సినిమా ఎప్పుడు వస్తుందో తెలీదు కానీ...ఎన్టీఆర్ జీవితచరిత్రలో బాలకృష్ణ ఎన్టీఆర్‌గా, కల్యాణ్ రామ్ హరికృష్ణగా నటిస్తారని అంటున్నారు. ఓ వేళ ఇదే నిజమైతే..మరి బాలకృష్ణగా ఎవరు నటించాలి..కన్ఫ్యూజన్ గా ఉంది కదా..ఎందుకంటే ఎంత మేకప్ వేసినా..బాలకృష్ణ వయసుని కప్పిపుచ్చలేకపోతున్నాడు..మరి కల్యాణ్ రామ్ బాబాయ్ కి కొడుకుగా ఎలా మెప్పిస్తాడో చూడాల్సిందే..
ఏదేమైనా ఓ బయోపిక్ తీసేంత స్పాన్ ఎన్టీఆర్ జీవితంలో ఉన్నా పాత్రలన్నీ నందమూరి వారి కుటుంబంలోని వాళ్లు చేయాలని అనుకోవడమే రాంగ్ స్టెప్‌గా( ప్రస్తుతానికి) అన్పిస్తుంది. అలా డిసైడైనప్పుడు నందమూరి తారకరత్న, చైతన్యకృష్ణ, మరో జూ.ఎన్టీఆర్( జానకీరామ్ కొడుకు) ఇలా అంతా కూడా తలా ఓ చేయి వేస్తే నందమూరి వారి మనం సినిమా అవుతుందేమో.
అన్నగారి సినిమా అంటే తెలుగువారిలో మూడు తరాల వారికీ అభిమానమే..ఎటొచ్చీ 1995 తర్వాత పుట్టినవారికే ఆయన పుట్టుపూర్వోత్తరాలు పెద్దగా తెలియవు..సినిమాల ద్వారా ఎన్టీఆర్ రూపం తెలుస్తుంది కానీ...చరిత్ర తెలియాలంటే పాత వీడియోలే దిక్కు..ఇప్పుడు బాలకృష్ణ తీసే సినిమాతో ఈ కొత్త తరానికి తెలిసే ఛాన్స్ ఉంది. అందుకే అటు లక్ష్మీస్ ఎన్టీఆర్ కానీ..తేజ ఎన్టీఆర్ కానీ కాక పుట్టిస్తోంది.
Comments
Post a Comment