీలో ఉంటే కాంగ్రెస్ నేతలు ఆగం చేస్తారని..ఎగతాళి మాటలు అంటారనే దూరంగా ఉన్నారని చెప్పేవాళ్లున్నారు పోయినోళ్లందరూ మహానుభావులని అనడంలో చనిపోయిన మనుషులు సమాధానం చెప్పుకోలేరనే కానీ..ఏ తప్పూ చేయనివాళ్లని కాదు అర్ధం..

సరే ఆ టాపిక్ వదిలేస్తే, ప్రస్తుతం టాపిక్ కి వస్తే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ఏపీ మంత్రి ఆదినారాయణ రెడ్డి " అప్పట్లో జగన్ వెంట నడిచిన 31మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయలేదు" అని బాహాటంగా  విరుచుకుపడటం జనం జ్ఞాపకశక్తిని తక్కువ చేయడమే..ఎఁదుకంటే..వారంత రాజీనామాలు స్పీకర్ ఫార్మాట్‌లోనే చేశారు..ఊరూరా తిరిగారు..వాటిపై టిఆర్ఎస్, టిడిపి, కాంగ్రెస్ యాక్షన్ తీసుకోమని స్పీకర్‌కి కంప్లైంట్లు కూడా పెట్టారు..ఐనా అదేదో అధికారాన్ని ఉపయోగించి శాసనసభ రద్దయ్యేవరకూ వాటి జోలికే పోలేదు. అంతెందుకు అప్పట్లోనే 18 ఎమ్మెల్యే స్థానాలకి పోటీ జరిగితే 16మంది వైఎస్సార్సీపీ తరపున గెలిచారు. ఎమ్మెల్సీ పదవికి కూడా శిల్పాబ్రదర్ ఇప్పుడు రాజీనామా చేశాకనే పార్టీ మారాడు కదా..ఇన్నిగమనించిన తర్వాత కూడా ఆదినారాయణరెడ్డి సోది చెప్పడం ఏంటో ఆయనకే తెలియాలి ఈ పరిణామాలని గమనించిన తర్వాత...జనం ఎవరి వెనక ఉన్నారనే మాట వదిలేయండి..పొలిటికల్ పార్టీల్లో లీడర్లు..సిగ్గుని విచక్షణని ఎలా వదిలేశారో స్పష్టంగా అర్ధమవుతోంది.
జగన్ పాదయాత్ర చేయడం తప్పైతే, అది  జనమే ఓట్లరూపంలో చెప్తారు..మధ్యలో టిడిపికి ఎందుకు అంత దుగ్ధ..సదావర్తి భూముల విషయంలో ప్రభుత్వం చేతకానితనం ఫుల్ క్లారిటీతో కన్పిస్తుండగా..వైఎస్సార్సీపీ పై ఏడవడం ఎందుకు..తప్పు వైఎస్సార్సీపీ చేస్తే శిక్ష తప్పదు..టిడిపి చేసినా జనం చూస్తూ ఊరుకోరు

Comments