అటు తిరిగి ఇటు తిరిగీ మళ్లీ అఖిలప్రియకా..! పవన్ పాత కసి తీర్చుకుంటున్నాడా


ఫెర్రీఘాట్ దగ్గర ప్రమాదంలో 20మందికిపైగా చనిపోయిన సంగతి గుర్తుండే ఉఁటుంది..అది  ఇప్పుడు అటు తిరిగి ఇటు తిరిగీ మంత్రి,  వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే , టిడిపి నేత భూమా అఖిలప్రియకే చుట్టుకుంటోన్నట్లు కన్పిస్తుంది..ఇన్సిెడెంట్ జరిగిన రెండు మూడు రోజులకే ఛీఫ్ మినిస్టర్ చంద్రబాబు గారు ఆమెకి క్లాస్ పీకారని టాక్..ఆ తర్వాత కూడా ఇదే ఇన్సిడెంట్ ‌పై కొన్ని రోజులు వాదోపవాదాలు నడిచాయ్..తర్వాతెటూ ప్రభుత్వం స్టైల్లో ఓ విచారణ కమిటీతో ఆ సంగతికి ఇక అక్కడితో ఫుల్ స్టాప్ పడినట్లు కన్పించింది

ఐతే ఇవాళ మిస్టర్ క్వశ్చెన్ మాస్టర్ పవన్ కల్యాణ్ ఒంగోలు వెళ్లిమరీ ఈ విషయాన్ని గెలికారు.అసలు బేషజాలకు పోకుండా అఖిలప్రియ ఒంగోలు రావాలని వాళ్ల గోడు వినాలని వ్యాఖ్యానించడం కలకలమే రేపుతోంది..ఎందుకంటే కనీసం ప్రభుత్వంలోని పెద్దల జోలికి పోకుండా ఒకేసారి మినిస్టర్ బాధ్యత వహించాలని అడగడం అఖిలప్రియవర్గానికి షాక్ కలిగించేదే..ఇలాంటి ఘటనలు..అంతకంటే పెద్ద ఇన్సిడెంట్లే జరిగినప్పుడు లేని బాధ్యత ఈ ఒక్క లేడీమినిస్టర్‌కే ఎందుకుండాలనేది ప్రశ్న..ఐతే ఇలా అడగడానికి పవన్ మనసులో ఇంకేదైనా ఉందా

ఎందుకంటే..కాస్త వెనక్కిఅంటే..ఓ పదేళ్లు వెళ్లండి..అప్పుడు చిరంజీవి పిఆర్పీ పెట్టి తెగజోరుగా తిరిగేస్తోన్న సమయం..అప్పుడు చిరంజీవిీ పార్టీలో కాస్త తెలిసిన నేత ఎవరయ్యా అంటే భూమానాగిరెడ్డే..పార్టీ ఓడిపోగానే...వీళ్లు అందరికంటే ముందే వైఎస్సార్ గూటికి చేరారు.

పైగా వైఎస్ చనిపోయిన తర్వాత విజయమ్మ వెంట ఉండి ప్రత్యేక పార్టీ కార్యాలయం కావాలని స్పీకర్ కి వినతిపత్రాలుకూడా భూమాశోభ అప్పట్లో హడావుడి చేశారు..ఈ తీరుపై నిరసనలు వచ్చినా...తిరిగి రాజీనామాలు చేసి గెలిచారనుకోండి.. ఆ తర్వాత తిరిగి 2014లోనూ వైఎస్సార్సీపీ తరపునే గెలిచి..అనూహ్యంగా ప్రమాదంలో చనిపోయారు..ఆ తర్వాత భూమానాగిరెడ్డీ చనిపోయారు. కానీ ఏ పార్టీలో ఉన్నా జగన్ ఫ్యామిలీతో వాళ్లకున్న  అనుబంధం వేరు


ఐతే అప్పుడు చిరంజీవికి హ్యాండిచ్చారనే కసితోనే ఇప్పుడు పవన్ ఇలా టార్గెట్ చేశారనే వాదన ఉంది..ఐతే ఇందులో పసలేదు..ఎందుకంటే జరిగిన ఘటన తీవ్రత కూడా చూడాలిగా..ఐతే ఎఁదుకూ పనికిరాని పరకాలనే ఇన్నాళ్లు గుర్తుపెట్టుకున్న పవన్ భూమా ఫ్యామిలీని ఎందుకు వదులుతాడని మరో టాక్..చూద్దాం పవన్ నోటి వెంట ఇంకా ఇలాంటి ముత్యాలు ఎన్ని రాలతాయో

Comments