నిజం చెప్పులు తొడుక్కునేలొపే అబద్దం ప్రపంచం మొత్తం చుట్టేస్తుందంటారు. ఇప్పుడు ఆ సామెతని మరింత నిజం చేస్తొంది ఫేస్‌బుక్ మేనియా..మనొడికి కాస్త ఇమేజ్ రావాలన్న తపన..మద్దతు కూడగట్టాలన్న ఆరాటం. క్రేజ్ చూపించుకొవాలన్న యావ..వెరసి భారీగా షేరింగులొ..లైకులొ తెచ్చుకొవాలన్న అసలు లక్ష్యం..ఇవే సొషల్ మీడియాని..యూట్యూబ్‌ని నడిపించేస్తున్నాయ్. బడ్జెట్ రెండొ దశ సెషన్స్‌లొపు కేంద్రప్రభుత్వంలొని ఎన్డీఏపై అవిశ్వాసం పెడితే తమ రాష్ట్రసమస్యలు చర్చకు వస్తాయనే వింత వాదనతొ ఒకరు ముందుకు వస్తే..దానిని తమకి ఎలా వాడుకొవాలాని ఆలొచిస్తూ పావులు కదిపాయి మిగిలిన పార్టీలు..వాటిలొ టార్గెట్ అయింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ..ఐతే అనూహ్యంగా వైఎస్ జగన్ తాను అందుకు సిధ్దమే అంటూ చెప్తూనే..మరి దీనికి తగిన బలం నాకు లేదు..మీ మిత్రుడు చంద్రబాబుని వప్పించు నేను అవిశ్వాసం పెడతాను అన్నాడు..దాంతొ పాటే ఒక వేళ జగన్ పెడితే నేనెందుకు సపొర్ట్ చేయాలని అనుకుంటాడేమొ చంద్రబాబే స్వయంగా నొ కాన్ఫిడెన్స్ మొషన్ పెట్టినా మద్దతిస్తాను అన్నాడు..నేను మాత్రం తగ్గేది లేదు మరి నాకు మద్దతుగా నీ పార్ట్‌నర్‌ని ఒప్పించు అని కూడా సవాల్ విసిరాడు. దానికి పవన్ కల్యాణ్‌కి రొషం పొడుచుకువచ్చి..టిడిపి కథ కూడా తెలుస్తుంది మీరు మార్చి 4లొపే పెట్టండంటూ తన అజ్ఞానాన్ని మరొసారి బైటపెట్టాడు..అసలు సెషన్స్ తిరిగి ప్రారంభమయ్యేదే మార్చి 5న..(ఇలానే పిభ్రవరి 30లొపు తేల్చాలి అంటూ కూడా గత వారంలొనే తన సెన్స్ ఆఫ్ ప్రెజన్స్ ప్రదర్శించాడు గుర్తుండే ఉంటుంది)
ఇక ఇక్కడ్నుంచి అటు టిడిపి ఇటు వైఎస్సార్సీపీ నుంచి ఎవరి పార్టీకి అనుగుణంగా వారు రకరకాల ఫీలర్లు వదులుకుంటూ ఫేస్ బుక్ వేదికపై చర్చలు సాగించుకుంటున్నారు..ఇవి హుందాగా ఉన్నంత వరకూ ఫర్లేదు..అదేదొ ఇంట్లొని సమస్యలాగా..బండబూతులు తిట్టుకొవడం మాత్రం సమర్దనీియంకాదు.. ఈ దశలొనే వైఎస్సాప్సీపీ తలపెట్టిన అవిశ్వాసానికి తన పూర్తి మద్దతుఉంటుందని తెలంగాణ సిఎఁ కేసీఆర్ అన్నట్లుగా వైఎస్ జగన్ ఫ్యాన్స్ ప్రచారం చేస్తున్నారు..ఇది నిజం కాదు..ఇప్పటిదాకా ఏ వేదికపైనా కేసీఆర్ తన మద్దతు ప్రకటించలేదు. తర్వాత అప్పటి పరిణామాల ఆధారంగా రాష్ట్రాలకు రావాల్సిన నిధులపై తన గళం కూడా కలిపితే కలపవచ్చేమొ కానీ ప్రస్తుతానికి మాత్రం జగన్ అవిశ్వాస తీర్మానంపై టిఆర్ఎస్ పెదవి విప్పిందే లేదు. కాబట్టి..శత్రువుకి శత్రువు మిత్రుడవుతాడనే కొణంలొ వైఎస్సార్సీపీ ఫ్యాన్స్ చేసుకుంటున్న ప్రచారమే తప్ప..అందులొ వాస్తవం లేదు
ఐతే సెషన్స్ మొదలైన తర్వాత వైఎస్సార్సీపీ టిఆర్ఎస్‌ని కలిసి మద్దతు కొరడం మాత్రం ఖాయం. పాలకపక్షాన్ని ఇరుకునబెట్టే ఏ అవకాశాన్ని కూడా విపక్షాలు వదులుకొవు..ఈ తీర్మానం నెగ్గదని తెలిసినా..తమ ప్రయత్నం మాత్రం తాము చేస్తాయ్. ఆ రకమైన పరిణామాలు తలెత్తినప్పుడే అసలు వాస్తవాలు బైటికి వస్తాయ్ తప్ప ఇప్పటికి బాహాటంగా ఈ అవిశ్వాసతీర్మానంపై (వస్తుందొ రాదొ తెలీని..ఎందుకంటే..ఈ సవాళ్ల పర్వం ఎలాంటి ముగింపు తీసుకుంటుందొ ఇప్పుడే చెప్పలేం కదా) ఎవరూ తమ అభిప్రాయం కూడా వ్యక్తం చేయలేదు
Comments
Post a Comment