ప్రభాస్ ఫ్యాన్స్‌ని గెలికేసిన పవన్ కల్యాణ్..ఎందుకిలా?


పవన్ కల్యాణ్ ఏదీ పట్టించుకోనంటూనే...ప్రతీదీ బాగా పట్టించుకున్నట్లే కన్పిస్తోంది..ఎందుకంటే అటు కొట్టించని గుండు నుంచి అఖిలప్రియకి సలహా, జగన్‌పై విమర్శలు..ఆంధజ్యోతి రాధాకృష్ణకి వార్నింగ్..ఇలా చెప్పుకుంటూ పోయి..ప్రభాస్ ఫ్యాన్స్ చేసిన రగడపై అలవోకగా తన వైఖరి చెప్పేశాడు.

గతంలో పవన్ కల్యాణ్,  ప్రభాస్ ఫ్లెక్సీల ఏర్పాటుపై ఫ్యాన్స్ మధ్యలో గోదావరిజిల్లాల్లో బాగానే రగడ అయింది. అది పెద్దగా టీవీ ఛానళ్లలో పేపర్లో రాలేదు కానీ..ఆక్కడిక్కడ బాగానే చిచ్చు రగిల్చింది. అది కాస్తా కులాలకుంపటిగా మారింది కూడా..ఎవడు ఔనన్నా ఎవడు కాదన్నా ఇఁజనీరింగ్ కాలేజీల్లో కాపు, కమ్మ, రెడ్డి, రాజు....ఇంకా...రకరకాల కులాల పేర్లతో యూత్ బ్యానర్లు...ప్రెషర్ పార్టీలు జరుగుతూనే ఉన్నాయ్..ఇప్పుడు కొత్తగా కులాలు వద్దు అనగానే మారిపోయేంత సామరస్యపూరిత వాతావరణమైతే లేదు.

ఐతే ఆ సందర్భంలో గోకరాజు గంగరాజుకి ఫోన్ చేసిన సంగతి ఇప్పుడు పవన్ చెప్పడం ద్వారా..ఓ విషయాన్ని చెప్పినట్లైంది తాను బాగానే లాబీయింగ్ చేయగలనని..అలానే తన ఫ్యాన్స్ జోలికి వస్తే చూస్తూ ఊరుకోనని..ఐతే ఇక్కడా ఆయన ద్వంద్వ వైఖరే బైటపడింది..ఓవైపు విద్యార్ధుల జోలికి ఎవరొచ్చినా తాట తీస్తానంటాడు..మరోవైపు అవసరమైతే పోరాటానికి సిధ్దపడేవాళ్లు తన వైపు రావాలంటాడు..అసలు పోరాటం అంటే ఏంటి..దొమ్మీలుకు సిధ్దం కావాలా...నిజంగా చిత్తశుధ్ది ఉంటే...మీరు మీ చదువులపై ఫోకస్ పెట్టండి..ఇక్కడ చేయాల్సింది మేం చేస్తాం అని క్లారిటీ ఇస్తే అభినందనీయంగా ఉండేది

Comments